17, జూన్ 2014, మంగళవారం

మతం మనిషికి అవసరమా !?.
మతం మనిషికి అవసరమా !?. 

ఆది మానవుడిది ఏ మతం ? పరిణామ క్రమంలో మనిషి మనుగడ మతంతోనే ముడిపడి బలపడిందా !? 

మతం మనిషికి మానసిక అవసరమా !? లేక మతమనే అవసరాన్ని సృష్టించుకున్నామా ? 

 ఇటు శ్రీలంకలో అతివాద బౌద్ధ  మతస్తులు మైనారిటీ ముస్లిం మతస్తులని ఊచకోత కోసి సింహళీయులు తమిళలపై జరిగిపిన హింసని గుర్తుకు తెస్తున్నాయి . 

అటు ఇరాక్ లో తెగలమధ్య విద్వేషాలతో లాభ పడుతున్నది ఇంకొకరు 

ఇక మనదేశంలో ముజఫర్ నగర్ లో జరుగుతున్న హింసాకాండ 

ఎక్కడ చూసినా బలవంతుల చేతిలో బలహీనుల అణచివేత

మతం పేరిట జరుగుతున్న మారణకాండ 

అన్ని దేశాలలోనూ రాజకీయ నాయకుల ఓట్ల బ్యాంకు కి మతం అవసరవతున్నప్పుడూ

మనిషి మనిషిగా బ్రతకలేకుండా మతం ముసుగులో ముఖాలు దాచుకుంటూ తమని తాము మభ్య పెట్టుకుంటూ విద్వేషాల మధ్య బతుకు దుర్భరం అవుతున్నప్పుడూ మతం అవసరమా అనిపిస్తుంది 

ధర్మం అనుకుంటూ  కొందరి విద్వేషాలకి అడ్డుకట్ట వేయలేక ఉదారవాదంతో  బ్రతికేస్తున్న హిందువులది  మతం కాదా ? ఇలా ఎన్నో ప్రశ్నలుదయిస్తున్నాయి ? 

మతం గీతం మనకొద్దు మానవత్వమే మా మతం . అందరికి అదే సమ్మతం అంటూ పసి పిల్లలకి భోధించినంత సులభం కాదేమో కదా ! 

మతం గూర్చి మనకి ఎన్నో ఆసక్తి కల్గించే విషయాలు దారావాహికంగా వచ్చే వ్యాసాలలో నేను కొన్ని చదివాను .. వీలయితే మీరు చదివి చూడండి 

మతం పునాదులు  గురించి డా|| ఆర్కే గారి వ్యాసం లోని ఒక భాగాన్ని చూడండి ప్రజాసాహితి మే నెల సంచికలో

ప్రజా సాహితి కినిగే లో కూడా  లభ్యమవుతుంది 

2 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

బౌధ్ధం హింసాప్రవృత్తిని బోధించిందా? లేదే!

మనిషిలో‌ హింసాప్రవృత్తి దాగిఉంది. దానిని నైతికనియమావళి (ఏ మతంలోనిదైనా) అదుపు చేయటానికి ప్రయత్నిస్తుంది.

ఈ రోజున ఎవరూ ఏ మతాన్ని కూడా నైష్ఠింకగా అనుష్ఠించటం లేదు కదా!

పైపెచ్చు, తనలోని హింసోన్మాదాన్ని వెళ్ళగ్రక్కేందుకు మతం అనేది కూడా అతని చేతిలోని అస్త్రాల్లో ఒకటిగా ఉపయోగపడుతోంది. అంతే.

ఈ మతంపేరిట జరిగే హింసలకూ‌ ఆయా మతాలకూ నిజమైన అనుబంధాలు ఏమీ లేవు.

మనిషితప్పుడు ధోరణికి ఈ‌మతాన్నో ఆమతాన్నో నిందించటం దేనికి?

rani mukka చెప్పారు...

hi mam watch this may be u will like.
http://www.youtube.com/watch?v=2q7goy3Fifk