16, డిసెంబర్ 2013, సోమవారం

నా కవిత్వం పై "ఒక్క మాట"

యశస్వి సతీష్  కవిత్వం గురించి "ఒక్కమాట"  గా పరిచయం చేస్తూ 144 మంది కవులను పరిచయం చేసారు .

"ఒక్కమాట " లో నా పరిచయం ఇలా ఉంది .

"పంజరంలో పక్షిలా మనసే కాదు జీవితం కూడా పిడికెడు స్వేచ్చ కోసం అల్లాడి పోతుంటుంది అంటుంది. ఈస్ట్రోజన్ సూదిమందుబారినపడే తెరమీద బేబీ ఐనా కసువూడ్చి.. కళ్ళా పిజల్లి ఎనుకగన్న పిల్లల్ని సాకుతూనే ఉన్న పేదరికమైనా.. బాల్యం ఎట్టా బాగుంటాదని నిలదీస్తుంది. మట్టి చేతిగాజుల చిట్టి తల్లులని ఆడ పడుచులని కాపాడుకోవడానికి కవిత్వ ఆయుధం పట్టింది. రాళ్ళల్లొ వడ్లగింజలా జీవితం జీవించి చూపాలని, ఇతరుల ప్రేమని ఆశించకుండా ఉండటం అవసరమని.. అనుభవం తో.. నొక్కి చెప్తుంది కరిగిన ఘన సమయాలను ఒడిసిపట్టుకుంటూ ఈ నిఖిల చంద్రుడి వెన్నెల వనజ "  

హృదయం తో..స్పందించి , మనసులో.. మదించి,  ఆలోచన అగ్నికణం రగిలించి, తేట తేనియ భాషతో.. అక్షర లక్షలతో సుమాలతో....నవరస కదంబమాలికలు..అల్లడమే.. కవిత్వం  అంటుంది 

 యశస్వి సతీష్ గారు "ఒక్కమాట " ని పరిచయం చేసే క్రమంలో కవిత్వ ఔపాసన చేసిన మీకు నమోనమః. ఇంతమంది కవిత్వాన్ని అద్భుతంగా పరిచయం చేసారు . ధన్యవాదాలు. మీ కవి మనసుకి _/\_ చిరంజీవ ! యశస్విభవ!!

ముఖ్యంగా 15 సంవత్సరాల కాలంలో 60 కవితల దగ్గర ఆగిన  నా కవిత్వాన్ని సమీక్షించి చక్కని అభిప్రాయాన్ని, పరిచయాన్ని అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు. మీ ఈ పరిచయం నాకు నన్నే క్రొత్తగా పరిచయం చేసింది . (పేజీ 143 లో నా పరిచయం )






5 కామెంట్‌లు:

Meraj Fathima చెప్పారు...

vanajaa abinandanalu.

చెప్పాలంటే...... చెప్పారు...

Abhinandanalu vanaja garu

పల్లా కొండల రావు చెప్పారు...

మరోసారి అభినందనలు వనజ గారు.

శశి కళ చెప్పారు...

yentha baga parichayam chesaru.congrats akka

Jai Gottimukkala చెప్పారు...

1934 గోల్కొండ కవుల సంచికలో ప్రచురించబడిన తాతాజీ కవిత్వం గురించిన వివరాలు ఈ కింది టపాలో చూడండి. మీరు స్వతహాగా కవులు & మీకు సాహిత్యం గురించి మక్కువ కనుక ఈ విషయంపై ఆసక్తి ఉందనే నమ్మకంతో ఈ వ్యాఖ్య రాస్తున్నాను, అన్యధా భావించవద్దు. మీ బ్లాగులో ప్రచారం చేస్తున్నందుకు క్షమించండి.

http://jaigottimukkala.blogspot.in/2014/01/tatajis-poem-in-1934-compilation_16.html