లైంగిక నిర్ణయాల్లో మహిళల ఇష్టాయిష్టాల విషయంలో రాజీకి తావులేదు. ఇష్టపూర్వక శృంగారమనేది మహిళ హక్కు.. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి షరతులు పెట్టేందుకు వీలు లేదు.👏👏👏
మనం ప్రపంచాన్ని స్త్రీల కోణంలో నుండి చూసినప్పడు మాత్రమే సమస్యలను బాగా అర్దం చేసుకోగలం. సుప్రీంకోర్టు తీర్పుపై సంప్రదాయవాదుల నిరసన సహజమే. సెక్షనుల రద్దు పురుషులకు శ్రేయస్కరమే.
దాంపత్యజీవనంలో హింస, భాగస్వామిపై విముఖత లేదా అనుమాన బీజాలు. అయితే విడాకులకు అప్లై చేయండి. అంతే కానీ హింసించే హక్కు లేదు. అలాగే స్తీ కూడా కేస్ పెట్టకూడదు.(తప్పుడు కేస్ ల నేపధ్యం వుంటుంది కాబట్టి) ఈ సెక్షన్ రద్దు ద్వారా పురుషలకు స్త్రీలకు వొకే చట్టం వర్తిస్తుంది.
150 యేళ్ళ క్రిందటి చట్టంలో సెక్షనులు రద్దవడాన్ని స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో బ్రతుకుతున్నాం కాబట్టి.మోతాదును మించిన శారీరక మానసిక హింస యెవరికీ ఆమోదయోగ్యం కాదు కాబట్టి.
పెండ్లి ఒక బాండ్. ఇందులో హక్కులు వుంటాయి. సహజీవనంలో అవి వుండవు. స్త్రీ పురుషులు ఎందులో వుండాలన్నది ఎవరికి వారు నిర్ణయించుకుంటారు . ఇంతకుముందు వున్నట్టే ఇకముందు అక్రమ సంబంధాలంటాయి.సమాజం నీతినియమాల అతిక్రమణ దృష్టిలో చూసి లోకం పాడైపోయింది అంటుంది మళ్లీ అందులో అందరూ వుంటారు.
మీడియా వాళ్ళు సంచలన శీర్షికలు పెట్టి అసలు వ్యాఖ్యానాన్ని అడుగున పెట్టారు. Alamuri Sowmya post నుండి తీసుకున్న వివరాలు ఇవి
“నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారాల్లో చట్టం గానీ ప్రభుత్వం గానీ తలదూర్చకూడదు. స్త్రీ ఎవడి సొత్తూ కాదు.’సుప్రీం కోర్టు తీర్పు. "husband is not the master of the wife"...(ఇది పాఠ్య పుస్తకల్లో పెట్టేసి అందరిచేత బట్టీ పటించాలి) స్త్రీ ఎవడి సొత్తూ కాదు. స్త్రీకి శ్రంగార స్వేచ్ఛ ఉంది. వివాహేతర శృంగార సంబంధాలు ఆ వ్యక్తులకు మాత్రమే సంబంధించిన విషయాలు. దీన్లో తలదూర్చే హక్కు ఎవరికీ లేదు ఇలాంటి సంబంధాలవల్ల బాధపడ్డ భార్య/భర్తకు తప్ప. బాధపడినవాళ్లు కూడా విడాకులకు అప్ప్లై చేసుకొవచ్చు తప్పితే క్రిమినల్ కేసు పెట్టడానికి వీల్లేదు. వివాహేతర సంబంధాలు సంఘ నీతినియమాలకు వ్యతిరేకం తప్పితే చట్టవ్యతిరేకం కాదు. It can be seen as a breach of contract...ఆ ఒప్పందంలో ఉన్నవాళ్లకు తప్పితే వేరేవ్వరికీ మాట్లాడే హక్కు లేదు.
ఇది అసలు వ్యాఖ్యానం.
దాంపత్యజీవనంలో స్త్రీ యిష్టాయిష్టాలు, హింస గురించి వ్రాసిన కవిత్వంలో నేను చదివిన కవిత వొకటి. ఈ కవితలో pain అంతా ఆమెది. స్పందన పురుషుడిది. ఈ కవిత Vadrevu China veerabhdhrudu గారు వ్రాసినది. "ఒంటరి చేలమధ్య ఒక్కతే మన అమ్మ" కవితా సంపుటిలో "ఇది మంచిది కాదు" చదవండీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి