countless flowers crushed for ever శీర్షికన
The story of a flower beaten
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే ... అన్న కార్ల్ మార్క్స్ మాడు పగలగొట్టాలి అనేదాన్ని ఎప్పుడూ ..
ఈ మగువ అంతరంగ వ్యధ విన్నాక ... నిజమేననిపిస్తుంది.
నిన్ను చూశాక ....
నిన్ను చూస్తే దుఃఖం రావాలి
కనీసం కోపమైనా రావాలి
నిన్నారూపాన చూసినప్పుడైనా
కనీసం జాలి కలగాలి
పోనీ.. తోటి మనిషన్న సృహ కూడా రాలేదు
అందరూ నాటి రాతి గుండె అంటారు
ఇష్టమైనవాళ్ళు నీకు రెండు గుండె లంటారనుకో !
నిజమే ముప్పై ఏళ్ళ పాటు
నా జీవితంలో నువ్వు భాగమయ్యాక
మంచిగానో చెడుగానో నీకు ఒక అనుభవమయ్యాక
నిన్ను చూసాక ఒక చిన్న కదలికైనా ఉండాలి
ఇవేమీ లేవు ... ఒక నిర్వేదం
నేను రాముడే కావాలనుకున్నాను
నాకు రావణుడు తటస్థపడ్డాడు
తప్పు చేసినా సరిదిద్దుకునే మనిషి కావాలనుకున్నాను
నూరోక్కతప్పులని మౌనంగా ఉపేక్షించాను
భాద్యతగా ఉండాలనుకున్నాను
బరువని, నీకడ్డు వస్తున్నాని తోసిపారేసావ్..
వాస్తవాన్ని అంగీకరించి హుందాగా నేను తప్పుకున్నాకైనా
ఎలా ఉండాలి నువ్వు ?
నీకు నువ్వంటే. ప్రేమ ఉండాలి
కనీసం నమ్ముకున్న వాళ్ళ పట్ల భాద్యతయినా ఉండాలి
కనీసం చిన్న ఆశ అయినా ఉండాలి
ఆరోగ్యంపై శ్రద్ద ఉండాలి
ఇవన్నీ లేకుండా కూడా బ్రతుకుండాలి అంటే
ఒక వైరాగ్య భావనైనా ఉండాలి .
కౌగిలించున్నప్పటి సమయాలే కాదు . ..
తర్వాత బోలెడంత జీవితమ్ ఉంటుందన్న సృహ ఉండాలి .
ఇప్పటికి కూడా ఇవన్నీ లేని నిన్ను చూస్తుంటే
మనుషులు ఇలా కూడా బ్రతికి ఉంటారా ? అనిపిస్తుంది .
నీకు నాకు ఉన్న బంధం సహభాగినిగాను కాదు , సహజీవనిగాను కాదు
అయినా ఏదో ఒక బంధం కలుపుతుంది .. అది ఆర్ధిక బంధం .
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే ... అన్న కార్ల్ మార్క్స్ మాడు పగలగొట్టాలి అనేదాన్ని ఎప్పుడూ ..
ఇప్పుడు నిజమనిపిస్తుంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి