#పూల కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
#పూల కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జులై 2016, మంగళవారం

పూల కథ



మొగ్గ పగిలింది
పరిమళం ప్రవహించింది
మధుపం నాట్యమాడింది
ఇది కేవలం ఒక కథ
ఇది నిజం కాదు ..
అని మీరనుకుంటే అది మార్చవచ్చు
జీవితం మీరనుకున్నట్లు జరిగేది కాదు కానీ..
కథ కూడా మీకనుగుణంగానే
మీ నుండే జరుగుతుంది
అది తెలుసుకుంటే ....
అమాయకత్వం అనే చీకటి ఖైదులో
నిన్ను నీవు బంధించుకోవడం ఎందుకు ?
తలంపులే శాపవనంలో పూల మొక్కలు
నీవో వేరెవరివో  ..
పుప్పొడి ప్రశ్నలై  సమానాధాల ఫలదీకరణ కై
శూన్యంలో చక్కర్లు కొడుతుండేవే కథలు
ముగిసిపోయే కథలు ముగింపబడ్డ కథలు
కాలక్షేపపు జీవితాల కథలు.
అతిధులగా భువికి వచ్చిన వారి కథలు
ఈ  పూల కథలు.

పూల కథ  ఈ లింక్ లో  అచ్చులో  ...