నగరజీవనం నన్నావహించి రెండు దశాబ్దాలు దాటింది. అయినా నన్ను వూరోళ్ళు, యెర్ర బస్సోళ్ళు అని వాఖ్యానించే వాళ్ళు వుంటారు. అప్పుడు నేను నవ్వుకుంటూ మా వూర్లోళ్ళకి వున్న తెలివి,శ్రద్ధ పట్నంలో పెరిగి విమానంలో ఖండాలు దాటిన మీకెక్కడుందిలే అంటాను. విమానం యెక్కడానికి కొద్దిరోజులముందు మా వూరికి వెళ్ళాను. గంట సమయం కూడా స్తిమితంగా కూర్చోలేనితనం. ప్రశాంతత కరువైంది పరిసరాలలోకాదు, నాలో.
పాత నుండి క్రొత్తకి ప్రవహించినప్పుడూ, ప్రవహిస్తూ వున్నప్పుడూ కూడా యేదో అర్దం కాని సంవేదన. బహుశ అది వెనుకకు ప్రయాణించలేని వెనుక జీవితంలోకి మరలి వెళ్ళలేని అసక్తత, అనాసక్తి కూడానేమో. ఇక నేనెప్పుడూ “నా జన్మభూమి యెంత అందమైన దేశము. నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము” అని పాడుకోవడానికి బిడియపడతానేమో ... అనుకుంటూనే ఓ జ్ఞాపకం మనసున చెమ్మగిల్లి.. ఇలా అక్షరీకరణ చెందింది.
మా వూరి జ్ఞాపకాలు
గోధూళివేళ నా తిరుగు ప్రయాణంలో.. మా వూరి దృశ్యాలు పద పదే గుర్తుకు వస్తున్నాయి. పరిచయమవసరంలేని ఆ ప్రాంతమంతా పరిచయం చేయాల్సినట్లుగా మారినంత సులువుగా పురా జ్ఞాపకాలు చెరిగిపోవడం బహు కష్టం. బాల్యం గురుతులు, యవ్వనపు తొలినాళ్ళ ఛాయలను విడనాడటం చాలా చాలా కష్టం.
పచ్చని మాగాణమంతా ధాన్యానికి గిట్టుబాటు ధర లేక ఇటుకలను పండించడం మొదలెట్టింది. గుబ్బగుయ్యంలా వుండే మఱ్ఱి చెట్టు పరిసరాలు రహదారిమీద ప్రయాణించే వాహనాల చప్పుళ్ళని గూబ గుయ్యమనిపిస్తున్నాయి. లైబ్రరీ అరుగులు రాజకీయ పాఠాలను శ్రద్ధగా నేర్పుతున్నట్లు వున్నాయి. గుడిగంట శబ్ధాలలో పవిత్రమైన భావనకు బదులు హోరెక్కువ వినబడుతూ వుంది.
పసుపుృ పచ్చని అందాలను విరబూసిన నల్లతుమ్మల పైన పత్తి చేను పగలబడి నవ్వినట్లున్న తెల్లని మేఘాలు ప్రక్కింటికి పేరంటానికి వెళుతున్నట్లున్న దృశ్యాలను చూసి ఆగి మరికాసేపు చూడలేని నా వేగవంతమైన జీవితాన్ని ద్వేషించాను.
మనషుల్లో ప్రేమలు కల్తీగా కనబడితే మాన్లే మారిన పరిసరాలు నాగరికతను అద్దుకున్న జీవనాలు చూడటానికి మనస్సు అంగీకరింలేదు. అందులో స్వార్ధం వున్నా సరే. మన జీవనం, మన ఆలోచనలు యెంత మారినా మన వూరి స్వచ్ఛత అలాగే వుండిపోవాలనే అత్యాశ మరి.
ఆఖరిలో మా వూరందరి నడవలో చెఱువు గట్టుపై నిలబడి అస్తమిస్తున్న సూర్యుని నారింజ కిరణాలను ప్రతిబింబిస్తున్న నీటి బాస నా కంటి చివర చుక్కతో జత కట్టింది ఈ నీటితో నీకు రుణమెప్పుడో తీరిందని గుర్తు చేసిన క్షణాలను... తలచుకుంటూ....
ఇక్కడెక్కడో అట్లాంటా నగరంలో కూర్చుని... మూసుకున్న తలుపురెక్కలను చూస్తూ... అమ్మా... ఉదయాన్నే ఈ తలుపులు తెరిచి... వాకిలి వూడ్చి నీళ్ళుజల్లి ముగ్గు పెట్టవా... అని కోడలిని అడిగిన నా అజ్ఞానాన్ని ఇంకొక తరం నాగరిక జీవనం నవ్వుకునేటట్లు చేసిందేమో కూడా.
ఏది యేమైనా పాత కొత్త తరాల మధ్య ఈ సాంస్కృతిక లంకె నన్ను వర్తమానంలో బ్రతకడానికి అడ్డుకట్ట వేస్తుందని తెలుసుకున్నాను.

మా వూరి చెరువు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి