పనిలేని పంకజాక్షి ఈపి మీద ఈసు (ఈర్ష్య) పడిందంట అనే సామెతని మా నానమ్మ వాడుతూ ఉండేది.
ఈపి అంటే ఏమిటో అనుకునేరు. మనకందరికీ తెలిసినదే.. పేలు గుడ్లు. హాస్టల్ లో పిల్లలని సెలవలకి ఇంటికి తీసుకొచ్చి అమ్మలందరూ వెంటబడి మరీ దువ్వి పోసేవి. అయినా ఇప్పుడు అందరికీ చుండ్రే, పేలు ఎక్కడ వున్నాయిలెండి. అసలు జుట్టే తక్కువ. అమ్మలు ఇంకేమి దువ్విపోస్తారు ? అసలు ఆ ఈపిని జుట్టు క్రింద నుండి దువ్వి జుట్టు ఎంత పొడవు ఉంటె అంత పొడవునా జాగ్రత్తగా లాగి ఈర్పెన పళ్ళని ఎడమచేతితో దగ్గరకి చేర్చుతూ ఇసుకు ఇసుకు అనే శబ్దాన్ని పేలగుడ్లు శబ్దంకన్నా ఎక్కువ వినిపించే అమ్మలకి యెంత అమితానందమో. ఆ ఆనందం కోసమే పిల్లల ఎంబడి పడీ పడీ మరీ కూలేసేవారు. పిల్లల ఆటలకి శత్రువులా అడ్డుపడేవారని నా గట్టి నమ్మకం. మా అమ్మ కూడా అంతే నండి. అందుకే ఈ విషయమంటే నాకంత జ్ఞాపకం.
సోది చెప్పే వాళ్ళ దగ్గరో, నక్కలాళ్ళ దగ్గరో చెక్క దువ్వెనలు కొని భద్రంగా దాపెట్టేవాళ్ళు . సందు దొరికినప్పుడు పేల మీద పేక్షనిజం చూపించే వారు. చెక్క దువ్వెనలు పోయి రకరకాల దువ్వెనలు వచ్చేసాయి. అసలు జుట్టులే మూడొంతులకి పైగా తగ్గిపోయాయి కాబట్టి ఏ దువ్వెనయితే యేం పోయింది అనిపిస్తూ ఉండటంలో తప్పులేదు. కానీ.. ప్లాస్టిక్ దువ్వెనలు ఎందుకు వాడాలి? సహజమైన చెక్క దువ్వెనలు ఎందుకు వాడటం లేదు అనే అనుమానం వచ్చింది. ఈకో గణేశుడి లాగా ఈకో దువ్వెనలు వాడాలి అని కంకణం కట్టుకున్నాను .
ఈర్పెన బొమ్మ కోసం వెదికి వెదికి ప్లాస్టిక్ దెబ్బకి పురాతన ప్రదర్శనశాలలో పెట్టబడి ఉంటుంది అనుకున్నాను . నిజంగా ఈర్పెన చిత్రం గూగుల్ అంతా గాలించినా దొరకలేదిప్పుడు. ఏదో సామీప్యమైన చిత్రాలు దొరికాయి. మనం చిన్నప్పుడు చూసిన, ఉపయోగించిన ఈర్పెన ని ఈర్పెన అంటే యేమిటని అడిగిన భావితరాల వారికి చూపాలి కదా!
నేను చూడండి, వ్రాసుకుంటున్న కథ ప్రక్కన పడేసి ప్రొద్దున్నే యీ ఈర్పెన వెంట బడ్డాను. కథ కంచికి వెళ్లకముందే కనకదుర్గమ్మ ముంగిట ఆగింది. కథలో సామెతని వాడి చేటు తెచ్చుకున్నాను సుమీ! కథ వ్రాసే .. mood పోయి ఈర్పెన లో ఈపి పై చిక్కుకుంది.
ఉండండి ఇంత చెపుతుంటే తల ఒకటే దురదపుట్టి చస్తుంది. ప్రస్తుతానికి ప్లాస్టిక్ దువ్వెనతో అయిననూ కానీ... తల దువ్వి పోయాలి. :)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి