సంగీతం సర్వ జన సమ్మోహితం.
నాలుగైదు నెలల కాలంగా రాజేష్ చేర్తాల (Rajesh Cherthala Professional Flute Instrumentalist).నన్నావహించాడు. నిద్ర లేచింది మొదలు నిద్రలోకి జారుకునే వరకూ వింటూనే వున్నాను. అలసినప్పుడు సేదదీర్చే చిరుగాలి తరగల్లేనూ నిదురరానప్పుడు అమ్మలా జోలపాడుతున్నట్టు అశాంతిగా వున్నప్పుడు సాంత్వన కలిగించే ఆప్తమిత్రుడిగానూ .. ఏమీ తోచనప్పుడు సంగీతం వినడమే ప్రాధాన్యమైనట్టూ భలే నా చుట్టూ గాలికిమల్లే తారట్లాడతా వున్నట్టు వుంటున్నాడు . అతని గురించి చెపుతూ ముందుగా నా సోత్కర్ష కూడా ...
నాకు వేణువు సంగీతం విడదీయరాని వస్తువులుగా నాకనిపిస్తాయి. చిన్నప్పటినుండి వేణునాదం విన్నప్పుడల్లా నాదస్వరానికి కదిలే నాగులా ఊగిపోతుంటాను. ఎందుకో యేమిటో అసలు తెలియదు. మనసు ఆలోచన ఎంతో తేటగా ఉంటాయి. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, భూపేన్ హజారికా, మరకత మణి కీరవాణి నాకత్యంత యిష్టమైన సంగీతకారులు. ఇప్పుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా శిష్యుడే అయిన రాజేష్ చేర్తాల తన వేణు గానంతో వంశీరవం పట్ల మరింత మోహాన్ని పెంచుతున్నాడు. అతని వేణు గానాన్ని వింటూ ఇతర భాషా చిత్రాల పాటలని వింటూ ఆసక్తిగా ఆ పాటలు గురించి తెలుసుకుంటూ సంతోషంలో వోలలాడుతూ వున్నాను.
నా బ్లాగ్ శీర్షిక కూడా వనజ వనమాలి అని వుంటుంది. ఎందుకంటే వనమాలి అంటే యెవరోకాదు. నా ఆధ్యాత్మిక గురువు మానసిక ప్రపంచంలో ఆరాధకుడు మురళీ ధరుడే గావున చటుక్కున ఆ పేరు పెట్టేసుకున్నాను. నా కథలలో కూడా పిల్లనగ్రోవి ప్రస్తావన బాగానే ఉంటుంది. (పాట తోడు కథ) నా కలల్లో కూడా వేణు నాదమే కనబడుతూ వుంటుంది. నాకిష్టమైన పాటలు అంటే కచ్చితంగా మురళీరవం వినబడుతూనే వుండాలి. లేకపోతే ఎంత మంచి పాటైనా నాకు నచ్చదన్నమాట. అలా వేణువుకి నాకు విడదీయరాని బంధం. కాస్త ఖాళీ దొరికితే చాలు చైనీయుల వేణు గానాన్ని వెతుక్కుంటూ వుంటాను. వారి సంగీతం ఇంకా పచ్చిగా గాఢంగా హత్తుకుంటుంది కాబట్టి. సంగీతంలో చేరాల్సిన గమ్యం అది. రాజేష్ చేర్తాల వేణు గానంలో అది పూర్తిగా ఉంటుంది.
ఎంతవిన్నా తనివి తీరనిది వినడానికి మన శక్తి చాలనిదీ సంగీతం వొక్కటే. వొడలు మరిపించేది పట్టరాని అనుభూతిని కల్గించేది స్పర్శ లేనిదీ చెవుల ద్వారా హృదయాన్ని తాకేది సంగీతం వొక్కటే. అదియునూ వేణుగానమొక్కటే నా దృష్టిలో :) నాకు నచ్చిన పాటల జాబితా చెప్పాలంటే అది చాలా పెద్దది. నాలుగురాత్రుళ్లు పగళ్లు కూడా చాలవు. పెద్ద పెద్ద గ్రంధాలు,కావ్యాలు చదవలేదు, సంగీతంలో ఓనమాలు నేర్చుకోలేదు కానీ నా సమకాలీనులను నూరులో ఒకవంతు చదువుతూ నాకన్నా ముందుతరం వాళ్ళని రెండొంతులు చదువుతూ యేదో యిలా ఆనందంగా బతికేస్తున్నాను.ఇదిచాలు.
పరమేశ్వరుడుని పుట్ట తేనెతో అభిషేకిస్తే స్వరజ్ఞానం తీయనైన స్వరం లభిస్తాయని మా నాయనమ్మ అనేది. అంతా భగవత్ కృప. ఇలా ఆస్వాదించే అనుభూతి చెందే కాస్త జ్ఞానాన్ని అయినా యిచ్చినందుకు ఆ ఆది సంగీతకారునికి నమస్సులు అందిస్తూ ...
రాజేష్ చేర్తాల ని మీరూ వినాలని కోరుకుంటూ ... అతనికి కూడా ఎంతో ఇష్టమైన మరకతమణి సుస్వరాల బాణి శిశిరకాల (దేవరాగం ) https://www.youtube.com/watch?v=TgCHPXxIP9s
బొంబాయి మ్యూసిక్ థీమ్ + https://www.youtube.com/watch?v=2hVREG9uqrc
https://www.youtube.com/watch?v=iX1OxnyFT4g
https://www.youtube.com/watch?v=wBDPxQXvKEk
.https://www.facebook.com/rajeshcherth...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి