24, అక్టోబర్ 2018, బుధవారం

ఓక్ వృక్షం ప్రేమలో ..


మొక్కలతో సంభాషించని రోజు నాకు వెలితిగా ఉంటుంది. మా అబ్బాయి ఉండే ప్రాంతంలో పచ్చదనానికి ఏ మాత్రం కొరత లేకపోయినా వాటిని సృశించకుండా ఆ పచ్చదనాన్ని అనుభూతిలోకి ఒంపుకోవడం సాధ్యం కానీ పని . ఆకురాలు కాలానికి ముందు నేను అమెరికా దేశానికి రావడం ఆనందం కల్గించే విషయమే. ఎన్నో రకాల వృక్ష జాతులని వాటి ఆకుల రూపు రేఖల్ని పూల పొదలని ప్రత్యక్షంగా చూసాను. వాటిని సృశించకుండా ఉండటమే అసలైన శిక్ష . 

నన్ను బాగా ఆకర్షించిన వృక్షం "ఓక్ " 
ఆ వృక్షపు రాలు ఆకులు రాలిన పండ్ల గింజలు చూస్తూ కాసిని యేరుకుంటూ ఫోటోలు తీసుకుంటూ చిన్న పిల్లలా పేర్చుకుంటూ గడిపే ఆనందకర సమయాన్ని కాస్త మీతో ఇలా పంచుకుంటూ .. ఈ చిత్రాలు. 









1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

"నాకు వివాహ విధి గురించిన ఒక ముఖ్యమైన సందేహం ఉంది. మొత్తం వివాహ విధిలో శుభముహూర్తం ఎందువల్ల మఖ్యమైనది? వధూవరులు సరిగ్గా ఆ ముహూర్తానికి చెయ్యాల్సిన అతి ముఖ్యమైనది ఏమిటి? నేను తలమీద జిలకర బెల్లం పెట్టటం అని ఆనుకుంటున్నాను - అది సరైనదేనా?" అని నేను అడిగిన ప్రశ్నకి ఇక్కడ పెద్దలు చెప్పిన సానుకూలమైన జవాబు ఇది, "అవును, మంగళ సూత్ర ధారణ కంటే ముఖ్యమైన ఘట్టం జీర్ణ+ గూడ మిశ్రమాన్ని ఒకరి బ్రహ్మ రంద్రము పైన మరి ఒకరు పెట్టడం.గుడా =మధుర పదార్థము, జీర్ణ= ఓగురు, చేదు పదార్థము.గుడా మధురమైన పరమాత్మ తత్వానికి ప్రతీక, జీర్ణ =సంసారానికి కారణం అయిన జీవాత్మ కు ప్రతీక. జీవాత్మ పరమాత్మ కలయికయే విశ్వ సంసారం.మానవునిలో బ్రహ్మ రంద్రంలో పరమాత్మ స్థిరంగా ఉంటారు. వివాహం అనే ప్రక్రియ ద్వారా ఆయన్ని చేరుకొని మోక్షం పొందాల్సిన అవసరం ఉంది. " - శుభం!