నిత్య జీవితంలో..సమస్యలతో,చికాకులతో..అతలాకుతలం అయిపోతున్న
మనిషికి..ఆహ్లాదం ని ఇచ్చి..మనసుకి సేద దీర్చే శక్తి.. సంగీతానికి తప్ప
వేరోకదానికి లేదు.అందుకే ..నాదం లోనే మోదం ఉంది..అంటారు..కదా..! అందుకే ఇప్పుడు మనకి చిన్నా పెద్దా అందరు పరవశించి పోవడానికి , వినడానికి పాట ఒక సాధనం పాట..
వినోదాన్ని పంచి గాలి అలలపై తేలియాడించడమే కాదు,ఆలోచింపజేస్తుంది కూడా.. పాట.. వినోదాన్ని పంచి.. . గాలి అలలపై.. తేలియాడించడమే కాదు.. ఆలోచింపజేస్తుంది కూడా..
కొన్ని పాటలు వింటూ ఉంటే అరటి పండు ఒలిచిపెట్టినట్లు ఉంటుంది . శ్రావ్యమైన సంగీతం, వింటున్నపుడే అర్ధమయ్యే సాహిత్యం తో మరల మరల వినాలనిపిస్తూ ఉంటుంది . అందులో సందర్భానికి తగినట్లు ఉండే సాహిత్యం పాత సినిమా పాటలలో మనకి బాగా నచ్చే అంశం . ఇప్పటి పాటలు చూస్తుంటే అసలు పాటేందుకు వస్తుందో తెలియక తలా తోక లేని వ్యవహారంలా ఉండి భారంగా తలలు పట్టుకు కూర్చునే బాధ అప్పటి తరం వారికి ఉండేది కాదు. పాట పంచామృతం లా ఉండేది . పంచామృతం అంటే మనం ఇలా చెప్పుకోవచ్చు . చక్కని దృశ్యీకరణ , వినసొంపైన సంగీతం, విలువలతో కూడిన సాహిత్యం, గాత్ర మాధుర్యం , నటీనటుల హావభావాలు అన్నీ కలబోస్తేనే ఆ పాట పంచామృతం అనిపించుకుంటుంది
పాట అంటే చెవి కోసుకునే వారికి అలాంటి ఆణిముత్యం లాంటి పాటలని పరిచయం చేయాలని .. ఈ చిన్ని ప్రయత్నం. మంచి పాటలెన్నో ఇక్కడ పరిచయం చేసుకుంటూ మన మనసులు వినీల గగనంలో విహంగంలా నాట్య మాడాలని కోరుకుంటూ ..
మొదటగా .. రావు బాల సరస్వతి దేవి గారి పాట . ఆగస్ట్ 29 న ఆమె పుట్టినరోజు . ఆమె గురించి తెలియని వారు ఎవరు ఉండరు . ఆ సందర్భంగా ఆమె పాటలని గుర్తు చేసుకుంటూ ఉంటే జగమెరిగిన ఈ చిత్రం గుర్తుకు వచ్చింది "మంచి మనసుకు మంచి రోజులు" చిత్రం లో పాట 1958 లో వచ్చిన చిత్రం ఇది . అబ్బా.. ఇంత పాత పాట గురించి చెప్పబోతున్నారా ? అని ముఖం చిట్లించుకోవద్దు. నేను ఈ పాట చాలా పాత కాలం నాటి పాట అని చెప్పగానే .. వద్దు, వినిపించ వద్దనే వద్దు .అని గొడవ చేసాను . మనలో చాలా మందికి పాత పాటలు నచ్చవు .. నేను పుట్టక ముందు ఎప్పుడో వచ్చిన చిత్రంలో పాటని పిచ్చ బోర్ .. అని కూడా కొట్టి పడేసాను . కానీ తర్వాతెప్పుడో యధాలాపంగా ఆ పాట విన్నప్పుడు .. ఆరే ! ఈ పాత ఇంత బావుందేమిటీ? నేనెందుకు వినడంలో నిర్లక్ష్యం వహించాననుకుని మళ్ళీ మళ్ళీ విన్నాను .
అంతగా నాకు నచ్చిన అంశం ఏమిటంటే .. పాట యొక్క సాహిత్యం . ఎంత బావుందో .. మీరూ గమనించండి ..
మగువ జీవితానికి మాతృత్వం ఒక వరం అంటారు అది నిజం కూడా ! ఆ మాతృత్వంలోని ఆనందాన్ని ,అనుభూతిని అనుభవిస్తే కాని ఆ విలువ తెలియదు .
మీకు బిడ్డలు ఎంత మంది అని అడుగుతారు కాని మీకు ఎంత ఆస్తులున్నాయని అడగరు కదా ! అందుకే .. అమ్మ గురించి చెపుతూ ఈ పాట సాగుతుంది
భూమి కి తనపైన ఉండే కొండ భారమా ? ఆ కొండపై ఉన్న చెట్టు ఆ కొండకి భారమా ? ఆ చెట్టుకి కాసిన కాయ ఆ చెట్టుకి భారమా? అలాగే నవమాసాలు మోసి కన్నతల్లికి పుట్టిన బిడ్డ భారమా? అని ప్రశ్నిస్తూ సాగుతుంది ఈ పాట. . ఆస్తికులు బిడ్డల కోసం ఎన్నో మ్రొక్కులు మ్రోక్కుతారు గుడులు చుట్టూ తిరుగుతారు , అలాగే వైద్యశాల ల చుట్టూ తిరుగుతారు. . ఎన్నో నోములు నోచి ఆ ఫలమే బిడ్డలు అనుకుంటారు. బిడ్డలు లేకుంటే పూయని కొమ్మ అనే అపవాదు వస్తుందని చింత పడతారు . తల్లి మనసు తలపోసినందు కేమో ఒడి నిండి తల్లినయ్యానని గర్వపడతారు . ఎన్నో ప్రయాసలకోర్చి బిడ్డలని కంటారు . ఇంకా చాలా ప్రయాసలకోర్చి బిడ్డలని పెంచుతారు. బిడ్డలకి ఆపదలు వస్తే తల్లి బెదిరిపోదు పిల్లలు ఏడుస్తున్నా తల్లి విసుగు చెందదు పైగా బిడ్డకి ఏమైనదో అని తల్లడిల్లిపోతుంది. పిల్లలు కనగానే ఆమె భాద్యత తీరి పోదు ఆ పిల్లలని ప్రేమతో,అనురాగంతో బాగా పెంచడం కూడా ఆమె భాద్యత అనుకుంటుంది .. తల్లి విలువను చెపుతూ ఎంతో హృద్యంగా సాగుతుందీ పాట . ప్రతి స్త్రీ మూర్తి జీవితంలో బిడ్డల కోసం కరిగిన క్షణాలే అత్యద్భుత క్షణాలేమో అనిపిస్తుంది . అలాగే బిడ్డలు కనలేని స్త్రీమూర్తులలో కన్నతల్లిని మించిన ప్రేమ పొంగిపోర్లడం చూస్తే .. అమ్మగా అరిగిపోవడానికే ఈ స్త్రీ మూర్తులు పుట్టారా ! అందుకే జీవించి ఉన్నారా ? అనిపిస్తూ ఉంటుంది
ఈ పాటలో నటియించిన స్త్రీ మూర్తి .. జయచిత్ర గారి తల్లి ."అమ్మాజీ" (జయశ్రీ ) గారట ఆమె రోజులు మారాయి చిత్రంలో ANR గారి చెల్లెలుగా నటించారు . అలాగే రాజు -పేద చిత్రంలో పేదబ్బాయి చెల్లెలుగా కూడా నటించారట .
పుట్టీ పుట్టగానే మురికి కాలువలు , చెత్త కుప్పలు పాల్జేసే తల్లులని తలచుకుంటే .. వారికి ఈ పాటని పదే పదే వినిపించాలనిపిస్తూ ఉంటుంది .
చూడండి వద్దు వద్దు అంటూనే .. ఆణి ముత్యం లాంటి పాట విన్నాను . ఆ పాట గురించి ఉత్శాహంతో పరిచయం చేసేసాను . ఈ పాత పాట మగువలందరికి , మనసున్న మహారాజులందరికి బాగా నచ్చింది కదా !
మరో మంచి పాటతో .. ఇంకోసారి కలుసుకుందాం .
song Audio link : http://www.divshare.com/ download/24445215-6e7
song video link : http://www.youtube.com/watch? v=PhtI3pyeuHo
పల్లవి:
ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?
చరణం: 1
మును నే నోచిన నా నోము పండగా
నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా
పూయని తీవెననే అపవాదు రానీక - 2
తల్లిననే దీవెనతో తనియించినావయ్య
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?
ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?
చరణం: 2
ఆపద వేళల అమ్మమనసు చెదరునా
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి - (2)
ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?
ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా ?
ఈ పాట కి సాహిత్యం అందించిన వారు సముద్రాల జూనియర్
సంగీతం :ఘంటసాల

song Audio link : http://www.divshare.com/
song video link : http://www.youtube.com/watch?
పల్లవి:
ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?
చరణం: 1
మును నే నోచిన నా నోము పండగా
నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా
పూయని తీవెననే అపవాదు రానీక - 2
తల్లిననే దీవెనతో తనియించినావయ్య
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?
ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?
చరణం: 2
ఆపద వేళల అమ్మమనసు చెదరునా
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి - (2)
ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?
ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా ?
ఈ పాట కి సాహిత్యం అందించిన వారు సముద్రాల జూనియర్
సంగీతం :ఘంటసాల
4 కామెంట్‌లు:
చాలా మంచి పాట గుర్తు చేశారు
చాలా మంచి పాటను అందించిన మీకు ధన్యవాదాలు చక్కని మీ విశ్లేషణ చాలా బావుంది.. అమ్మ గురించి మంచి సాహిత్యపు విలువల గురించి బాగా చెప్పారు వనజ గారు
Excellent! ఎంతో బాగా వివరించారు.
చాలా బావుంది... మంచి పాట :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి