ఒక రోజు ..
అభిమాన నటుడి వెనుక నీడగా, చెంచాల్లాగా మారితే ఏం వస్తుంది? డబ్బా కొట్టుకోవడం తప్ప.
మన రోల్ మోడల్ మనకి గుండెల్లో ఉండాలి. మనకి ప్రతిపనిలో స్పూర్తి కల్గించాలి
ఎవరినో గుడ్డిగా అనుసరించడం అంటే మఱ్ఱి చెట్టు క్రింద మొక్కలా మారిపోవడమే ! ఎవరి అస్తిత్వం వారు కాపాడుకోవాలి ..అదే అసలు గుర్తింపు ..అని చెప్పాను నాకొడుక్కి.
NTR, NBK, JrNTR ల మత్తులో నుండి బయటపడ్డాడు. తన పరిధిలో తనొక హీరో ఇప్పుడు.
ఇంకో రోజు ..
గాంధీ మహాత్ముడంటే అసలు వొప్పుకోను. నీకు తెలియదు వూర్కో .. అమ్మా ..అంటాడు.
గాంధీ ఆచరించిన వ్రతం అహింస మార్గం ప్రపంచం మొతానికే ఆదర్శం .. అందుకే ఆయనే నా హీరో అన్నాను.
ఉత్తర కొరియా అణుపరీక్షలతో ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్నరోజులివి.
గాంధీ అహింసా మార్గం విలువ తెలుసుకోవాల్సిన రోజులు కూడా ఇవే ... ఈ రోజే కాదు ..ఎప్పటికీ ఎప్పటికీ ..కూడా !
మైల్లవరపు గోపి గారు వ్రాసిన సినీ సాహిత్యం చూడండి ..ఎంత ఆర్ద్రత నిండి ఉంటుందో .. గాంధీ పుట్టినదేశం చిత్రంలో పాట యిది
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం ఈశ్వర అల్లా తేరేనాం సబకోసన్మతి దే భగవాన్
భేదాలన్నీ మరచి మోసం ద్వేషంవిడచి మనిషి మనిషిగా బ్రతకాలి ఏనాడూ నీతికి నిలవాలిః బాపూ ఈ కమ్మని వరమే మాకివ్వు అవినీతిని గెలిచే బలమివ్వు
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి బాపూ నీ చల్లని దీవెన మాకివ్వు నీ బాటను నడిచే బలమివ్వు --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి