అమ్మ: అమ్మాయి అమ్మాయి.. ఏమి చేస్తున్నావు?
అమ్మాయి: అమ్మా వాకిలి ఊడుస్తున్నాను మన పరిసరాలను పరిశుభ్రంగా వుంచుతున్నానమ్మా
అమ్మ: అమ్మాయి అమ్మాయి.. ఏమి చేస్తున్నావు?
అమ్మాయి: మన ఇంట్లోకి దుమ్ము ధూళి రాకుండా నీళ్ళు చల్లుతున్నానమ్మా.
అమ్మ: అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు?
అమ్మాయి: ముగ్గులేస్తూ జ్ఞాపకశక్తి పెంచుకుంటున్నానమ్మా.
అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు
అమ్మాయి: ఆరోగ్యకరమైన వంట చేసుకోవడానికి పాత్రలు శుభ్రం చేయడం నేర్చుకుంటున్నానమ్మా.
అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు
అమ్మాయి:స్నానం చేయడానికి నీళ్ళు మోసుకుంటున్నానమ్మా..
అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు
అమ్మాయి: మొక్కలకు నీళ్ళు పోస్తున్నానమ్మా
అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు
అమ్మాయి: సైకిల్ నేర్చుకుంటున్నామ్మా
అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు
అమ్మాయి: పశువులకు మేత వేస్తున్నానమ్మా
అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు
అమ్మాయి: ప్రకృతికి నమస్కరిస్తున్నానమ్మా
అమ్మ: అలాగే! మంచి వర్షాలు కురియాలని పంటలు బాగా పండాలని మీ నాన్న వ్యాపారం బాగుండాలని కోరుకోమ్మా
అమ్మ:అమ్మాయి అమ్మాయి ఏమి చేస్తున్నావు అమ్మాయి: దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానమ్మా
అమ్మ:మంచి భర్తను ఇమ్మని కోరుకో..
అమ్మాయి: అమ్మా అమ్మా.. దేవుడు అడిగినవన్నీ ఇస్తాడా..
అమ్మ: ఇస్తాడని నమ్మకం తల్లీ
అమ్మాయి: అమ్మా అమ్మా! తల్లీతండ్రీ దేవుడితో సమానం అంటారు కదా.. నాకు దేవుడు దేవత మీ యిద్దరేనమ్మా.. నేనడిన వరాలన్నీ యివ్వాలమ్మా.
అమ్మ: సంతోషం తల్లీ.. నీకేం కావాలో కోరుకో తల్లీ..
అమ్మాయి: ముచ్చటగా మూడు వరాలు కోరుకుంటానమ్మా.
మొదటిది..అమ్మ చేసే పనులన్నీ ఆనందంగా చేస్తాను.
రెండవది:నాన్న చేసే పనులన్నీ బాధ్యతగా నేర్చుకుంటాను.
ఇక మూడవది ఆఖరిది : ఆడపిల్లవి చదువులు నీకెందుకని అనకండమ్మా. మంచి మొగుడు దేవుడిస్తే రాడమ్మా.. తల్లిదండ్రులందరూ అమ్మాయిని అబ్బాయిని తేడా లేకుండా పనులు చేయిస్తూ చదువులు చెప్పిస్తూ లోకం చూపిస్తూ వుంటే మంచి అలవరుచుకుంటారమ్మా. వాళ్ళే మంచి భర్తలు మంచి పౌరులు అవుతారమ్మా.
అమ్మ: నువ్వు నేర్చిన ఈ కొద్ది చదువు నీకింత మంచి ఆలోచనలు నేర్పింది. నిన్ను మంచిగా చదివిస్తానమ్మా, ఆడమగ భేదం లేని పనులన్నీ నేర్పిస్తానమ్మా. ఆడబిడ్డకు ఆత్మవిశ్వాసం పెరిగేలా బాటలు వేస్తానమ్మా.
అమ్మాయి: అమ్మా ఈ మాత్రం ఊత చాలమ్మా.. ధన్యవాదాలమ్మా..
అమ్మాఅమ్మాయి చేతులు పట్టుకుని సంతోషంగా నాట్యం చేసారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి