14, మార్చి 2011, సోమవారం

ఉనికి


            
నా..ఆకాంక్షల దీపం మలగిపోయిన వేళ
నా ఆశల సౌధం కూలిపోయిన వేళ
 నేను జీవశ్చవాన్ని కానే కాలేదు..
మలిగిన దీపాన్ని మరల వెలిగించి
చిరుగాలి రెప రెపలకి కదలనివ్వక
చేతులడ్డుపెట్టడం నేర్చుకున్న
బడుగు జీవిని.
సౌదపు శకలాలని తొలగించుకుని...
పూరిగుడిసేనైనా.. నిర్మించుకునే ఆశల జీవిని.
వెలుగురేఖల వైపు నడుస్త్హూ
చీకటితో సహవాసం చేసే దీశాలిని..
కష్టాల కడలిని ఈదుతూ.. 
నదిలో మునకకి వెరువని యోధురాలిని  
పడిలేచే కెరటంకి, ఆకురాలు కాలానికి ప్రతీకని నేను.
అనంత కాలానికి ఉనికిని..నేను స్త్రీని..
                                                                                                          

కామెంట్‌లు లేవు: