కథనం లో "ఆమె నవ్వు" కథ
ఎంతో శ్రావ్యంగా ఉంది ..
కామయ్య తోపు, పోరంకి అన్నపూర్ణ హోటల్,మా బందరు కాలువ, జమలాపురం గుడి మా విజయవాడ నేపథ్యంలో నడిచిన కథ. ఈ కథ చదివిన తర్వాత కామయ్య తోపు దగ్గర కళ్ళతో టిఫిన్ బండిని వెతుక్కుని ఆమె కనబడటం లేదని అడిగినవాళ్లు వున్నారు. వేలమంది పాఠకులు నాకు కాల్ చేసి అబ్బా .. ఏం వ్రాశారండీ.. అని మెచ్చుకున్న వాళ్ళు వున్నారు. ఇవాళ్టికీ ఈ కథ పై స్పందనలు వస్తూ వుంటాయి. నాకు కూడా యిష్టమైన కథ. నా రెండు కథా సంపుటాలలో యీ కథ వుంది.
ఇప్పుడీ కథ "కథనం" లో చోటుచేసుకుని నాకు సంతోషాన్నిచ్చింది. భావయుక్తంగా చదవడమే కాదు కథని బట్టి వెనుక నడిచిన నేపథ్య సంగీతం నూనె సుర సురలు పిండి పేలడమూ తో సహా యెంతో బాగున్నాయి. ధన్యవాదాలు షరీఫ్ గారూ..
మీరూ వినండి ..Like చేయండి Share చేయండి Subscribe చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి