7, జనవరి 2017, శనివారం

హేమంత గానం




కిటికీ పై కొలువుదీరిన మా చేమంతి చెలులు . తెలిమంచు కురిసే సమయాన చిరునవ్వులు చిందుతూ నా నిద్రమత్తుని అటకెక్కించి .. హేమంతమంటే ఏమనుకున్నావ్ ... చంచలమైన మీ నయనాలని కాస్త కుదురుగా నిలబెట్టేది మేమే కదా ! ఇదిగో విరబూసిన మా ముఖారవిందాన్ని చూసే అదృష్టాన్ని మీకివ్వడమే కదా .. అని అల్లరిగా గుసగుసలాడతాయి. నగర జీవనంలో ఓ మొక్కని పెంచడం,పువ్వు పూయించడం అనే కష్టాన్ని ఇష్టంతో సాధించడం ..ఓ వ్యాపకమైంది .

 


ఇక రెండో చిత్రాన్ని నా కొడుకు బంగారానికి వీడియో కాల్ లో చూపగానే గట్టిగా నవ్వాడు. నాకు నవ్వొచ్చింది . ఎందుకంటే ... మా అమ్మ సూపర్, రీ యూజ్  ఐడియా సూపర్ .. అంటే సంతోషమే కదా ! . సంవత్సరన్నర క్రితం వాళ్ళ నాన్న గారికి గిఫ్ట్ గా తెచ్చిన scotch బాటిల్స్ ఈ డబ్బాలలో భద్రంగా పేక్ చేయబడి వచ్చాయి . నేను చూసేటప్పటికి నాలుగైదు డస్టబిన్ లోకి వెళ్లిపోయాయి . ఆఖరిన ఈ రెండు డబ్బాలు చూసి పారేయబోతుంటే వాళ్ళ దగ్గరనుండి లాక్కుని భద్రంగా దాచుకున్నాను. అప్పుడే నవ్వాడు ..ఏం చేస్తావమ్మా వీటిని ? పిచ్చి అమ్మా ..అన్ని దాస్తావు అన్నాడు . ఆ సమయంలో షాపింగ్ బిల్స్ అన్నీ అందులో జాగ్రత్త చేసాను. ఈ మధ్య వాటిని బయటకి తీసి మట్టి నింపి చేమంతి మొక్కలని నాటాను ఇదిగో ..నా ఐడియా ఇలా వికసించింది పూలతో పాటు. .


ఇక మూడవ చిత్రం ... నర్సరీలో తెచ్చిన గులాబీ మొక్క చచ్చిపోయిందని అనుకున్నాను . ఎలాగోలా చివురించి నన్ను  అబ్బురపరిచింది. ఈ గులాబీ మొక్కతో ఎదో అనుబంధం ఉంది నాకు ..చాలా జాగ్రత్తగా పెంచాను .చూపుడువేలంత ఎత్తు పెరిగిందో లేదో .. కృతజ్ఞతగా ఓ మొగ్గ తొడిగింది . బుజ్జిముండ ఎంత బావుందో .. ! అందుకే ముచ్చటేసి ఇలా పిక్ తీసి షేర్ చేస్తున్నా <3

3 కామెంట్‌లు:

Chandrika చెప్పారు...

పెంచిన మొక్కలు పూలు కాయలు ఇస్తుంటే ఆ ఆనందమే వేరు. బావుంది మీ reuse ఆలోచన

అన్నపూర్ణ దుద్దుపూడి. చెప్పారు...

చాలా బాగుంది అమ్మా

అన్నపూర్ణ దుద్దుపూడి. చెప్పారు...

కొన్ని వేళ్లకు...చిగురింపజేసే..కళ ఉంటుంది తెలుసామ్మ