14, మే 2018, సోమవారం

నమ్మకమీయరా స్వామీ..

నమ్మకమీయరా స్వామీ 
నిర్భయమీయరా స్వామీ
సన్మార్గమేదో చూపరా స్వామీ ..
సుజ్ఞాన సూర్యున్ని మాలో.. వెలిగించరా

చెడుకు ఎదురు పోరాడే 
మంచినెపుడు కాపాడే 
పిడుగుదేహమీయరా.. ప్రభూ..
ప్రేమతో పాటు పౌరుషం పంతము తేజమూ  రాచ గుణమూ ప్రభూ ..
వినయం విలువలనీయరా 
నమ్మకమీయరా స్వామీ

లోన నిజం గుర్తించే 
పైన భ్రమను గమనించే
సూక్ష్మ నేత్రమీయరా.. స్వామీ ..
సర్వమందించు నీ ప్రియ గానం స్మరణం ప్రార్ధనకై  స్వామీ ..
సమయం స్వచ్చతనీయరా 
నమ్మకమీయరా స్వామీ
నిర్భయమీయరా స్వామీ
సన్మార్గమేదో చూపరా స్వామీ ..
సుజ్ఞాన సూర్యున్ని మాలో.. వెలిగించరాకొమరం పులి
గానం : కౌసల్య
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం : A.R రెహమాన్ .