మనిషి జీవితం బాగుండాలంటే 5 m ల గురించి కచ్చితంగా తెలిసివుండాలి.
Mouth : నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నోరు అదుపులో లేకుంటే వీపు దెబ్బలు తినాల్సి వస్తుంది అనికూడా అంటారు కదా! మాటలతో కోటలు కట్టవచ్చు. హృదయాలను కూడా గెలవవచ్చు. సందర్భోచితమైన మాట మనిషికి ప్లస్ అవుతుంది. నేను నిజాలే మాట్లాడతాను, మంచే మాట్లాడతాను, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాను అని అనకూడదు అధికార స్వరం ఝళిపించకూడదు. సత్యం కూడా ప్రియంగా మాట్లాడాలి. విమర్శ కూడా సున్నితంగా వుండాలి. చెడు విషయం కూడా నిదానంగానే చెప్పాలి. పరుషమైన మాట విషం. సున్నితమైన మాట పువ్వులాంటిది. పూలచెండు కొడితే ఊరుకుంటారేమో కానీ ముళ్ల తీగతో కొడితే ఊరుకుంటారా?
Mind: మన ఆలోచనే మన భవిష్యత్ బలం కూడా అవుతుంది. ఎప్పుడూ సక్రమమైన ఆలోచనలు చేయాలి. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో వుండాలి. నెగిటివ్ థింకింగ్ వల్ల వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయి. నలుగురితో కలవలేరు. మాట్లాడలేరు. మనకన్నా ఉన్నతస్థాయిలో వున్న వారితో పోల్చుకుని మనల్ని మనం బలహీనం చేసుకోకూడదు. మన మైండ్ కి అద్దం లాంటిది ముఖం. ఆ ముఖమే చెబుతుంది అంట.. అసలు మనం ఎలా వున్నామో! ప్రతి రోజు మన ఆలోచనలు ప్రక్షాళనం చేసుకోవాలి. నిన్నటి అనుభవాలు నుండి పాఠం నేర్చుకుని చేదు అనుభవాలను తుడిచి పెట్టేసి నిత్య నూతనంగా రోజు ప్రారంభించు కోవాలి. ఒక్కటి గుర్తుంచుకోండి. మన మెదడు కుడితి తొట్టి కాదు.
Moods: బావోద్వేగాలు. మనం కోపం ఆవేశం లాంటివి అదుపులో వుంచుకోవాలి. మితిమీరిన బావోద్వేగాలు మనిషి వివేకాన్ని విచక్షణను కోల్ఫోయేటట్లు చేస్తాయి. స్వతహాగా చీమకు కూడా హాని చేయని వ్యక్తులు కట్టలు తెంచుకున్న కోపంలో ఆవేశంలో హత్యలు చేసారని వినడం జరుగుతుంది.
మూడ్స్ బావుంటేనే సరైన నిద్ర పడుతుంది. మానసిక వ్యాధుల బారిన పడకుండా వుంటారు. గుర్తుంచుకోండి..తరచూ moods swing అయ్యే వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరు.
Manner: నీ దగ్గర లక్షలు కోట్ల కొలదీ డబ్బు వుండవచ్చు. కానీ నీకు సాటి మనుషులను గౌరవించడం మర్యాద తెలియకపోతే నువ్వు జీరో లెక్క. పెద్దలు గురువుల యెడల గౌరవభావం బలహీనుల పట్ల దయ, జాలి మూగజీవాలు పట్ల కరుణ కలిగివుండటం బాధితుల పట్ల సానుభూతి కలిగి వుండటం ముఖ్యం. మర్యాదా పురుషోత్తమ లక్షణాలు ఇవే! ఇవి పెద్దల ద్వారా పిల్లలకు సంక్రమిస్తాయి.
Money; ధనం మూలం ఇదం జగత్. డబ్బు వ్యవహారంలో మనిషి చాలా జాగ్రత్తగా వుండాలి. ఇచ్చిపుచ్చుకోవడం అవసరమే కానీ … డబ్బు ఇచ్చేటప్పుడు వున్న స్నేహాలు. బంధుత్వాలు తిరిగి పుచ్చుకునేటప్పుడు వుండవు. రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు!? అంటే రక్తం పంచుకుపుట్టిన వాళ్ళను శత్రువులుగా మారుస్తాను, స్నేహితులను దూరం చేస్తాను అన్నదట. మితిమీరిన ఖర్చు కూడదు. మితిమీరిన నమ్మకంతో అనువుకాని చోట పెట్టుబడి పెట్టడం.. కూడా మంచిది కాదు. డబ్బు లేనప్పుడు నీ విలువ ముప్పాతిక శాతం తగ్గుతుంది. డబ్బు వుంటే నీలో వున్న పది వంకలను కప్పెడుతుంది.
ఇవి పాటించగల్గితే మనిషి జీవితాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి