1.
ఉన్నట్టుండి నల్లటి పువ్వులని విరబూసిన ఆకాశం
చల్లని గాలితో ఆహ్లాదంగా రాలుతున్న చినుకుల రెమ్మలు
ఆర్తిగా కొంగు పట్టి వాటిని జవురుకుంటున్న నేల కన్నె
ఒడిలో విత్తు పగిలి మూడు ఋతురాత్రులు తెల్లారితే చాలు
పచ్చని కాంతితో పిగిలిపడుతూ పూర్ణ కుంభిణిలా శోభించే పుడమి
ప్రసవ వేదన తర్వాత బిడ్డని చూసుకున్న తల్లి చిరునవ్వులా ఖాళీ భూమిలా
2.
రైతులుగన్న ఆ ఎడతెగని కలలు కల్లలై ఆశలవిసిపోయి
గుండె నెఱ్ఱులిచ్చిఅపహాస్యాలకి కుటుంబాలనిచ్చి
ఋణాల కరాళ నృత్యతాండవంతో బెదిరిన గొడ్డై
ఉరిత్రాళ్ళకి తలలిచ్చి మట్టిలో మట్టిలా కలసి
మనసున దొలిచే ప్రశ్నలా మనుజుడి ఉనికెలా అంటూ ...
నిలిచాడెదుట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి