25, సెప్టెంబర్ 2017, సోమవారం

సౌందర్య సృహ

ఈ భూమి పైనే స్వర్గం వుంది అంటే నమ్మి తీరాల్సిందే మనం. కాలక్షేపానికే అయినా గూగుల్ విహంగవీక్షణం చేస్తున్న నాకు  దేవ భూమిలో కనిపించిన ప్రకృతి సౌందర్యం నిశ్చేష్టులని చేసింది  అంటారే అలా స్తబ్ధతకి గురిచేసింది . రెండు చిత్రాలని డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఇలా వ్రాసేసుకున్నాను. 

సౌందర్యమంటే ఏమిటో ఒకోసారి నిర్వచింపలేం. 
ఈ అనంతమైన సౌందర్యాన్ని చూస్తే .. తట్టుకోలేక
ఎందులోనైనా దూకి మరణించాలనిపిస్తుంది
 క్షణకాలం మాత్రమే లే !
ఆకుపచ్చని సముద్రం అలలు అలలుగా ..
మనసు తీరాన ఇంకుతుంది పొరలు పొరలుగా
ఆ అనంత సౌందర్యం ముందు అల్పులమే మనం.
ప్రకృతి సౌందర్యం ముందు మన సౌందర్య సృహ స్వల్పమే మరి.మేఘాలు
రాత్రివేళల్లో కొండలలో లోయలలో విడిది చేసి
భానుడి రాకతో మెల్లిగా ఆకాశం దారి పట్టినాయి
తరువుల గుసగుసలని వర్షంగా మార్చి
ఏ ఎడారులనో నిలువెల్లా తడపడానికన్నట్లు