ఈ సినిమా వచ్చినప్పటి నుండీ వింటూనే వుంటాను.
ఈ పాట గురించి నేనొక అమ్మాయికి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయింది .. యెలా తెలుసు మీకివన్నీ అని.
నేనేమో ఆమెనవ్వు కథలో కృష్ణ లా .. కొన్ని అట్టాగే తెలుస్తుంటాయి అన్నాను. :)
నాకెలా తెలుసా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే మరకతమణి కీరవాణి M M Kreem పేరుతో అందించిన స్వరాలు కదా అని తట్టింది.
కొన్నాళ్ళు నా కాలర్ ట్యూన్ గా వూరేగిన పాట.
మళ్ళీ వింటున్నా .. రాత్రి నుండి. మెలుకువ వచ్చినప్పుడల్లా. ఎవరు పాడినా , వాయించినా వింటూనే వున్నాను.
అన్నింటి కన్నా యిదిగో .. ఇదే బాగా యిష్టం.మంచి సంగీతమే కాదు సాహిత్యం కూడా.
చదివి చదివి యాంత్రికమైపోయినప్పుడు యిలా సంగీత సాగరంలోకి దూకేస్తా.. :) <3 <3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి