|| నేను ఒక పుస్తకం తెరిచాను ||
నేను ఒక పుస్తకం తెరిచి లోపలికి ప్రవేశించాను. ఇప్పుడు నన్ను ఎవరూ కనుగొనలేరు.
నా కుర్చీ నా ఇల్లు నా రహదారి నా ఊరు
నా ప్రపంచం అన్నీ నా వెనుకనే వదిలేసాను
నేను అంగీ ధరించాను. నా ఉంగరం జారవిడిచాను.
మంత్ర మాత్రను చప్పరించాను.
నేను ఒక డ్రాగన్ తో పోరాడాను
రాజుతో విందు ఆరగించాను
మరియు అడుగు తగలని సముద్రం లో ఈదులాడాను.
నేను పుస్తకం తెరవగానే కొంతమందిని స్నేహితులుగా చేసుకున్నాను.
నేను వారి కన్నీళ్ళను నవ్వులనూ పంచుకున్నాను.
మరియు ఎగుడుదిగుడుగాను అనేక ఒంపులతో వున్న వారి మార్గాన్ని అనుసరించాను.
నేను నా పుస్తకం చదవడం పూర్తి చేసి బయటకు వచ్చాను.
ఇక ఆ అంగీ నన్ను దాచలేదు
నా కుర్చీ నా ఇల్లు అలాగే వున్నాయి.
అయితే నా లోపల ఒక పుస్తకం వుంది.
స్వేచ్ఛానువాదం: వనజ తాతినేని
మూలం: I OPENED A BOOK
By Julia Donaldson
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి