28, నవంబర్ 2019, గురువారం

సంఘసంస్కరణలు చేసినంత గొప్పగా ...

ప్రస్తుత ప్రభుత్వం చేతివృత్తులవారికి ఆర్ధిక భరోసా కల్గించే పధకం ఒకటి అనౌన్స్ చేసిందట. రేపటితో ఆఖరి రోజు అని చెప్పుకుంటుంటే విన్నాను.దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా కావలిసినవి .. లేబర్ సర్టిఫికెట్ ,కులధ్రువీకరణ పత్రం , అఫ్లికేషన్ పెట్టుకున్నందుకు మొత్తం కలిపి Rs / 610.
ఈ సేవ కేంద్రాలవద్ద జనం బారులు తీరి ఉన్నారు.

గ్రామాలలో వాలెంటీర్స్ డోర్ టు డోర్ వెళ్లి అప్లై చేసుకోమని చెపుతున్నారట . పెడదాము పోయేది ఏముంది ? అంతకన్నా ఇరవై రెట్లు ఇస్తాడట . అని చెప్పుకుంటున్నారు.
వాలెంటీర్స్ కి జీతం .. ముందు రెండు నెలలు అయిదు వేలు లెక్కన చెల్లించారట . ఈ నెల నుండి ఎనిమిది వేలు జీత వస్తుందట . వాళ్ళ పని ... డోర్ టు డోర్ ప్రచారం చేయడం ..అదేలేండి .. ప్రభుత్వ పధకాల గురించి ప్రజలకు అవగాహన కల్గించడం ..ప్రజలకు లబ్ది చేకూర్చడం.
అందుకేనేమో ... తెల్ల చీరలు కట్టుకున్న వాలంటీర్ .. బెల్ కొట్టి మరీ "స్వస్తత సభ "లకు రమ్మని ప్రకటన - ఆహ్వాన పత్రం చేతిలో పెడుతుంది బలవంతంగా ..అని చెప్పింది నా ఫ్రెండ్ .  
నేను .. ఆ మతం కాదన్నా వినలేదు. ఒకసారి వచ్చి చూడండి అంటూ బలవంతం చేస్తుంటే విసుక్కున్నాను. తల్లీ..  నీకు ఈ పని చేసినందుకు జీతం భత్యం ఉంటాయేమో కానీ నీతో వాగడానికి నేను శేరు బియ్యం అన్నం తినాలి. పైగా నేను వైట్ హోల్డర్ ని కూడా కాదు. వితంతు పెన్షన్ బాపతు కూడా కాదు ..నన్ను విసిగించక వెళ్ళమ్మా ... అని బలవంతంగా నెట్టాల్సి వచ్చింది. 
చాలా ఊర్లలో ..వాలంటీర్లు చేసే ఉద్యోగం ఇదేనని చెపుతుంటే ..ఆశ్చర్యపోలేదు ఆలోచన చేస్తున్నా. 

స్కాలర్షిప్ ల పేరిట కు ధ్రువీకరణ పత్రం, పేదవారికి వృత్తి భరోసా పధకం దానికి కుల ధ్రువీకరణ ..ఇంకా చాలా వాటికి కుల దృవీకరణ తప్పనిసరి చేస్తున్నందుకు అనుమానం కల్గుతుంది. ఎందుకు .. ఈ కుల ద్రువీకరణలు .. అంటే .. సమీకరణాల కోసమే కదా ! మీరూ ఆలోచించండి మరి. 
రైతు భరోసా పధకానికి అర్హులైన వారిని తొలగించిన ప్రభుత్వం ఆటో వాలాలకు చేతి పనుల వారికి ఆర్థికసాయం చేయగల్గుతుందా .. ప్రజలు నమ్ముతున్నారా ? :) 
అబ్బా.. మతవ్యాప్తికి సంఘ సంస్కరణలు చేసినంత గొప్పగా ప్రభుత్వాలు పనిచేయడం సిగ్గుపడే విషయం కదా ! అని సిగ్గుపడుతూ .. 

కామెంట్‌లు లేవు: