నా గీత మాల ఆమనీ ! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా గీత మాల ఆమనీ ! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జనవరి 2014, శుక్రవారం



నా గీత మాల ఆమనీ


కొత్త సంవత్సరం - గొప్ప శుభ సూచకం  విహంగ లో ..


కొత్త సంవత్సరం - గొప్ప శుభసూచకం 

కాలం ఒడిలో .. అనుభవాల ఒరవడిలో .. ఒక సంవత్సరం  కరిగిపోయింది. 

కాలం అద్దంలాంటిది . అంధ యుగమైనా స్వర్ణ యుగమైనా .. అది మన ప్రతిబింబం .. అన్నారు దేవరకొండ బాల గంగాధర తిలక్ . 

అది నిజం కూడా . 

 కాలం కౌగిలిలో  ... మనమందరం బందీలం.  

మనిషి స్వార్ధంతో చేసే వినాశకర చర్యల వల్ల అంతుచిక్కని వ్యాధులు , నివారణ చిక్కని రోగాలు , పర్యావరణ నాశనం వల్ల  ప్రకృతి  వైపరీత్యాలు  సంభవించి అనేకానేక విధాలుగా ఫలితాలని అనుభవిస్తూ కూడా మానవుడు సత్యాన్ని గుర్తించలేక   మంచైనా చెడైనా కాలానికి ఆపాదించి  రాబోయే కాలం మంచిగా ఉండాలని ఆశిస్తూ  ముందుకు సాగుతూ ఉంటాం .

కాల ప్రవాహంలో.. మనమందరం మునకలు  వేయాల్సిందే ! కాలానికి ఎదురీది నిలిచిన వారెవ్వరు ఉండరు..కాని కొత్తకి ఎప్పుదు స్వాగతం చెపుతూ పాతకి వందనం చెప్పెస్తాము . 

అందుకే .. 

నిన్న ఒక జ్ఞాపకం
నేడు ఒక కల
రేపు ఒక ఆశ ..గా..
క్షణమైనా..మనఃస్పూర్తిగా ..శ్వాసించి..
ఆశించి..భాసించి..  మానవుడు తోటి జీవుల పట్ల మానవత్వ పరిమళాలని  వెదజల్లగల్గితే అంతా శాంతి మయమే ! 

అందుకే ఈ కవి "స్నేహాలు లేక ఏముంది జగతి 
స్నేహాలలోనే దాగుంది ప్రగతి " అంటారు నిజమే కదా ! 

కాలానికి ప్రతీక సూర్య చంద్రులు .  ఆరు ఋతువులు ఆమని పాటలు. వీటి మధ్య సకల కోటి ప్రాణులు ఆహ్లాదంగా ఆనందంగా గడచిపోవాలని కోరుకుంటారు  హరివిల్లులోని రంగులన్నిటిని అనుభూతి కుంచెకి అద్ది  జీవన చిత్రాన్ని శోభానమయంగా విలసిల్ల జేసుకోవాలని కలలు కంటారు .   హేమంత తుషారాలు పుడమిని దుప్పటిగా కప్పేసే కాలం డైరీ లోని చివరి పేజీ అనుభవలా చిట్టాగా మడిచిపెట్టి ..రాబోయే కాలాన్ని సరి క్రొత్త ఆశలతో ,సరి క్రొత్త ఆకాంక్షలతో   అన్నీ నెరవేర్చుకుని ఆనందం నింపుకోవాలని కోరుకుంటూ .. ఆనందంగా ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ వేడుకలు జరుపుకోవడం ని ..ఒక పాటలో మనం  గమనించవచ్చు .   

ఈ పాట.  " మంచు పల్లకి "  చిత్రంలో పాట. గీత రచయిత మైలవరపు  గోపి. సంగీతం రాజన్-నాగేంద్ర , గాయనీ గాయకులు ఎస్ .పి . బాలసుబ్రహ్మణ్యం , ఎస్ .జానకి బృందం 

నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం  
మంచి తెస్తావని మంచి చేస్తావని 
వెల్కం వెల్కం న్యూ ఇయర్  గుడ్ బై ఓల్డ్ ఇయర్ 
వచ్చే వచ్చే  న్యూ ఇయర్  హ్యాపీ న్యూ ఇయర్  || 2|| 
మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులివ్వు ... 
 
 చరణం : ప్రతి డైరీలోను  ప్రతి పేజీలోను హాయిగా సాగిపో 
 గురుతుగా ఉండిపో 
చల్లగా దీవించు మా కోరిక మన్నించు 
ఈ ఏటి కన్నా పై ఏడు మిన్న 
పోయింది చేదు రావాలి తీపి  హ హ హ హ హ హ 
హే హే.. హ్యాపీ న్యూ ఇయర్ ..
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్  గుడ్ బై ఓల్డ్ ఇయర్ 
కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం  ||2||

నీ కోసమే మేమందరం నీ రాకకై ఈ సంబరం 
కొత్త సవత్సరం గొప్ప శుభ సూచకం 
నీ కోసమే మేమందరం నీ రాకకి ఈ సంబరం 
కొత్త సవత్సరం గొప్ప శుభ సూచకం  
న్యూ ఇయర్ ల ల లాల న్యూ ఇయర్ ల ల లాల 

చరణం: 2 : దొరికింది మాకు సరికొత్త స్నేహం 
నేడు నీ రాకతో నిండు నీ నవ్వుతో 
వెన్నెలై సాగిరా   గుండెలో ఉండిపో 
స్నేహాలు లేక ఏముంది జగతి 
స్నేహాలలోనే దాగుంది ప్రగతి 

నీ కోసమే మేమందరం నీ రాకకి ఈ సంబరం 
కొత్త సంత్సరం గొప్ప శుభ సూచకం 
వెల్కం వెల్కం న్యూ ఇయర్  గుడ్ బై ఓల్డ్ ఇయర్ 
కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం ...||2|| 

మానవ మేధస్సు , నిర్విరామ కృషి   విశ్వమానవ శ్రేయస్సుకి  ఊపిరిపోసి  కాలాలు ఎన్నైనా ,  ఋతువులెన్నైనా,  దినములేన్నైనా కాలం  కన్నేర్ర్రజేయకుండా  అందరికి మంచి చేయాలనే ఆకాంక్షిస్తూ  ప్రతి ఒక్కరు వారి వారి  ముద్రలని  .. సింధువులో  ..బిందువుగా మిగిల్చి వెళ్లేందుకు.. కృషి  చేసేందుకే..ఈ..కాలం.. మనకి.. రేపుని..  ఇచ్చిందని.. భావించాలని.. మనవి..చేస్తూ..

కాలం ఒడిలో కరిగిన క్షణాలు సరి క్రొత్త జీవితారోహాణానికి.. అనుభవపాఠాలు

మిత్రులారా! మీ..అందరికి.. హృదయపూర్వక.. నూతన సంవత్చర  శుభాకాంక్షలు.... అందిస్తూ .. 

 ఈ నూతన సంవత్సర ఆరంభం మన భారతీయ కాలమానం కాకపోయినా విశ్వమంతటా మరో సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్న కాలం కాబట్టి విశ్వ మానవ  శ్రేయస్సు  కోరుకుంటూ  గత కాలం మిగిల్చిన చేదు తీపి అనుభవాల నుండి మంచిని గ్రహించి ఇక ముందు కాలంలో కూడా మంచిని ఆకాంక్షిస్తూ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ .. ఈ పాట

5, డిసెంబర్ 2013, గురువారం

అణువు అణువునా వెలసిన దేవా

ఈ ప్రపంచమంతా ఓ..పక్షి గూడు లాంటిది  కృత్రిమమైన ఎల్లలు,సరిహద్దులూ ఏవి లేని అందమైన వసుదైక కుటుంబంగా ఉండాలని కవి ప్రగాడమైన ఆకాంక్ష ఒక పాటలో నేను గమనించాను.  ఎక్కడ చూసినా ఆకలితో అలమటించి పోతున్నవారు, వర్గజాతి బేధాలతో,,లింగ వివక్షతో , అసమానతలతో వెలివేయబడుతున్నవారే కనబడుతున్నారు. ఎక్కడ చూసినా అధికార తృష్ణ,అర్ధ పిపాసతో ప్రాకులాడే మానవులనే చూస్తున్నాం,శాంతి,అహింస  కనుమరుగై మానవుడు మానవుడిగా ఉండే లక్షణాలు లోపిస్తున్నాయి. ఇవన్నీ గమనించిన కవి ఈ పాటలో తన ఆవేదనకీ అక్షర రూపం ఇచ్చి హృదయాలని మేల్కొలిపే భాద్యత చేపట్టారా ..అని ఈ పాట వింటున్నప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. ఆ పాట మానవుడు -దానవుడు చిత్రంలో పాట. పాట రచయిత  డా:సి.నారాయణ రెడ్డి గారు. 40 సంవత్సరాల క్రితం వచ్చిన చిత్రంలోని  ఈ పాట అవసరం ఇప్పుడు చాలా ఉంది. ముఖ్యంగా  స్వార్ధ రాజకీయ నాయుకులకి , స్వచ్చంద సేవా సంస్థల ముసుగులో నిధులని  దోచుకునే దొంగలకి, కళ్ళ ముందు కనబడే దీనుల ఆక్రందనలు కనబడని,వినబడని బధిరులకి, ముఖ్యంగా వైద్యం పేరిట అక్రమార్జనకి పాల్బడుతున్న వైద్యులకి , అంతుచిక్కని వ్యాధుల బారిన బడ్డ వారిపట్ల వివక్ష చూపుతున్న వారికి ఈ పాట వినిపించాలని అనిపిస్తూ ఉంటుంది. మంచి మనసు ఉన్న వారికి వారిలో అంతర్లీనంగా దాగున్న దయార్ద్రత,కరుణ, మమత వెల్లువలా పొంగి విశ్వమానవసౌహార్ధం, సౌభ్రాతత్వం పెంపొందించాలని కోరుకుంటూ ..ఈ పాట పరిచయం    


నా గీతమాల ఆమనీ .. లో  ఈ లింక్ లో 


సకల ప్రాణ కోటిలో మానవుని ఉనికి ఉదాత్తమైనది. వివేకవంతమైన మానవుడు ఇతర జీవకోటి పట్ల, తోటి మానవుల పట్ల దయార్ద్ర హృదయుడై మెలగాలి కానీ మానవుడు దానవుడిగా మారి హింసాత్మక ప్రవృత్తితో మెలుగుతూ ఇతరులకి బాధని కల్గిస్తున్నాడు


నేడు మానవ సమాజంలో ఒకరి పై మరొకరికి ప్రేమ, అనురాగం, ఆప్యాయతఅన్నీ కనుమరుగై పోతున్నాయి మనిషికి మనిషే శత్రువైపోతున్నాడు  దయ,సత్యం,కరుణ లాంటివి అంతరించిపోతున్నాయి. మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే ఇలాంటి పాటల అవసరం ఉంది 


 "మానవ సేవే మాధవ సేవ " గా భావించి సమాజంలో నిరాదరణకి గురైన అన్నార్తులకి, వ్యాదిగ్రస్తులకి  అండగా నిలిచిన  అమృత మూర్తులు కొందరు తోటి మనుజుల పట్ల అపారమైన ప్రేమతో మెలుగుతూ వారి  అమృత గుణం తో సేవలందించారు. పేదలకి చదువు చెప్పడం,  అనాధలకి సేవ చేయడం కరుణ, శాంతి, సహనం ప్రదర్శిస్తూ  సేవా గుణం తో నడచిన   వారి అడుగు జాడలలో నడవాలని కోరుకుంటూ ఈ పాట మొదలవుతుంది. 


జాతికి జాతి అంధకార బంధరంలో మునిగి పోయినప్పుడు జాతిని చేతన పరుస్తూ..  పరపీడన నుండి జాతిని కాపాడాలని స్వేచ్చా స్వాతంత్ర్యాలు   కావాలని ఆకాంక్షిస్తూ వారి నిస్వార్ధ గుణంతో అహర్నిశలూ శ్రమించిన త్యాగధనుల గుణాన్ని మనకి అందించాలని 


 "వైద్యో నారాయణ హరి" అన్నట్లు కొత్త కొత్త వ్యాధుల పాల్బడి వైద్య సేవలు అందక ఎందఱో దీనులు అకాల మరణంకి గురిఅవుతున్నప్పుడు నిస్వార్ధంగా వైద్య సేవలందించి జీవనదాతలుగా మారే వారి గుణాన్ని కూడా సామాన్యమైన మన మానవులందరికీ అందించమని కోరుకుంటూ .. కుల మతాలకతీతంగా విశ్వమానవ శ్రేయస్సుని కోరుకుంటూ సామూహికంగా చేరి అణువు అణువునా ఆర్తిని నింపుకుని ప్రార్దించే గీతం ఇది. ఈ గీతానికి  అశ్వత్థామ  సంగీతమందించారు . ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బృందం ఈ పాటని ఆలపించారు.  


    


ఈ పాట వీడియో లింక్ 

చిత్రం : మానవుడు - దానవుడు (1972)

సంగీతం : అశ్వద్దామ గీతరచయిత : సినారె నేపధ్య గానం : బాలు 
చిత్రం : మానవుడు - దానవుడు (1972)

పల్లవి:
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువును అణువున వెలసిన దేవా

చరణం 1:
మనిషిని మనిషే కరిచే వేళ
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పుని మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
ఆ.....ఆ.....ఆ.....ఆ....ఆ...
అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృతగుణం మాకందించ రావా
అమృతగుణం మాకందించ రావా
అణువును అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
అణువును అణువున వెలసిన దేవా

చరణం 2:
జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృ భూమి మొరపెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర్య ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ...ఆ...ఆ...
ఆ.....ఆ.....ఆ....ఆ...ఆ...
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మా కందించ రావా
త్యాగ నిరతి మా కందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కను వెలుగై నడిపించ రావా
అణువు అణువున వెలసిన దేవా

చరణం 3:
వ్యాధులు బాధలు ముసిరే వేళ
మృత్యువు కోరలు చాచే వేళ
గుండెకు బదులుగ గుండెను పొదిగీ
కొన ఊపిరులకు ఊపిరిలూదీ
జీవన దాతలై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
ఆ....ఆ....ఆ....ఆ....ఆ.....ఆ...
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించ రావా
సేవా గుణం మాకందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా .. 


6, నవంబర్ 2013, బుధవారం

ఏటి లోని కెరటాలు

బాధ నిండిన మనిషి  హృదయం భారమైనప్పుదు ఆ భారాన్ని తగ్గించేడి కన్నీరే !  మనిషిలో ఉండే  సున్నితమైన భావోద్వేగాలని ఎల్ల కాలం అణచి పెట్టడం సాధ్యం కాని పని. ఎంత అణుచుకున్నా  ఎప్పుడో ఒకప్పుడు అంతరంగం బహిర్గతమవుతూనే ఉంటుంది. చేసిన తప్పిదాలు,, పొందిన ప్రేమాను రాగాలు, దూరం గా ఉన్నప్పుడు అనుభవించిన ఏకాకితనం లో నుండి బయటపడి తనవారిని వెదుక్కునే టప్పుడు  వారిలో జరిగే సంఘర్షణ, ఆత్మ పరిశీలన మొదలై    ఒకేసారి అన్ని భావాలు ముప్పిరిగొని,    హృదయం ఆర్ద్రంగా మారి   కన్నీరు పెల్లుబికి మనసుని పునీతం చేస్తుంది. అప్పుడు తనకి తనవారికి మధ్య ఉన్న దూరాలు తరిగి పోయి ఆనందం తో మనసు మయూరమై ఆడుతుంది .

ఇలా ఒక పాట గురించి .. పరిచయం 

నా గీతమాల ఆమనీ .. లో .    ఈ లింక్   "విహంగ" లో చూడండి 

ఉయ్యాల - జంపాల  చిత్రంలో  పాట పరిచయం  

ఈ పాటని జగ్గయ్య గారి మీద చిత్రీకరించారు . 

ఈ పాట  ఎప్పుడు విన్నా ప్రతి మనిషి తన అంతరంగాన్ని తడుముకునేటట్లు  ఉంటుంది.  చెట్టు ఎంత పెరిగినా మూలాలు నేలలోనే  విస్తరించి ఉన్నట్లు  మనిషి ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎంత ధనం గదించినా  వారిని  వారి వారి  మూలాలు నుండి  ఎవరూ విడదీయలేరు అనడానికి ఈ పాట ఒక చక్కని ఉదాహరణ .   

ప్రపంచ దేశాల మధ్య దూరాలు తరిగిపోతున్నాయి. సరిహద్దులు చెరిగిపోతున్నాయి.    

ఆధునిక జీవన సరళి లో విద్యనభ్యసించడానికి  ఉపాది అవకాశాలని  వెదుక్కుంటూ  ఉన్న ఊరుని కన్న తల్లి దండ్రులని, అయినవాళ్ళందరినీ విడిచి వేల వేల మైళ్ళు దూరానికి  వలస వెళుతున్నారు. అక్కడ వారు ఎదుర్కునే వెతలు కి వెరవకుండా  , ప్రతికూల వాతావరణం ని తట్టుకుంటూ కూడా జీవన పోరాటం సాగిస్తున్నారు కూడా . అయినప్పటికీ వారి మనస్సులో మాతృ  దేశం పట్ల  ఉన్న ప్రేమ ,సొంత ఊరిపై మమకారం ఎన్నటికి తగ్గదు . ఏటి లోపలి కెరటాలు యేరు విడిచి ఎలాగైతే పోలేవో  మనిషి ఎదలోపలి మమకారం కూడా ఎక్కడి పోదు పల్లవితో మొదలైన ఈ పాట ఆసాంతం హృద్యంగా సాగుతుంది.  

కుటుంబ  సభ్యుల మధ్య ,స్నేహితుల మధ్య నెలకొన్న తీయని అనుబంధం చాలా గాడమైనది. మనుషుల మాటలవల్ల,చేష్టల వల్ల   గాయ పడిన హృదయాలకి  గతంలో వారి మధ్య ఉన్న అనుబంధం,తీయని జ్ఞాపకాలే వారి వారి బంధాన్ని నిలిచేటట్టు చేస్తాయి . రక్త సంబంధం అన్ని బంధాల కన్నా బలమైనది . ఎన్ని విభేదాలు ఉన్నా, ఎంత శతృత్వం నెలకొన్నా  తమ వారికి కష్టం కల్గినప్పుడు క్షణ కాలంలో వారిని ఏకం చేస్తుంది 

బాధ నిండిన మనిషి  హృదయం భారమైనప్పుదు ఆ భారాన్ని తగ్గించేడి కన్నీరే !  మనిషిలో ఉండే  సున్నితమైన భావోద్వేగాలని ఎల్ల కాలం అణచి పెట్టడం సాధ్యం కాని పని. ఎంత అణుచుకున్నా  ఎప్పుడో ఒకప్పుడు అంతరంగం బహిర్గతమవుతూనే ఉంటుంది. చేసిన తప్పిదాలు,, పొందిన ప్రేమాను రాగాలు, దూరం గా ఉన్నప్పుడు అనుభవించిన ఏకాకితనం లో నుండి బయటపడి తనవారిని వెదుక్కునే టప్పుడు  వారిలో జరిగే సంఘర్షణ, ఆత్మ పరిశీలన మొదలై    ఒకేసారి అన్ని భావాలు ముప్పిరిగొని,    హృదయం ఆర్ద్రంగా మారి   కన్నీరు పెల్లుబికి మనసుని పునీతం చేస్తుంది. అప్పుడు తనకి తనవారికి మధ్య ఉన్న దూరాలు తరిగి పోయి ఆనందం తో మనసు మయూరమై ఆడుతుంది . 

అందరికి అర్ధమయ్యే సరళమైన పదాలతో .ఎంత బాగా వ్రాసారు ఈ కవి .  అంతా నిజమే కదా .! అనుకుని హాయిగా వింటూ ఉంటారు. ఇంత కన్నా పాట కి పరమార్ధం ఏముంది ?   

  ఈ పాట  సాహిత్యం "ఆరుద్ర"  గారని కొందరు , కొసరాజు రాఘవయ్య చౌదరి గారని కొందరు ..ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి  సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు గారు . 

గాయకుడు : మంగళంపల్లి  బాలమురళీ కృష్ణ 

ఏటి లోని కెరటాలు  ఏరు విడిచి  పోవు     
ఎదలోపలి  మామకారం ఎక్కడి కి పోదు  ॥ 
   
 ఏటి లోని కెరటాలు  ఏరు విడిచి  పోవు     
ఎదలోపలి  మామకారం ఎక్కడి కి పోదు

ఊరు విడిచి వాడ  విడిచి  ఎంత  దూరమేగినా  .. 
ఊరు విడిచి వాడ  విడిచి ఎంత  దూరమేగినా 
సొంత ఊరు అయినవారు అంతరాన ఉందురోయ్

ఏటి లోని కెరటాలు  ఏరు విడిచి  పోవు     
ఎదలోపలి  మామకారం ఎక్కడి కి పోదు 

పెంచుకున్న  కొలది  పెరుగు  తీయని  అనుబంధమూ  
పెంచుకున్న  కొలది  పెరుగు  తీయని  అనుబంధమూ ...  
గాయపడని  హృదయాలని జ్ఞాపకాలే అతుకు 


ఏటి లోని కెరటాలు  ఏరు విడిచి  పోవు     
ఎదలోపలి  మామకారం ఎక్కడి కి పోదు 

కన్నుల  నీరు చిందితే  తేలికవునులే 
కన్నుల  నీరు చిందితే  తేలికవునులే 
 తనకి తనవారికి  ఎడబాటే  లేదులే  ఎడబాటే లేదులే . 

ఏటి లోని కెరటాలు  ఏరు విడిచి  పోవు     
ఎదలోపలి  మామకారం ఎక్కడి కి పోదు  

ఈ పాట  వీడియో లింక్  ఎక్కడ  లభ్యం కాకపోవడం వల్ల జత పరచలేకపోయాను. ఇంతకూ ముందు ఈ చిత్రం చూసినవారు  శబ్ద చిత్రాన్ని వింటూ పాట  దృశ్యం ని  గుర్తుతెచ్చుకుంటూ ఆస్వాదనలో మునిగి తేలండి . ఇంకో మంచి పాటతో  మరొక నెల లో కలుసుకుందాం మరి .   : 
   .

4, అక్టోబర్ 2013, శుక్రవారం

పూచిన కొమ్మ "అమ్మ "

నిత్య జీవితంలో..సమస్యలతో,చికాకులతో..అతలాకుతలం అయిపోతున్న మనిషికి..ఆహ్లాదం ని ఇచ్చి..మనసుకి సేద దీర్చే  శక్తి.. సంగీతానికి తప్ప వేరోకదానికి లేదు.అందుకే  ..నాదం లోనే మోదం ఉంది..అంటారు..కదా..!   అందుకే ఇప్పుడు మనకి  చిన్నా పెద్దా అందరు    పరవశించి  పోవడానికి , వినడానికి పాట ఒక సాధనం   పాట.. వినోదాన్ని  పంచి గాలి అలలపై తేలియాడించడమే కాదు,ఆలోచింపజేస్తుంది కూడా..  పాట.. వినోదాన్ని  పంచి.. .   గాలి అలలపై.. తేలియాడించడమే కాదు.. ఆలోచింపజేస్తుంది కూడా..

కొన్ని పాటలు   వింటూ ఉంటే అరటి పండు ఒలిచిపెట్టినట్లు ఉంటుంది . శ్రావ్యమైన సంగీతం,  వింటున్నపుడే అర్ధమయ్యే సాహిత్యం తో మరల మరల వినాలనిపిస్తూ ఉంటుంది . అందులో సందర్భానికి తగినట్లు ఉండే సాహిత్యం పాత సినిమా పాటలలో మనకి బాగా నచ్చే అంశం . ఇప్పటి పాటలు చూస్తుంటే అసలు పాటేందుకు వస్తుందో తెలియక తలా తోక లేని వ్యవహారంలా  ఉండి భారంగా తలలు పట్టుకు కూర్చునే బాధ అప్పటి తరం వారికి ఉండేది కాదు. పాట  పంచామృతం లా ఉండేది . పంచామృతం అంటే మనం ఇలా చెప్పుకోవచ్చు . చక్కని దృశ్యీకరణ , వినసొంపైన  సంగీతం, విలువలతో కూడిన సాహిత్యం, గాత్ర మాధుర్యం , నటీనటుల హావభావాలు అన్నీ కలబోస్తేనే ఆ పాట  పంచామృతం అనిపించుకుంటుంది 

పాట  అంటే చెవి కోసుకునే వారికి అలాంటి  ఆణిముత్యం లాంటి పాటలని పరిచయం చేయాలని  .. ఈ చిన్ని ప్రయత్నం.     మంచి పాటలెన్నో ఇక్కడ పరిచయం చేసుకుంటూ  మన మనసులు వినీల గగనంలో విహంగంలా నాట్య మాడాలని కోరుకుంటూ ..

మొదటగా .. రావు బాల సరస్వతి దేవి గారి పాట .  ఆగస్ట్ 29 న ఆమె పుట్టినరోజు . ఆమె గురించి తెలియని వారు ఎవరు ఉండరు .  ఆ సందర్భంగా ఆమె పాటలని గుర్తు చేసుకుంటూ ఉంటే  జగమెరిగిన ఈ చిత్రం గుర్తుకు వచ్చింది "మంచి మనసుకు మంచి రోజులు"  చిత్రం లో పాట  1958 లో వచ్చిన చిత్రం ఇది . అబ్బా.. ఇంత పాత పాట  గురించి చెప్పబోతున్నారా ? అని ముఖం చిట్లించుకోవద్దు. నేను ఈ పాట  చాలా  పాత కాలం నాటి పాట  అని చెప్పగానే .. వద్దు, వినిపించ వద్దనే వద్దు .అని గొడవ చేసాను . మనలో చాలా మందికి పాత పాటలు నచ్చవు ..  నేను  పుట్టక ముందు  ఎప్పుడో వచ్చిన చిత్రంలో పాటని    పిచ్చ బోర్ .. అని కూడా  కొట్టి పడేసాను . కానీ తర్వాతెప్పుడో యధాలాపంగా ఆ పాట  విన్నప్పుడు .. ఆరే ! ఈ పాత ఇంత బావుందేమిటీ? నేనెందుకు వినడంలో నిర్లక్ష్యం వహించాననుకుని మళ్ళీ మళ్ళీ విన్నాను .

అంతగా నాకు నచ్చిన అంశం  ఏమిటంటే .. పాట  యొక్క సాహిత్యం . ఎంత బావుందో .. మీరూ గమనించండి ..
మగువ జీవితానికి మాతృత్వం ఒక వరం అంటారు అది నిజం కూడా ! ఆ మాతృత్వంలోని ఆనందాన్ని ,అనుభూతిని అనుభవిస్తే కాని ఆ విలువ తెలియదు .

మీకు బిడ్డలు ఎంత మంది అని అడుగుతారు కాని మీకు ఎంత ఆస్తులున్నాయని అడగరు కదా ! అందుకే .. అమ్మ గురించి చెపుతూ ఈ పాట  సాగుతుంది

భూమి కి తనపైన ఉండే కొండ భారమా ? ఆ కొండపై ఉన్న చెట్టు ఆ కొండకి భారమా ?  ఆ చెట్టుకి కాసిన కాయ ఆ చెట్టుకి భారమా? అలాగే నవమాసాలు మోసి కన్నతల్లికి పుట్టిన బిడ్డ భారమా? అని ప్రశ్నిస్తూ సాగుతుంది ఈ పాట.  .  ఆస్తికులు బిడ్డల కోసం ఎన్నో మ్రొక్కులు మ్రోక్కుతారు గుడులు చుట్టూ తిరుగుతారు , అలాగే వైద్యశాల ల చుట్టూ తిరుగుతారు.  .  ఎన్నో నోములు నోచి ఆ ఫలమే బిడ్డలు అనుకుంటారు. బిడ్డలు లేకుంటే పూయని కొమ్మ అనే అపవాదు వస్తుందని చింత పడతారు . తల్లి మనసు తలపోసినందు కేమో ఒడి నిండి తల్లినయ్యానని గర్వపడతారు . ఎన్నో ప్రయాసలకోర్చి బిడ్డలని  కంటారు . ఇంకా చాలా ప్రయాసలకోర్చి బిడ్డలని పెంచుతారు. బిడ్డలకి ఆపదలు వస్తే తల్లి బెదిరిపోదు పిల్లలు ఏడుస్తున్నా తల్లి విసుగు చెందదు  పైగా బిడ్డకి ఏమైనదో అని తల్లడిల్లిపోతుంది. పిల్లలు కనగానే   ఆమె భాద్యత తీరి పోదు ఆ పిల్లలని  ప్రేమతో,అనురాగంతో  బాగా పెంచడం  కూడా ఆమె భాద్యత అనుకుంటుంది .. తల్లి విలువను చెపుతూ ఎంతో  హృద్యంగా సాగుతుందీ పాట . ప్రతి స్త్రీ మూర్తి జీవితంలో బిడ్డల కోసం కరిగిన క్షణాలే అత్యద్భుత క్షణాలేమో అనిపిస్తుంది . అలాగే బిడ్డలు కనలేని స్త్రీమూర్తులలో కన్నతల్లిని మించిన ప్రేమ పొంగిపోర్లడం చూస్తే .. అమ్మగా అరిగిపోవడానికే  ఈ స్త్రీ మూర్తులు పుట్టారా ! అందుకే జీవించి ఉన్నారా ? అనిపిస్తూ ఉంటుంది

ఈ పాటలో నటియించిన స్త్రీ మూర్తి .. జయచిత్ర  గారి తల్లి ."అమ్మాజీ"  (జయశ్రీ ) గారట ఆమె రోజులు మారాయి చిత్రంలో ANR  గారి చెల్లెలుగా నటించారు . అలాగే రాజు -పేద చిత్రంలో  పేదబ్బాయి చెల్లెలుగా కూడా నటించారట .

పుట్టీ పుట్టగానే మురికి కాలువలు , చెత్త కుప్పలు పాల్జేసే తల్లులని తలచుకుంటే .. వారికి ఈ పాటని పదే  పదే  వినిపించాలనిపిస్తూ ఉంటుంది .

చూడండి వద్దు వద్దు అంటూనే ..  ఆణి ముత్యం లాంటి పాట  విన్నాను . ఆ పాట  గురించి ఉత్శాహంతో పరిచయం చేసేసాను . ఈ పాత పాట  మగువలందరికి , మనసున్న మహారాజులందరికి బాగా నచ్చింది కదా !
మరో మంచి పాటతో .. ఇంకోసారి కలుసుకుందాం .

song Audio  link : http://www.divshare.com/download/24445215-6e7
song video link : http://www.youtube.com/watch?v=PhtI3pyeuHo


పల్లవి:
ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: 1
మును నే నోచిన నా నోము పండగా
నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా
పూయని తీవెననే అపవాదు రానీక - 2
తల్లిననే దీవెనతో తనియించినావయ్య

తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: 2
ఆపద వేళల అమ్మమనసు చెదరునా
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి - (2)
ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా?

తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా ?
ఈ పాట  కి సాహిత్యం అందించిన వారు సముద్రాల జూనియర్
సంగీతం :ఘంటసాల

2, అక్టోబర్ 2013, బుధవారం

నా గీత మాల ఆమనీ ...

ఓ..ప్రియా..ప్రేమ భాష ఎప్పుడు సగమే.. నీ మనసులో కోరిక కూడా సగంగానే ఉండనీ..నేను భావనని గాంచి ప్రేమ వర్షంలోసగం తడచిన అరమోడ్పు కన్నులతో..సగం మూసి సగం తెరచి..నిన్ను చూస్తూ..నా నీ..ఈ మాటలు,కలయిక ఆగిపోకూడదని కోరుకుంటున్నాను. అంది ఆమె..


నా గీతమాల ఆమనీ ..   మరొక మారు ..ఇక్కడ..

2, సెప్టెంబర్ 2013, సోమవారం

నా గీత మాల ఆమనీ !

పాటల  పల్లకిలోన   చిగురాకుల  సవ్వడిలోన  నిరంతరం వసంతమే సంగీతం ... ....

అలసి సొలసిన మనసులని సేదతీర్చే సంగీతంతో  సాహిత్యం జతకూడితే ... ఎంతో  ఆహ్లాదం  కదా !

అందుకే "నా గీత మాల ఆమనీ " పాటల  పరిచయ కార్యక్రమం "విహంగ " మై  మీ మదిని  తాకాలని ఓ ..  ప్రయత్నం

"నా గీత మాల ఆమనీ ! "   ని ఈ లింక్ లో  చూసేయండి