24, ఫిబ్రవరి 2016, బుధవారం

ఆడ పిల్లఈ చిత్రం చూడండి .. ఒక భారీ వృక్షాన్ని మూలాలతో సహా పెకిలించి వేరొక చోటుకి తరలిస్తున్నారు కదా ! 
విత్తనాలు, మొక్కలని నాటడమే కాదు  అశోకుడు చెట్లు నాటించెను అని చదువుకున్నట్లు ... ఇలా చెట్లు నాటడానికి తరలింబడుతున్నాయి. ఈ చిత్రం చూడగానే నాకు వెంటనే ఒక విషయం తళుక్కుమని  మెరిసింది . పద్దెనిమిదేళ్ళ పాటు అంతకన్నా ఎక్కువగానో తక్కువగానో  పుట్టింటి పెరటి చెట్లో  పెరిగిన వృక్షమనే ఆడపిల్లని పెళ్లి పేరుతో ఇంకొక ఇంటికి పంపినప్పుడు కూడా ...  సమూలంగా పెకిలించ వేయబడ్డ అంతటి వృక్షం   తిరిగి జీవించడానికి తనని నిలబెట్టుకోవాడానికి ఎంత సంఘర్షణ  అనుభవిస్తుందో ... అలాంటి సంఘర్షణే  పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళిన ఆడబిడ్డ అనుభవిస్తుంది. అమ్మాయిల మనసుల్లోకి  మీరెప్పుడైనా తొంగి చూసే ప్రయత్నం చేసారా ?  ఫ్రెండ్స్ .. ఆ ప్రయత్నం చేయండి ... ప్లీజ్ ... చేస్తారు కదా ! ఇలాంటి భావనల తోనే నేను వ్రాసిన "ఇంటి పేరు" కథ చదవండి . అమ్మలని,  అమ్మాయిలని, తోడబుట్టిన వాళ్ళని స్త్రీ లని అందర్నీ అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి .