పదునారు కళల చంద్రుడు
తన వెన్నెల కుంచెతో
రాత్రిని చిత్రించాలని
యుగాల తరబడి
జాగారం చేస్తూనేవున్నాడు.
వాక్య గుచ్ఛం ముడివిప్పితే
విడివడిన అనేక పదాల్లో
నిండిన భావ పరిమళమే
నేను అనబడే నా కవిత్వం
లోపం లేని చిత్రం చింత లేని జీవనం
పరిపూర్ణమని భావించే జీవితం
అవి అసత్య ప్రమాణాలే
కేవలం కవుల కల్పనలే
జీవితమంటేనే......
అనివార్యమైన ఘర్షణ
మనిషి చెట్టుకి మొలిచిన ప్రేమ చివురులు
ప్రాణ తేజాన్ని నింపుకున్న పూబాలలు
పుడుతూనే ఉంటాయి
రాలుతూనే ఉంటాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి