12, అక్టోబర్ 2018, శుక్రవారం

లిప్త క్షణాలుఈ తొవ్వకేమి తెలుసు
ప్రతి తలపు నీ వైపుకే నని
తనే మనసై నీ దరికి చేరనున్నదని.

***

నీ గురించి ఆలోచిస్తూ
నన్ను నేను గాయపర్చుకుంటూ..
ఆ గాయాలపై ఉప్పు జల్లుకుంటున్నానని

*****

కాయానికేనా తనని తాను మోసుకునే బాధ
గుండెకెంత వ్యధ
తన సొదని వినే తోడు లేక.

*******

తూట్లు తూట్లు పొడుచుకుంటుంది
రక్తాన్ని తుడుచుకుని కుట్లు వేసుకునేది నేనే
నువ్వు  కేవలం నిమిత్రమాత్తుడివి.

**********

ఊహల చెలమలో కథలు వూరుతుంటాయి
 కాసిని తొలుపుకుందామంటే
గులకరాళ్ళ గోటి గిచ్చుళ్ళు

************

అంతరాత్మ భాష అసలు భాష
చిత్రంగా
దానికి నవరసాలు తెలుసు

****************

చేరుకునేదాకనే దూరం
దగ్గరైనాక ఆవలికి జరగడం
కళ్ళపై చేయడ్డుపెట్టి వెతుకుతుంటాం ఇంకో గమ్యం కోసం.


1 కామెంట్‌:

నీహారిక చెప్పారు...

ప్రతి అక్షరం ఒక సత్యం..ఎంత బాగా వ్రాసారండీ ?
నీవు దిద్దిన రుధిర తిలకం... మరువబోదు మనో ఫలకం.