ఐ యాం ఆల్వేస్ ఏ లూజర్
అడక్కుండానే మనసిచ్చాను
ఇష్టం ఉన్నా లేకున్నా నన్నడకుండా
దోచుకునేందుకు తనువిచ్చాను
నీ కొత్త రుచుల ఆస్వాదనకి
వేలరాత్రుల నా సహచర్య లేమినిచ్చాను
నీ వంశానికి ఒక వారసుడినిచ్చినట్లే..
ఎవరికో ఇవ్వమని అడిగితే..
నా తాళినిచ్చాను
కోడలు అడిగిందని కొడుకినిచ్చాను
నన్ను నేనడిగితే
పూరించలేని శూన్యాన్నిచ్చాను
మీ పరువుమర్యాదల పాలిస్తూ...
గంగిగోవునయ్యాను
జవసత్వాలని ధారపోసి
ఇంటి గుమ్మానికి తోరణమయ్యాను
ఇన్ని ఇచ్చేసినదానిని ..
మరణం లాంటి వరమివ్వమని కోరుకుంటే
ఇవ్వకుండా ఉంటానా ?
ఐ యాం ఆల్వేస్ ఏ లూజర్
- వనజ తాతినేని 31/12/2014.
6 కామెంట్లు:
శ్యామలీయం గారు మీ సూచనకి చాలా చాలా ధన్యవాదములు. ఇవ్వడంలో కూడా ఇచ్చేసానన్న భావనలో కూడా దాతృత్వాన్ని మీరు మీలాంటి వారు అర్ధం చేసుకుంటారు కదా !
ఇకపోతే కొన్ని చోట్ల మార్పు అన్నారు కదా ! సూచిస్తే తప్పకుండా చేస్తాను.
నేను ఏమి అనుకుంటే అదే వ్రాసి పోస్ట్ చేస్తాను. అందుకే తర్వాత సవరణలు అవసరం అవుతాయి.పెద్దల సూచనలతో, సలహాతో సంస్కరించుకుంటాను .
ధన్యవాదములు.
ఎందుకీ నిర్వేదం వనజ గారు? ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేదోయీ అని ఓ సినీ కవి అన్నాడు కదా? మీరిచ్చినవన్నీ మీకు ఆనందాన్నే ఇచ్చాయనుకుంటాను. ఎందుకో ఈ కవిత మీ సహజధోరణికి కాస్త భిన్నంగా ఉందనిపించింది.
శ్యామలీయం గారు .. ధన్యవాదములు . అచ్చు లోకి వెళ్ళేటప్పుడు మీరు ఉదహరించినట్లు చేస్తాను. ధన్యవాదములు.
కొండలరావు గారు. నమస్తే అండీ ! కవిత్వమే అయినప్పటికీ కవి దృక్ఫదం మీకు బాధగా అన్పించినట్లు ఉంది. అప్పుడప్పుడూ ఇలా వ్రాస్తూ ఉంటాను అంతే !
ధన్యవాదములు. .
కవిత బాగుందండీ .. Happy New Year
ధన్యవాదములు రాజీ గారు . మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి