ఒకానొక ఆవేశంలో వ్రాసింది ... ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా . :)
మిత్రమా !
ఒక్కనాడన్నా మనసారా నవ్వావా?
తుమ్మల్లో పొద్దుగుంకినట్టు ముఖానికి ముళ్ళేసుకుని ఉంటావ్ !
అయినా అమ్మనిన్ను ప్రేమగా ముద్దాడుతూనే ఉంటుంది
అన్నకెక్కువ నాకు తక్కువంటూ యాగీ చేస్తూనే ఉంటావ్
చిన్నవాడివని క్షమిస్తూనే ఉంటుంది
తక్కువ బరువేసుకుని పుట్టావని
అమ్మ నిన్ను నున్నగా రుద్ది రుద్దీ లాలి పోస్తుందే
కడుపునిండా పాలిచ్చి పెంచిందే
అన్నకి చిరుగుల బొంతేసి నీకు పట్టుపరుపునిచ్చిన తల్లినా
నువ్వు ద్రోహివంటున్నావ్
ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడలేవు
ఎవరినీ స్వచ్చంగా ప్రేమించనూ లేవు
కనీసం నేనున్నాననే భరోసానివ్వలేవు
ధర్మపన్నాలు వల్లిస్తూనే ఉంటావ్
అవసరానికి వేరొకరి దేవుడిని,వాదానికి సమూహాలని
ఇల్లెక్కి కూయడానికి కులాన్ని అవసరానికి వాడుకుంటావ్.
కవిగా వెలగడానికి భాషని చమురుగా మార్చుకుంటావ్
ఏనాడన్నా అక్షరాలకి అనురాగాన్ని నింపావా
ద్వేషాన్ని రంగరించి శస్త్రాలని గురిపెడుతున్నావ్
దొరకని దానికోసం అన్వేషిస్తూ ఖండాతరాలలో సంచారం చేస్తున్నావ్
వెతుకున్న కొస నీ చేతికందిందా ?
నీ విశ్వాస ఖడ్గం పరుల విశ్వాసాలన్ని తునకలు చేయమని చెప్పిందా ?
నువ్వు పశ్చిమ మైతే నేను ప్రాగ్దిశ .
మనమాడుకుంటున్న వెలుగుల బంతి
మిగిలిన ఎనిమిది దిక్కులకి అన్యాయం చేసున్నాయని కత్తులు దూయడం లేదే !
తల్లి పాదాల క్రింద స్వర్గముందని నీ దేవుడు చెపితే
శూన్యంలో ప్రయాణించి ఆత్మ పరమాత్మైన నను చేరుతుందని నా తండ్రి చెపుతాడు
తల్లీ తండ్రీ ఇద్దరూ నిజమే కదా నీకూ నాకూ.
రాళ్ళలో మాత్రమే నా దైవం లేనప్పుడు నీకు ఆ రాతికట్టడాలతో విశ్వాసమెందుకు!
కూల్చేసినా బాధెందుకు ?
చెట్టు నుండి ఈ పువ్వుని కోసినట్టే నిత్యం నీ ద్వేషాన్ని కోసి
భగవంతుని పాదాల దగ్గర పెడుతున్నాను.
పూలివ్వలేక చెట్టు అలిసింది కానీ..
నీ ద్వేషం మాత్రం ఊరుతూనే ఉందని తెలిసీ
కోయడమే మానుకున్నా.
సర్వ మానవ హితమే మన మతం అని చెప్పిన
వివేకానందుడు లాంటి మనిషి
ఎక్కడైనా కనబడతాడేమోనని వెదుకుతున్నా
హితమనే భావన ఉందా ఎక్కడైనా కనబడుతుందా
అని అడగాలని.
మీ ద్వేష దేహాల చుట్టూ గీసుకున్న బలవంతపు రేఖలని చెరిపేసి
ప్రేమపాశంతో హత్తుకుందామనుకున్నా నువ్వు దూరం జరుగుతుంటే
మానవ బాంబు వేమో అని అనుమానం రాకుండా ఎవరాపగలరు ?
ధనవంతుడైన దళిత కుటుంబంలో పుట్టాలి బక్క చచ్చిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టే కన్నా అని విరక్తిగా ఒకడ నుకుంటే -కూటికి చస్తే చచ్చాం కానీ దళిత కుటుంబంలో పుట్టి గొడ్డు మాంసం తినడం కన్నా చావడమే మేలు అనుకునే ఇంకొకడుంటాడు. ఎంత అరిచి గీ పెట్టినా పుట్టుకనేది మన చేతిలో లేని పని. అవకాశాలు కూడా అందరికి దక్కవు పుట్టుకకి, అవకాశానికి మధ్య రాజకీయం నడుస్తూ ఉంటుంది. జీవులని పావులుగా చేసి ఆదుకునేది కొందరు . ఎవడైనా బలపడాలనుకునప్పుడు రెండు తప్పనిసరిగా కావాలి ఒకటి ఆర్ధికంగా బలపడటం, రెండవది పాలించే స్థాయికి ఎదగ గలగడం. మూలస్థాయిలో అందరిలో ఆ అగ్ని ఉండాలి. లేనప్పుడు ఇలా కొట్టుకు చస్తూనే ఉందాం .
ఈ దేశంలో ...
ఉషోదయం కోసం పూమొగ్గలు ఎదురు చూసినట్లే
రాబందులు ఎదురుచూస్తూ ఉంటాయి
రెండిటికి తేడా ఏమిటో గ్రహిస్తే ... గర్హించాల్సినవి చాలా ఉంటాయి . ముందుగా మనం ఉండాల్సింది మానవుడిగా ..
చేతిలో చెయ్యేసుకుని నడుద్దాం రా... మనం మనం విశ్వసించుకోవడానికి ... ఇతరులు మనని విశ్వసించడానికి.
మనం భారతీయులం. భారతీయులందరూ ... !? దాయాదులు మాత్రమేనా, సహొదరీ సహోదరులు కారా !?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి