కొన్ని జనరల్ స్టేట్మెంట్లు..
మగవారు ఎంత దుఖం వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి .. ఆడదానిలా ఏంట్రా ..ఆ ఏడుపు ..?
స్త్రీలు దయార్ధ్ర స్వరూపులు, అణువణువునా ప్రేమ నింపుకుని ఉంటారు ద్వేషించడం అసలు చేతకాదు , క్షమా గుణం వారి సొత్తు
ఇంకా చెప్పాలంటే సున్నితమైన మనసు, నాజూకుగా ఉంటారు. అమాయకంగా నమ్మి మోసపోతారు
మగవారు కఠినస్వభావులు మోస పూరితులు, దయ,జాలి ఏ మాత్రం ఉండవు. నిలువునా ముంచేస్తారు
స్త్రీలు అనవసరంగా భయపడతారు పిరికివారు ,మానసిక బలహీనులు
పురుషులు పుట్టుకతో ధీర గుణం కలవారు. ఏదైనా సాధించాలి లేకపోతే గాజులు తోడుక్కున్నట్లే!
ఇదిగో.. ఇలానే statements రాజ్యమేలుతుంటాయి ...
ఇలా ఆడ-మగ సహజ గుణాలు అని వక్రీకరించడం వల్ల.. ఇద్దర్లో ఉన్న గుణాలు కొన్ని మరుగున పడిపోతాయి .
భావోద్వేగాలు ప్రతి మనిషికి మనిషికి తేడాగానే ఉంటుంటాయి. సత్వ,రజో,తామసగుణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు . పరిస్థితులని బట్టి మారుతుంటాయి.
పురుషులందరూ ద్వేషించదగినవారు కాదు .స్త్రీలందరూ అమాయకులు,బలహీనులు కారు .
పురుషులందరూ ద్వేషించదగినవారు కాదు .స్త్రీలందరూ అమాయకులు,బలహీనులు కారు .
ఇది గుర్తెరిగి మసలడం అవసరం కదా !
7 కామెంట్‌లు:
బాగా చెప్పారు.
వనజా, మీ అక్షర ముత్యాలను అభినదిస్తున్నాను. నిజమే స్థ్రీలలోనూ హంతకులున్నారు. పురుషుల్లోనూ సున్నితం ఉంటుంది, ఎంత చక్కగా చెప్పారు ఇలాంటి స్టేట్మెంట్స్ వల్లా అసలు గుణాలు మరుగున పడుతున్నాయి. డియర్ మీ కలానికి నా సలాం.
మీరు చెప్పింది అక్షర సత్యం!
ఆడవారికి మాత్రమే చేతనయిన కళ...ఏడిపించడం
నిజమండీ... శుభాభినందనలు ...
భావోద్వేగాలు సహజాతాలు. సమాజ స్తితిగతులు నీతి నియమాలను, కట్టుబాట్లను బట్టి మనుషులకు కొన్ని రకాల స్వభావాలు ఏర్పడుతుంటాయి. కొన్ని అలవాట్లుగా ఏర్పడతాయి. స్త్రీ-పురుషుడు అనికాక పరిస్తితులను బట్టి భావోద్వేగాలు మారుతుంటాయి. అలవాట్లను ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు. మార్చుకోవాలి.
ఈ పోస్టు నేను ఇవాళే చూస్తున్నాను. మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఒక్క పునరుత్పత్తి విషయంలోపుట్టుక తో వచ్చిన తేడాలు తప్పమిగిలిన ఏ విషయంలోనూ స్త్రీ పురుషుల మధ్య భేదముందనలేము. అయితే ఒక్కొక్క కాలంలో సంఘపు పరిస్థితుల్ని బట్టి జీవన విధానంలో స్త్రీ పురుషులకు తప్పని సరిగా వచ్చే తేడాలను బట్టి ఆయా కాలాలలో కొన్ని మీరన్న జనరల్ స్టేట్ మెంట్లు చెయ్యడం వాటిన ప్రజా బాహుళ్యం అంగీకరించడం జరుగుతుంది. ఇవేవీ అన్ని కాలాలకూ అన్ని ప్రాంతాలకూ వర్తించే సైంటిఫిక్ సూత్రాలు కావు. మరి మగాళ్లని మృగాళ్లంటున్నారు ధర్మమేనా ? ఇదీ అలేాంటిదే కదా ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి