ఆ పాత మధురం సంగీతం, ఆలోచనామృతం సాహితం అని అన్నారు . సంగీతం ఆహ్లాదాన్ని ఇవ్వాలి, సాహిత్యం ఆలోచనని పెంచాలి అన్నది ఎవరికీ వారు స్వానుభవంతో తెలుసుకోవలసిన విషయమిది .
మన ప్రఖ్యాత ప్రాచీన కవులందరూ మంచి యితి వృత్తాలని ఎన్నుకుని అందరూ ఆదర్శంగా వుండేవిధంగా తలఛి ఇతిహాసం వ్రాసినా, పురాణం వ్రాసినా, నాటకం వ్రాసినా సంఘ శ్రేయస్సుకు వెలుగుబాటగా ఉండాలని తలచి రచనలు చేసేవారు వారి బాటలోనే నడచిన మన మహా కవులందరూ సాంఘిక వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండాలనే తలంపులతోనే కావ్యాలు రచించారు . ఆ తర్వాతి కాలంలో అజ్ఞానపు చీకట్లు అలుముకుని మూఢ నమ్మకాలతో, దురాచారాలతో మ్రగ్గిపోతున్న మానవజాతి వికాసంతో మెలగాల్సిన అవసరం గుర్తించిన సంఘ సంస్కర్తలు మరింత చైతన్యం నింపుకుని రచనలు చేసారు.
పురుషార్ధం కోసమే చతుర్విధ పురుషార్ధాలనే అంతర్లీన సూత్రంని క్రోడీకరిస్తూ ఉదాత్తంగా వ్యవహరిస్తూ అనేక రచనలు చేసారు . ఏ కాలానికి ఆ కాలంలో కొంత విమర్శలు చోటు చేసుకునే ఉంటాయి . ఉత్తమ సాహిత్యం అంటూ ఎవరూ ముద్ర వేయదగిన విధంగా సాహిత్యం ఉండలేదన్నది అక్షర సత్యం . అయితే ప్రజాదరణ పొందినదే ఉత్తమ సాహిత్యం గా లెక్కించడం ఉంది. నలుగురికి చేరువ కాలేని వెలుగులోకి రాని సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. అంత మాత్రంచేత అది సాహిత్యం కాకుండాను పోలేదు .
అసలు ఉత్తమ సాహిత్యమంతా రాజనీతి కోసమే పుట్టిందని సాహిత్య మర్మజ్ఞులు అంటారని ఓ ..ప్రముఖ కవి వ్రాస్తే నేను చదివాను రాజనీతి పూర్వకాలంలో రాచరికం నెరిపినవారికే కావచ్చు . చాణుక్యుడు అర్ధ శాస్త్రం రచించినా ఆ.. రచన ఆనాటి కాలంకి అద్దం పడుతూ ఉంది . తర్వాత రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది కాలానుగుణంగా యీనాడు పాలకులు యెట్లా వుండాలో , ప్రజలు యెట్లా వుండాలో , ఉద్యోగులు యెలా ఉండాలో ఆర్ధిక , రాజకీయ సామాజిక, వాణిజ్య, సైనిక,అంతర్జాతీయ నీతి యెలా వుండాలో చెప్పేది కూడా రాజనీతి అంటారు . రాజ్యపాలకులే అవినీతి పరులైతే ఇక ప్రజల సంగతి యే౦ కాను?
ధర్మార్ధ కామమోక్షాలలో ఆఖరిదాని గురించి ఆలోచించకుండా మొదటి మూడు ప్రతి ఒక్కరికి అత్యసరమైనవె కదా ! అయితే మొదటిది వదిలేసి అర్ధ,కామాల కోసమే మానవ జీవితం ఉన్నట్టు ఈ రెండింటి చుట్టూ పరుగులెత్తే జనావళి కోసం అలాంటి సాహిత్యం వస్తుందని దిగులు పడే వారిని చూస్తున్నాం. అందుకే ధర్మం ఎవరికీ అవసరం లేదు. అందరికి అర్ధకామాలే ముఖ్యం
నవరసాలలో రసరాట్టు శృంగారం అంటారు . సకల ప్రాణ కోటి కోరుకునేది . సకల ప్రాణ కోటిలో ఉత్తమ శ్రేణికి చెందినవాళ్ళం అనుకునే మానవులు ఆ రసాన్ని మనసారా,ఉదాత్తంగా ఆస్వాదించాలి. బాహ్య ప్రపంచం నుండి విడివడి ఆత్మలు సంయోగం చెందినట్లు మమేకం కావాలి. అది తప్ప మరింకేం లేదు అన్నట్టు అచ్చంగా ఆ రసం రంగరించి రాసేవారున్నారు. ఆ రచనలకి పట్టం కట్టేవారు ఉన్నారు. ఇప్పుడొస్తున్న సినిమా పాటలు ఇలాంటివే.
.
ధర్మరహితమైన అర్ధ,కామాలు విభృజించి అత్యంత పాశవికంగా ప్రక్కవారిని పూడ్చేస్తున్నాయి . ధనాంద కారం క్రమ్ముకుని కొందరు , కామ ప్రకోపాలతో కొందరు విషనాగుల వలే పొంచి.. వారి వారి కాటుకు కొందరి జీవితాలని బలి చేస్తున్నాయి. ముసుగు వేసుకుని కొన్ని, అవకాశం చూసుకుని కొన్ని, ఆయాచితంగా లభిస్తున్నాయని కొన్ని ఇలా జవజీవాలని తోడేసుకుంటూ పోతున్నారు. వీళ్ళ తాకిడిలో సామాన్యులు యెటువైపు కొట్టుకుపోతున్నామో తెలియకుండా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ఎంత కష్టపడినా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళడం కష్టంగా ఉన్న పరిస్థితులు, కష్టపడకుండా ప్రక్కవాడికి ఆయాచితంగా లభంచే అన్ని సౌకర్యాల పట్ల ఈర్ష్య , విలాస జీవితం పట్ల వ్యామోహం. కాలక్షేపం కోసం చూసే కార్యక్రమాల ప్రభావం, నేరం ఇలా చేయాలని చూపిస్తున్నట్లు ఉన్న ప్రసార మాధ్యమాలు ఒకటేమిటి అన్ని రకాలగా నాశనమయ్యే కాలంలో మనం జీవిస్తున్నాం . వినాశకాలే విపరీత బుద్ది అంటారు కదా! విలువలు లేని సాహిత్యం కూడా మనిషిని నాశనం చేస్తుంది. మన బ్లాగ్ లోకం కూడా అందులో చేరిపోయింది .. అందుకు విచారిస్తూ .. యీ పోస్ట్ వ్రాయక తప్పలేదు మరి
మనం యే౦ చదువుతున్నాం, యేమి వింటున్నాం , యే౦ చూస్తున్నాం .. యేమి వ్రాస్తున్నాం ? మన మానసిక స్థితి ఎలా ఉంది ? ఇవన్నీ ఆలోచించుకోవలసిన విషయాలు . ఆ ఆలోచనే మనకి కావాల్సింది యిస్తుంది. మనకి మనని మిగులుస్తుంది..
రాజుకి కావాల్సింది వందలమంది వందిమాగధులు, భట్రాజు పొగడ్తలు కాదు కావాల్సింది. ప్రజారంజకంగా పాలించడం , దర్మబద్దంగా వ్యవహరించడం. అది రచనలకి కూడా వర్తిస్తుందనేది అక్షర సత్యం/.
సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించే.. గుణాన్ని ఇచ్చిన జ్ఞాన సరస్వతి పాదారవిందాలకి ప్రణమిల్లుతూ.. ఈ.. ఆపాత మధురం (అ పాత మధురం) ఆలోచనామృతం
బ్లాగ్ వ్రాయడానికి బద్దకిస్తూ చదువుకోవడంలోనే మునిగి ఉన్న నాకు .... బ్లాగ్ లోకంలో నేను చదవని చూడనివి కొన్ని పోస్ట్ లని ఓపికగా నా కోసం ఏరి నా కోసం అందించే ఓ .. మిత్రురాలికి ... ధన్యవాదాలు చెపుతూ ఈ పోస్ట్ .
8 కామెంట్లు:
మీనుంచి మరొక మంచి పోస్టు వచ్చింది. అభినందనలు.
తాత్విక చింతనలో పడినట్టుందే!
ఉత్తమ సాహిత్య ఆవశ్యకత గురించి చక్కగా రాశారు. వ్యక్తి యొక్క స్టాండర్డును ఆయన కళాభిరుచిని బట్టి; అలాగే సమాజం యొక్క స్థాయిని ఆ సమాజంలో పుట్టుకొస్తున్న కళలను బట్టి చెప్పవచ్చని ఎక్కడోె చదివినట్టు గుర్తు. సమాజంలో కళలు ఉన్నతంగా విలసిల్లాలని, వ్యక్తుల కళాభిరుచి ఉన్నతంగా ఉండాలని కాంక్షించిన మీ పోస్టు చాలా బావుంది. థాంక్యూ.
పోస్ట్ చాలా బాగుంది వనజగారు. మనస్సుతో మంచి విషయాలను ఎంతో చక్కగా విడమర్చి చెప్పారు. పైన అందరు చెప్పినట్టు ఎంతో ఉన్నతంగా ఉంది ఈ పోస్ట్! దట్ ఇస్ వనజ ...అని అనిపించారు మళ్ళీ!
నాకో మంచి విషయాన్ని తెలిపారు... చాలా చాలా thanq:-):-)
nice post vanaja gaaru. saahitya viluvala gurinchi aalochimpajesidigaa undi. totalgaa post adubutamgaa undi
http://www.googlefacebook.info/
ఎప్పటిలా పోస్ట్ మీదైన శైలిలో ఉన్న్నతంగా ఉంది.
Kishor Varma గారు .. పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.
@ kashtephale మాష్టారూ .. :) అనుభవజ్ఞులు కదా ! మీకు తెలియనిది ఏముంది చెప్పండి .
@ నాగరాజ్ గారు మీ ప్రశంస కి మనసారా ధన్యవాదములు
@జలతారు వెన్నెల గారు .. మీ వ్యాఖ్య చూసాక కొంచెం హెడ్ స్ట్రాంగ్ వస్తుంది నాకు . థాంక్ యూ సో మచ్.
మెరాజ్.. ఉన్నత మనస్కులకి అన్ని ఉన్నతంగానే కనబడతాయని గురుతుల్యులు చెపుతారు. హృదయపూర్వక ధన్యవాదములు.
కొంచెం ఆలస్యంగా స్పందిస్తున్నాను మన్నించాలి . అందరికి మరో మారు ధన్యవాదములు.
@ఎగసే అలలు గారు మనఃపూర్వక ధన్యవాదములు .
@ Ajay Kumar గారు థాంక్ యూ !
కామెంట్‌ను పోస్ట్ చేయండి