12, జులై 2016, మంగళవారం

పూల కథ



మొగ్గ పగిలింది
పరిమళం ప్రవహించింది
మధుపం నాట్యమాడింది
ఇది కేవలం ఒక కథ
ఇది నిజం కాదు ..
అని మీరనుకుంటే అది మార్చవచ్చు
జీవితం మీరనుకున్నట్లు జరిగేది కాదు కానీ..
కథ కూడా మీకనుగుణంగానే
మీ నుండే జరుగుతుంది
అది తెలుసుకుంటే ....
అమాయకత్వం అనే చీకటి ఖైదులో
నిన్ను నీవు బంధించుకోవడం ఎందుకు ?
తలంపులే శాపవనంలో పూల మొక్కలు
నీవో వేరెవరివో  ..
పుప్పొడి ప్రశ్నలై  సమానాధాల ఫలదీకరణ కై
శూన్యంలో చక్కర్లు కొడుతుండేవే కథలు
ముగిసిపోయే కథలు ముగింపబడ్డ కథలు
కాలక్షేపపు జీవితాల కథలు.
అతిధులగా భువికి వచ్చిన వారి కథలు
ఈ  పూల కథలు.

పూల కథ  ఈ లింక్ లో  అచ్చులో  ...





1 కామెంట్‌:

Saraswathi Durbha చెప్పారు...

మన కథలు "ముగిసిపోయే కథలూ, ముగింపబడ్డ కథలూ" అవుతున్నప్పుడే మరి గుండె రాయి చేసుకోవాలి. జీవితం నిలకడ లేని నీరు లాంటిది. మనం చేత్తో పట్టుకుందామన్నా నిలవదు.