24, సెప్టెంబర్ 2019, మంగళవారం

దొర్లిపోయిన రాత్రి

ఈ మధ్య నా మిత్రుడొకరు whats app లో పాటొకటి share చేసారు. ఆ పాటను నేను ఇంతకు ముందెన్నడూ వినలేదని కాదు. రేడియో లో సదాబహార్ గానే శీర్షికన ఎన్నోసార్లు విన్నపాటే. కానీ ఈసారి మనసు పెట్టి వింటూ చూసాను . మహ్మద్ రఫీ పాటంటే అదో మైమరుపు.  స్వర సంచారం చేస్తూ లోకాలన్నీ  తిరిగి వచ్చినట్లు వుంటుంది. ఆ పాటలో గాయకుడు  తుంబూర లాంటి వాద్య పరికరాన్ని చేపట్టి విషాదవదనంతో పాట పాడుకుంటూ వుంటాడు. ఆ పాటలో సాహిత్యమంతా కవిత్వమే. అందుకే మళ్ళీ మళ్ళీ విన్నాను. ఎందుకో దృశ్యరూపంగా ఆకట్టుకున్న ఆపాట నన్ను గళ పరంగా అంత ఆకట్టుకోలేకపోయింది. పేలవంగా అనిపించింది.  కారణం పాత పాటవడం మూలంగా కూడా కాదు. నౌషద్ అలీ సంగీతం మైమరపుగా వుంది కానీ ఏదో లోటనిపించింది. 

తరువాత అదే పాటను లతాజీ గళంలో విన్నాను. సినిమాలో పాటకన్నా లతాజీ గళంలో ఆ పాట ఇంకా స్పష్టంగా భావయుక్తంగా ఆకట్టుకుంది. మళ్ళీ మహ్మద్ రఫీ గళంలో (దూరదర్శన్ కి యిచ్చిన లైవ్ టెలికాస్ట్ యిచ్చినప్పటి ) పదే పదే విన్నాను. అప్పుడు చాలా బాగుందనిపించింది. వినగ వినగా పాట జ్వరం అంటుకుంది. ఆ పాట సాహిత్యాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నం చేసాను. మక్కీ కి మక్కీ కాదు. స్వేచ్చానువాదం అన్నమాట.

సరే..  పాట సాహిత్యం చూడండి. ఉబుసుపోక  ఓ చిన్న ప్రయత్నం మాత్రమే !


సుహానే రాత్ డల్ చుకీ న జానే తుబ్  కబ్ ఆవొగే

ఆహ్లాదకరమైన యీ రాత్రి దొర్లిపోయింది
నువ్వు  యెప్పుడు వస్తావో తెలియడం లేదు
అందమైన ఋతువులు మారిపోతున్నాయి ప్రపంచం మారిపోతుంది
మరి నువ్వు  యెప్పుడు వస్తావో తెలియడం లేదు

చూపులు చూసి చూసి అలసిపోయి నిద్రపోవడానికి వెళ్ళిపోయాయి
నక్షత్రాలు తమ కాంతిని వెలిగించి వెలిగించి అలసి వెళ్లి పోయాయి నిద్రపోవడానికి
ఒకదీపం కాంతిని యిచ్చి యిచ్చి వొత్తితో సహా మండి  పోయింది
మరి నువ్వు  యెప్పుడు వస్తావొ  తెలియడం లేదు

ఆహ్లాదకరమైన  యీ రాత్రి దొర్లిపోయింది
నువ్వు యెప్పుడు వస్తావో తెలియడం లేదు


 నీ కోసం తపిస్తూ వేగి పోతున్నానిక్కడ  నీకోసమై  యెదురు చూస్తూ  చూస్తూ 
రంగులల్లుకుని వసంతం వచ్చేసింది కొత్త ఋతువు మొదలైంది
గాలి కూడా తన  దిశను మార్చుకుంటుంది
మరి నువ్వు యెప్పుడు వస్తావో తెలియడం లేదు

ఆహ్లాదకరమైన  యీ రాత్రి దొర్లిపోయింది
నువ్వు యెప్పుడు వస్తావో తెలియడం లేదు

హిందీలో సాహిత్యం యిది ..
सुहानी रात ढल चुकी ना जाने तुम कब आओगे
जहाँ की रुत बदल चुकी ना जाने तुम कब आओगे

नज़ारे अपनी मस्तियांदिखा दिखा के सो गयेसितारे
अपनी रौशनीलुटा लुटा के सो गयेहर
एक शम्मा जल चुकीना जाने तुम कब आओगे
सुहानी रात ढल चुकी ...

तड़प रहे हैं हम यहाँ - २तुम्हारे इंतज़ार में -
खिज़ा का रंग, चला है मौसम--बहार में -
मौसम--बहार में
हवा भी रुख बदल चुकी
ना जाने तुम कब आओगे

सुहानी रात ढल चुकी  ना  जाने तुम कब आओगे 

లతాజీ గళంలో   పాట యిక్కడ
మహ్మద్ రఫీ గళంలో  పాట యిక్కడ
దులారి చిత్రంలో ... సుహానే రాత్ డల్ చుకీ న జానే తుబ్  కబ్ ఆవొగే    అసలు పాట యిది.



కామెంట్‌లు లేవు: