11, జూన్ 2011, శనివారం

మొబైల్ చాటింగ్

మన భారతీయ వివాహ వ్యవస్థ  అంతా ..డొల్లతనం. పాశ్యాత్యదేశాలు గర్వించ దగినంత  గొప్పగా  ఇప్పుడు లేవంటే.. ఇప్పుడు..ఈ పోస్ట్ ఇలా వ్రాసిననందుకు..నా పై.. విమర్శల వర్షం  కురుస్తుందేమో! 40 % మాత్రమే.. వివాహాన్ని గౌరవించి.. బంధాలకి..విలువ ఇచ్చి.. సర్దుబాటు ధోరణితో జీవిస్తున్నారు.
  
వివాహ విచ్చిన్నతకి.. అనేకానేక కారణాలు.ఆడవారు గళం విప్పి ప్రశించడం తెలియని ఆ కాలంలో.. ఒక వేళ తెలిసి ప్రశ్నించినా.. ఆ మాటకి.. విలువలేని.. కాలమున..." మేడిపండు చూడు మేలిమై ఉండు".. లాగా.. అలా.. జీవితాలు తెల్లరిపోయాయి. ఆడ-మగ ఇప్పుడు.. సమాన స్థాయిలో.. కత్తులు నూరుకుంటున్నారు.

అణచివేత తనాన్ని సహించలేని స్త్రీలు.. ఒంటరి  జీవితాల పోరాటంలో.. సమస్యల నెదుర్కుంటూ.. పెనం పై నుండి పొయ్యిలో..పడినట్లు..భావన అయితే కాదు కానీ.. వారు ఆశించిన రీతిలో.. జీవనం సాగించలేకపోవడం.. లో..చాలా అసంతృప్తి ఉంది... వేరొక పురుషుడి తో  కలసి మనుగడ సాగించడానికి.. అనేక అభ్యంతరాలు .. ఉంటున్నాయి. అదే పురుషులకి..కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి. వాళ్ళు అరవై ఏళ్ళ వయసులో కూడా.. పెళ్లి కొడుకులయ్యే అనుకూల పరిస్థితులు..ఈ.. సమాజంలో.. ఒక వరం  అందుకే.. మగవాళ్ళు..తప్పులు చేసినా.. మగమహారాజు.. అయ్యాడు.. స్త్రీ దగా పడినది.. అవుతున్నదని.. ఓ.. మహిళా సంఘ సంస్కర్త .. ఓ..సభలో.. గొంతు చించుకుని.. చెబుతుంటే.. విని నవ్వుకుంటున్న పురుషులని చూసి.. ఈ..టపా వ్రాయాలనిపించింది  .     

మన వివాహ వ్యవస్థ చాల  గొప్పది.. ఎన్ని.. తుపానులు వచ్చినా.. పెను గాలులు వీచినా, వడగళ్ళు పడ్డా.. చలించని..గొప్పది..అనుకోవడం అంటే.. ముమ్మాటికి మోసం చేసుకున్నట్లే!.. చిన్నపాటి గాలికే ఆకు  రాలినట్లు రాలిపోతున్నాయి. సంప్రదాయం,కుటుంబం,సంస్కారం,నమ్మకం వీటి ప్రాతిపదిక పై..వివాహాలు జరుగుతున్నాయా..ఏమిటి? అన్నీ చూసుకునే ఆలోచించి తీసుకునే నిర్ణయాలవల్ల  జరిగిన వివాహాలు.. కూడా.. రెండు మూడేళ్ళు  సజావుగా సాగినట్లే  సాగి..విచ్చిన్నమవుతున్నాయి.

 అబ్బాయి కి.. బోర్ కొడుతున్దట. అమ్మాయికి.. అబ్బాయిలో.. అన్నీ లోపాలే కనబడుతున్నాయి.. వారి వాదనలో.. వెలుగు చూసే విషయం  ఏమంటే...జీవితంలో..ఎవరికి వారు.. గొప్ప అనే భావన.. అసలు..తగ్గ కూడదు.. ఒకరికొకరు గౌరవించుకోవాలి.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం అసలు.. నచ్చదు. సర్దుబాటులు అసలే కుదరదు. ఇవన్నీ సాద్యమా?  ఇంకొక ముఖ్య విషయం ఏమంటే..

వివాహ  వ్యవస్థని..పదిలం గా..కాపాడే అంతః సూత్రం ఎన్ని యుగాలు మారినా ఎన్ని మార్పులు వచ్చినా మారని ఒకే ఒక మంచి బాట. "ఒకే భార్య -ఒకే బాణం అన్న  రాముడుని..ఆదర్శంగా..చూడడం". ఇప్పటి కాలంకి..ఇది  అసలు నచ్చదు. భార్యాభర్తల మద్య ఆకర్షణ  తగ్గిపోయాక  దారి  మళ్లడం..చాలా సులభతరమైన రోజులివి.

ప్రక్కనే..పొంచి కూర్చుని ఉన్నట్లు..భార్యాభర్తల మద్య  మూడోమనిషి.. ఎపుడైనా ఎంటర్ అవ్వచ్చు.  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం  పుణ్యమా అని.. నట్టింట్లో..కూర్చుని నట్టడివిలో.. కూర్చుని కూడా ముచ్చట్లు..ఆడవచ్చు. మొబైల్ పుణ్యమా అని.. ఎన్ని కాపురాలు..కూలిపోతున్నాయో! పస్త్రేషన్ తో.. కూసింత మార్పు కనబడగానే.. అదే జీవితానికి..కావాల్సిన మార్పు అనుకుని తప్పుడు నిర్ణయాలతో.. జీవితాలని..నాశనం చేసుకుంటున్నారు కూడా.. నిజం తెలిసే అప్పటికి అంతా ముగిసిపోతుంది.. అప్పుడు ఎంత వగచినా ఏం ప్రయోజనం ?

 ఒక మొబైల్ చాటింగ్ వల్ల ఒక ఆత్మ హత్య ..ఇద్దరు పసి పిల్లలు తల్లిని కోల్పవడం ..జరిగింది  కానీ ఒక పురుషుడికి.. రెండు నెలలకే ఇంకొక భార్య వచ్చిన కథ ఇది.

నేను..  మరి కొంత మంది ఇరుగు-పొరుగు ప్రతి రోజు.. సాయంత్రం వేళప్పుడు.. ఉబుసుపోక,మార్పు కోసం ఓ పావు  గంట సేపు మా గేటు ముందు  నిలబడి వొచ్చేపోయేవారిని చూస్తూ నిలబడి కబుర్లు చెప్పుకుంటూ  ఉంటాం. సాయంత్రం  వేళ కాబట్టి  ఎక్కువుగా.. ఇంటి ముఖం  పట్టిన ఉద్యోగినులు.. వెళుతూ ఉంటారు.  రోజు..ఒక 25 -30  మద్య వయసు  ఉన్నఒకామె.. మొబైల్ ఫోన్ లో..మాట్లాడుకుంటూ..వెళుతుంటుంది.ఒకోసారి మనుషులు లేని చోట ఆగి నిలబడి మాట్లాడుతుంటుంది.. కొన్ని నెలల్లో  ఆదివారం మినహాయించి..రోజు అదే దృశ్యం మాకు అలవాటైపోయింది. ఆమె భర్త కూడా ఉద్యోగి.. ఆమె ఇద్దరు  పిల్ల తల్లి. ఈమెకి  ..ఇంత సంస్కార  లోపం ఏమిటి? ఫ్త్రెండ్స్ ఉండటం వాళ్ళతో..మాట్లాడటం తప్పు కాదు.. ఇంట్లో మాట్లాడలేని విషయాలు.. రోడ్డులో.. వెళుతూ కూడా ప్రతి రోజు ఏమి ఉంటాయి..?  సం థింగ్ ..రాంగ్..  అనుకునేదాన్ని.

 కొన్నాళ్ళకి..సడన్గా  ఆమె ఇంటినుండి చెప్పా పెట్టకుండా మాయమైనది.. భర్త ,పిల్లలు ఆమె కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.. అలా ఒక వారం గడిచేటప్పటికి.. కొన్ని విషయాలు బయట పడ్డాయి.. తన కొలీగ్ తో.. కలసి.. ఆమె..వెళ్ళిందని..  ఆమె కొలీగ్   కి..భార్య ఉంది..ఒక పాప కూడా ఉంది. ఇద్దరు భాద్యత గల  వేరు వేరు ఒక తల్లి- ఒక తండ్రి .వారి భాగ స్వామ్యులు. కుటుంబాలు.. ఇవేమీ కానరావు.. శరీరాల పట్ల ఆకర్షణతో.. జీవిత భాస్వామ్యులని..మోసం చేస్తూ.. ఎక్కువ కాలం  ఆ అక్రమ సంబంధాలు  కొనసాగించడం వీలుకాక వారి ఆనందం వారు వెదుక్కుంటూ.. వెళ్ళిపోయారు. ..ఆమె భర్త అది చిన్నతనంగా  భావించి.. బిడ్డలని.. ఆమె తల్లి దండ్రుల వద్ద వదిలేసి  .. రెండు  నెలలకే.. మరో..అనధికార  వివాహం చేసుకున్నాడు.. ఆమె కొలీగ్ ప్రియుడు   ఒక ఐదు ఆరు నెలలకి.. భార్యని వెదుక్కుంటూనో.. బలవంతంగా బంధువులు  లాక్కుని వెళితేనో.. వెళ్ళిపోయాడు.  ఆమె ఒంటరి ది.. అయి.. సమాజంలో.. విలువ కోల్పోయి.. (?) ఆత్మ హత్య చేసుకుని మరణించింది.  ఇక్కడ పురుషులు ఇద్దరు.. మళ్ళీ వివాహ జీవనంలో.. ఒదిగిపోయారు.. ఒక స్త్రీ.. భర్త  చేసిన చేష్టని..దిగమింగుకుని  .ఏమి  జరుగనట్లు..భర్త చుట్టూ..జీవితాన్ని చుట్టుకుని బ్రతికేస్తుంది.  పర పురుషుడి ఆకర్షణలో పడి.  అనీ కోల్పోయి.. మరణంని..ఆశ్రయించినది..స్త్రీనే   !

చదువుని ఉద్యోగాలు చేస్తున్నా విచక్షణ కోల్పోయి జీవితాలు నాశనం చేసుకుంటున్న స్త్రీల సంఖ్యా తక్కువేంకాదు.. కానీ..పురుషులకొక నీతి స్త్రీలకి ఒక నీతి చలామణి అవుతున్న.. ఈ..భారతీయ వివాహ వ్యవస్థలో.. పిల్లలు..బలి పశువులు.

 మన మద్య ఇన్ని నిస్సంకోచంగా జరిగిపోతుంటే..ఇంకా.. వివాహ బంధం పవిత్రత అనుకొనడం ఏమిటీ ?  అవి చలం గారి రచనా కాలంలోనే..ఉన్నాయి.. మన భారతీయ సమాజం ఒప్పుకోదు కానీ.. .. అన్ని వర్గాల ప్రజలలో..  ఇప్పుడు పెళ్లి  అనే అందమైన ఒక వల లో.. ఇమడలేని..స్వేచ్చ  ప్రవృత్తి  కల   స్త్రీ పురుషుల   జీవన చిత్రాలలో.. మొబైల్  చాటింగ్ కుటుంబాలని విడదీసే  ఒక సాధనం. అసంతృప్తులని.. వెళ్ళ బోసుకుని  సాంత్వన చేకూర్చుకునే మంత్రజాలం.

దూరాలు తరిగిపోతున్నాయి..సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ప్రపంచమే.. ఓ..కుగ్రామం.  ఇక భారతీయ వివాహ వ్యవస్థకి.. ప్రత్యేకత ఏముంది.. నలుగురితో..నారాయణ.  పాశ్చాత్య  సంస్కృతి అని అనుకోవడం  ఇకపై..బాగుండదేమో..! అనుకుంటూ..నే...

 ఒక జంట..నూరేళ్ళ పంట.. పండించుకోవాలంటే..అవగాహన ,సర్దుబాటు,ప్రేమ ,భాద్యత ఇవన్నీముఖ్యం.

 ఏ దేశంకి చెందినవారయినా  ఇవన్నీ   ఉన్న స్త్రీ  పురుషుల మద్య.. వివాహబంధం..పవిత్రం. కులాల, మతాల,జాతుల కందని అనిర్వచనీయ అనుబంధం... అని నా.. నిశ్చితాభిప్రాయం.                      

6 కామెంట్‌లు:

వాత్సల్య చెప్పారు...

చివరి పేరా లో కరెక్టు గా చెప్పారు.                
అలాగే మన సంస్క్రుతిలో తల్లి తండ్రులంటే గౌరవం లాంటివి వింటే నవ్వొస్తాయి. అలాంటివే ఉన్నట్లయితే చాలా మంది తల్లి తండ్రులకి రెండు మూడు నెలలకి ఒకసారి ఒకో కొడుకు దగ్గరకి తిరగాల్సిన అగత్యం ఉండేది కాదు.

మీరన్నట్లు మన సంస్క్రుతి ఏమీ గొప్పగా లేదిప్పుడు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

బాగా వొశ్లేషించారు. మీరు చెప్పిన కొన్ని statements పచ్చి నిజాలు. అయితే అందరూ ఒప్పుకోలేరు.

మనం గొంతు చించుకునేంత గొప్పగా మన భారతీయ వివాహబంధాలులేవన్నది కొంత వాస్తవమే!ఇక్కడ ఎక్కువ వివాహాలు "so called success"ని సాధించటానికి కారణం సర్దుకుపోయే మనస్తత్వమే. ఎక్కువమంది అలా సర్దుకుపోవడంకూడా సమాజంపట్ల జనులకున్న భయంవల్లనే. సమాజం ఏమంటుందో, ఎలా ట్రీట్ చేస్తుందో అని మాత్రమే.

కొన్నిసార్లు వివాహబంధాలు వేదింపుగా మారినప్పుడు తెగించివెళ్ళి ఒంటరొగా జీవించగల ధైర్యంలేక adjust అయీ రోజూ వేదనతో జీవించేవారు కోకొల్లలు! అలాంటి ఎన్నెన్నో జంటలను ఆధారంగాతీసుకుని మన భారతీయ వివాహ సంస్కృతిని కొలుస్తున్నాం. ఇది దౌర్భాగ్యం! మీరన్న మేడిపండు ఉదాహరణే వాస్తవం.

అవకాశంలేకనో, తెగీంపులేకనో ఎక్కువశాతంమంది మంచివారి జాబితాలో చలామణి అవుతున్నారు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Thank you very much..

అజ్ఞాత చెప్పారు...

నేను చదివిన బ్లాగు వారితో పోలిస్తే వస్తుతహా మీరు తటస్థ వైఖరి నవలంబించే వారని తెలుస్తున్నాది. కాని మీరు రాను రాను స్రీ పక్షపాతి గా అవుతున్నారనిపిస్తున్నాది. నిజజీవితంలో సంఘటనులు ఇలానే ఉంటాయి.
మహేష్ భట్ మడ్డర్ సినేమాలో చూపినట్లు భార్య మాజి ప్రియుడితో తిరిగి ఆనందించవలసిందంతా ఆనందించి, తప్పై పోయింది, తెలీయని తనం లో తప్పు చేశాను అంటె, భర్త పెద్ద హృదయం తో ,భార్య తో మళ్ళి కలసి కాపురం చేసినట్లు చూపించి సినేమావారు డబ్బులు చేసుకొంటారు.
ఇన్ని నాళ్ళు ఒకరి కంటే ఎక్కువ స్రీలతో సంబంధాలు మగ వారికే ఉంటాయని నమ్మే మన సమాజం, ఇప్పుడు ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరచుకొంట్టునాది. స్రీలు కూడా పురుషుల లాంటివారే అని, ఇన్ని రోజులు డబ్బుల చలామణి తక్కువగా ఉండటం వలన సాంప్రదాయం ముసుగులో, ప్రేమ పేరు చెప్పి మగ వారితో కలసి ఉన్నారని అదే చదువు, ఆత్మవిశ్వసం, నాలుగు డబ్బులు స్రీల చేతిలో మెదలిన తరువాత వారి కూడా మొగుడు బోర్ కొట్టి, ఇద్దరు పిల్లలున్నా కూడా ఆ మాతృ హృదయం ఎక్కడా కొంచెం కూడా బలహీనతకు లోను కాకుండా తన ఆనందం కొరకు పరాయి మగవారితో హాపిగా పరారు అయ్యారని తెలుస్తున్నాది. ఆ తరువాత సంఘటన సమాజం లో స్రీ కి గల హద్దులు ,పరిమితులను చూపించింది అని అనిపించింది.

SriRam

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Anonymous గార్కి.. నేను.. స్త్రీ పక్షపాతి అయిఉంటే.. ఈ..పోస్ట్ వ్రాసి ఉండేదాన్ని కాదు. ఒక పురుషుడు..ఒక స్త్రీ..ఇరువురు కలసి.. తప్పు చేస్తే.. సమాజంలో.. స్త్రీ కి.. ఎలాటి విలువ ఉందో.. పురుషుడు ఎలా చెలాయించు కుంటున్నాడో..తేడా ని మాత్రమె.. చెప్పాను.. నా సానుభూతి.. అంతా.. పిల్లల పట్ల.. నిరసన అంతా.. వివేకం లోపించిన..భార్యాభర్తల పై. నాణానికి..రెండు వైపులా.. చూడాలనుకునే.. మానవతా.. వాదం ..నా..వాదం. స్పందించిన మీకు.. ధన్యవాదములు

అజ్ఞాత చెప్పారు...

వనజ గారు,
ఈ విషయం పై నేను చూసిన అనుభవాలు ఎన్నో ఉన్నా, అవి రాయాలంటే చాలా సమయం పడుతుంది. కాని ఒక చిన్న అనుభవం రాస్తున్నాను. ఒకరోజు ఆఫీసులో నా మితృడి తో మాట్లాడటానికి వెళ్ళాను, అతను టేన్షన్ గా ఉన్నాడు. కాని ఆఫీసు కనుక నిబ్బరాన్ని ప్రదర్సిస్తూ మాట్లాడుతున్నాడు. మాటల్లో అతని చేయి నాకు తగిలింది. అది ఎంత చల్లగా వుందంటె అంత చల్లగా ఉంది. నేను అతనినితో ఎందుకు నీ ఒళ్లు ఇంత చల్లగా అయిందని అడగటం మొదలు పెట్టాను. నిన్ను ఎమైనా జాబ్ లో నుంచి తీసివేశారా అంటె అతను అంత చిన్నదానికి నేను ఎందుకు వొత్తిడికి గురౌతాను అని అన్నాడు. ఇంతలో అతనికి యస్.యం.యస్. వచ్చింది. దానిని అతను నాకు చూపించాడు. అది అతని భార్య బెదిరిస్తూ రాసిన మేసేజ్. అతని కూతురికి జ్వరం వస్తే ఇతని అమ్మ మందులతో పాటుగా ఎదో పాత పద్దతి కూడా పాటించమని చెప్పడమే. అది అతని భార్యకి నచ్చలేదు. అంతే అతని అమ్మతో ఆవిడ తగువు వేసుకొని ఇతనిని వాయించటం మొదలు పెట్టింది. ఇది చూడటానికి చిన్న విషయం లాగా వినేవారికి అనిపించవచ్చు కాని అతని అమ్మా, భార్య అతనికి పోన్ల పైన పోన్లు,యస్.యం.యస్. పంపి అతనిని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆ దేబ్బతో అతని బాడి టెంపరేచర్ పేళ్ళాం ఇచ్చిన దమికీకి పడిపోయింది. ఆ తరువాత అతను తను రోజుపడే అష్ట్ట కష్ట్టాల గురించి చెప్పాడు. నాకు తెలిసి మగ వారికి పెళ్ళి వలన పెద్దగా ఒరిగేది ఎమీ లేదు అని అనిపించింది. పిల్లలు, వంశం ఇలాంటి వన్ని సంస్కృతిక పరంగా మగ వాడి మీద రుద్దిన భావాలు.
వీరి కొరకు అతను పడే కష్ట్టం వర్ణనాతీతం. భార్య అడిగే కోరికలు, ప్రశ్నలన్ని వినటానికి చాలా తార్కికం గా ఉంటాయి. వాటిని తీరుస్తూ, జవాబులు ఇస్తూ పోతే మగ వారికి భార్య ఒక్కటి మిగిలి తల్లిదండృలు, తోబుట్టువులు, మిత్రులు, బంధువులు అందరూ దూరమౌతారు. వీరిని అందరిని బాలేన్స్ చేయలేక మగవాళ్ళ పరిస్థితి ఈ యస్.యం.యస్.ల కాలం లో చాలా దుర్భరం గా తయారైయింది. పెళ్ళి చేసుకొన్న మరుక్షణం టెన్షన్ ప్రారంభం.