కాఫీ విత్ కవిత్వం కొద్దీ నిమిషాల్లో
జీవన వనంలో తనదికాని కాలంలో
ఓ పూపొద లేదు యెద సొద లేదు
మధుపం లేదు మధువు లేదు
మధు పాత్రలు తప్ప
రెక్కలు విరిగిన తూనీగల్లేనూ
రంగు రాళ్ళ సీతాకోకచిలకలను చూసి మురుస్తూనూ
మనసును నియంత్రించుకుంటూనూ..
కుదరకపోతే జ్ఞాపకాల గుట్టలను తవ్విపోస్తూనో
ఎంతైనా ఆలోచనలోనే మాధుర్యం ఎక్కువ
అనుభవంలో కన్నా
పూలు పరిమళాల్ని మోస్తున్నట్టు
మనిషి జ్ఞాపకాలు మోయడం సహజాతి సహజం.
జ్ఞాపకాలు
మనిషిని మొత్తంగా వెచ్చ బెట్టే చలిమంటలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి