కొన్ని లిరిక్స్ వింటుంటే ... అసంకల్పితంగా పెదవులు విచ్చుకుంటాయి. ఇటీవల ఈ పాటని ఎఫ్.ఎం లలో చాలాసార్లు వింటున్నాను. సాహిత్యం సంగీతం బాగా నచ్చేసాయి. కానీ ఏ చిత్రంలో పాటన్నది తెలియలేదు. నిన్న ఒక కాలేజ్ కుర్రాడు ...నా ల్యాపీ వాడుకుంటూ ఈ పాట డౌన్లోడ్ చేసి వింటున్నాడు. అరే! భలే దొరికిందే ..అనుకుంటూ .. "మూవీ పేరేంటి " అనడిగా.. "మనసారా" అంట. మనసారా ఈ పాటని వినేస్తూ .. "ఎంతైనా యూత్ తో పోటీ పడలేం, అప్డేట్ చేసుకోవాలి " అనుకున్నాను.. :)
మనసారా .. ఇదిగో ఈ పాటని మీరూ ఈ లింక్ లో వినేయండి ..
లిరిక్స్ చూడండి ఎంత బావుందో.. అనంత శ్రీ రాం (అనుకుంటాను )
నువ్విలా ఒకసారిలా
అరె ఏంచేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా
నిన్ను చూస్తు చూస్తు చాలిలా
గుండెలోపల ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగ ఇన్నిన్ని కవ్వింతలా
నువ్విలా
నువ్విలా ఒకసారిలా
అరె ఏంచేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా
నిన్ను చూస్తు చూస్తు చాలిలా
చూడాలి చూడాలి అంటు నీ తోడె కావాలి అంటు
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపలా
ఇంతందం ఇన్నాళ్ల నుండి దాక్కుంటు ఏ మూల వుంది
గుండెల్లోన గుచ్చేస్తుంది సూదిలా
పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే
కొంచెం గమ్మత్తుగుంది కొంచెం కంగారుగుంది
అంతా చిత్రంగా వుంది ఈ రోజు ఏమైందిలా
నువ్విలా
నువ్విలా ఒకసారిలా
అరె ఏంచేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా
నిన్ను చూస్తు చూస్తు చాలిలా
చంద్రుణ్ని మింగేసిందేమో వెన్నెల్ని తాగేసిందేమో
ఎంతెంతొ ముద్దొస్తున్నాది బొమ్మలా
తారల్ని ఒళ్లంతా పూసి మబ్బుల్తొ స్నానాలు చేసి
ముస్తాబై వచ్చేసిందేమొ దేవతా
మొత్తం భూగోళమంత పూలే చల్లేసినట్టు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే
నన్నే లాగేస్తున్నట్టు నీపై తోసేస్తున్నట్టు
ఏంటో దొర్లేస్తున్నట్టు ఏదేదొ అవుతోందిల నువ్విలా
నువ్విలా ఒకసారిలా
అరె ఏంచేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా
నిన్ను చూస్తు చూస్తు చాలిలా
గుండెలోపల గువ్వల గుంపుల
ఒక్కసారిగ ఇన్నిన్ని కేరింతలా
నువ్విలా
నువ్విలా ఒకసారిలా
అరె ఏంచేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా
నిన్ను చూస్తు చూస్తు చాలిలా
1 కామెంట్:
నాకు కూడా బాగా ఇష్టమైనా పాట.
కామెంట్‌ను పోస్ట్ చేయండి