28, జూన్ 2014, శనివారం

అభివృద్ధికి అధ్బుత దీపం ఉందా?

అభివృద్ధి మాట వింటే అసహనం కొందరిలో ....
జరిగేది అభివృద్దే కాదంటారు . అలాంటప్పుడు నా ఆలోచనలు ఇలా ఉంటాయి
జరుగుతున్నది అరకొర అభివృద్ధి అయితే పూర్తి అభివృద్ధి చేయడం ఎవరివల్ల సాధ్యం ? నాయకుల చేతిలో అద్భుత దీపం ఉందా ?

విశ్వమానవ సమానత్వం ,శ్రేయస్సు దృష్ట్యా ఖండాలమధ్య హద్దులే చెరిగిపోతున్నాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందరికి అందుబాటులోకి వస్తుంది ఆ ఫలితాలని అనుభవిస్తూనే అభివృద్దిని వ్యతిరేకించేవారిని చూస్తున్నాం ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్దిని కాంక్షించే క్రమంలో మూలాలని ,సంస్కృతిని విచ్చిన్న చేస్తూనే ఉన్నారు. సహజ వనరులని మితిమీరి వాడుకుంటూ పర్యావరణ సమతుల్యానికి చేటు చేస్తూనే ఉన్నారు తప్పనిసరై కొంత,మానవ నిర్లక్ష్యం కొంత, మితిమీరిన స్వప్రయోజనాలు మరి కొంత.

అభివృద్దిని కాంక్షిస్తూనే మూలాలు మిగిలి ఉండాలని భావించే వారు మానవ నాగరికత అభివృద్ధి ఎలా చెందిందో గమనిస్తూనే మనం ఎలాంటి ఫలాలని అనుభవిస్తున్నామో గుర్తెరగాలి ..


ఉదాహరణకి కొన్ని .. మనం అదివరకు కట్టెల పొయ్యి వాడేవాళ్ళం . కట్టెలు కోసం చెట్లని నరికేవాళ్ళం . (అవి కాకుండా ఇంకా చెట్ల అవశేషాలు కంది కంప, ఎండిన మామిడి కొమ్మలు,పేడ ఊకతో తయారయిన పిడకలు కర్ర బొగ్గులు ఇలా ) చెట్లు నరకడం వల్ల పర్యావరణ నాశనం అని అర్ధం కాకపోయినా పొగ లేని పొయ్యిలు కూడా వద్దనుకుని గ్యాస్ వాడకం అందరికి అందుబాటులోకి వచ్చింది సహజంగా లభించే గ్యాస్ ని వెలికి తీసి వాడటం అభివృద్ధి,  బయో గ్యాస్ వాడకం అభివృద్దికి సూచకం, సోలార్ విధ్యుత్ అభివృద్దికి సూచకం

చెట్లని నరకడం  వల్లపర్యావరణ నాశనం జరుగుతుందని నరకడం ఆగిందా ? మిగిలిన అనేక అవసరాల కోసం  చెట్లు నరుకుతూనే ఉన్నారు ఇలా అభివృద్ధి క్రమంలో మనం  గమనించాల్సినది చాలా ఉంది .. మితిమీరిన సెల్ ఫోన్ వాడటం వల్ల టవర్స్ పెరిగి రేడియేషన్ వల్ల పిచ్చుకల లాంటి ప్రాణులే అంతరించి పోతున్నాయి .. మరి మనం సెల్ పోన్ వాడటం ఆపేసామా ? ఎయిర్ కండీషన్ వాడకం ఆపేసామా? మనవంతు ఏమి చేయకుండానే పర్యావరణాన్ని నాశనం చేస్తూనే అభివృద్ధి ఫలాలని అనుభవిస్తూనే అభివృద్దిని విమర్శించడం తగునా ? 


నిజమైన అభివృద్ది ఫలాలు అందేదాకా వేచి వుండే ఓపిక  అందరికి ఉందా?  ఇది ఆలోచించే విషయం కదా ! విధ్యుత్ కోతని నిరసిస్తున్నాం.. విధ్యుత్ లేకుండా ఉండటం అలవాటు చేసుకుంటే సహజ వనరులైన బొగ్గు బర్న్ అయ్యే పని ఉండదు.,. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది కదా ! కానీ మనం అలా ఉండగల్గుతున్నామా?

కులం మతం ప్రాంతం రాజకీయాల్ని మోస్తున్నాయి
ధన స్వామ్య వ్యవస్థలోనే ప్రజాస్వామ్యం అనే అప్రజాస్వామ్యం వేళ్ళూనుకుంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా కార్పోరేట్ కనుసన్నలలోనే మెలుగుతుంది .. రాజకీయ పార్టీల మనుగడకి అధికారంలోకి రావడానికి వారి డబ్బు చాలా అవసరం.  అధికారంలోకి వచ్చాక కార్పోరేట్ రంగానికి పెద్దపీట వేయడం ప్రభుత్వాల పని..
సంస్కరణ ఎవరివల్ల సాధ్యం.. ? ప్రజలు ఓటు విలువని నోటుతో,. సీసా మందుతో అమ్ముకున్నరోజే వారిని ప్రశ్నించే హక్కు కోల్పోతున్నారు.   ప్రజాలేమన్నా తక్కువా? వీళ్ళకి స్వప్రయోజన చింతన లేదా చెప్పండి ? 

అభివృద్దికి గనులు అవసరమే.,.పరిశ్రమలు.,. ,ప్రాజెక్ట్లు అవసరమే ! ఆ అభివృద్ధి ముసుగులో స్వార్ధప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా దోచేస్తూ పేదల మీద అబలల మీద దాడులు చేసేవారిని తప్పకుండా ప్రశ్నించాలి. వారి తరపున ముందు నడిచేవారిని అభినందిద్దాం.. అంతే కాని అభివృద్దిని వ్యతిరేకించవద్దు అభివృద్ధి గమనం లో మానవ నిర్లక్ష్యాన్ని గుర్తుచేస్తూ అభివృద్దికి కొత్త భాష్యం చెప్పేవారి మాటలని గౌరవిద్దాం. 

ప్రాజెక్ట్ ల నిర్మాణంలో ఆదిమవాసిప్రజలందరూ వారి ప్రాంతాలకి దూరమయ్యారు . వారికి చాలా నష్టం జరిగి ఉంటుంది.    తెహ్రి డాం నిర్మాణం వల్ల ఎన్నో రాష్ట్రాలకి ముప్పు ఉందని ఆ డాం నిర్మాణం ఆగిందా ? ఎప్పుడు ప్రాజక్ట్ లు కట్టినా ఏదో ఒక వివాదం ఉంది. అంతెందుకు .. కొన్నేళ్ళ క్రితమే నిర్మితమైన "శంషాబాద్ " విమానాశ్రయ నిర్మాణంలో నష్టపోయింది చిన్నా చితక రైతులు కాదా !? ప్రజలకి పర్యావరణం మీద ప్రేమ కన్నా రాజకీయ పార్టీలకి కొమ్ముకాయడం ఎక్కువైపోయింది. ప్రత్యేక ఆర్ధిక మండల్లు పేరిట సేకరించి బహుళజాతి సంస్థలకి ధారాదత్తం చేసిన భూమి కన్నా సొంత రాజధానికి సేకరించిన భూమి పైనే విమర్శలు ఎక్కువయ్యాయి. త్రాగు నీళ్ళకి ఎంత కట కటో హైదరాబాద్ లో అనుభవించి వచ్చారు. భవిష్యత్ తో అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే నదీ తీర ప్రాంతం, అందరికి అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. భవిష్యత్ లో ఇబ్బందులు కలుగకూడదనే ముందు చూపుతో రాజధాని నిర్మాణం సాగుతుందని ఎందుకు అర్ధం చేసుకోరు ? 

చేతికి చిప్ప ఇచ్చి పంపిస్తే... ఇలాంటి పరిస్థితులల్లొ ఏ పార్టీ నుంచి ఎంపిక కాబడ్డ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారో ఆలోచించండి. కాస్త నిజాయితీగా పని చేసేవాళ్ళని గౌరవించండి. ఓపిగ్గా పనులు చేయించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి.   ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి ... మోసపోకుండా . . ఎవరికీ వారు వ్యక్తి అభివృద్ధి గురించి ఆలోచించుకుంటూ ... తర్వాత సమాజం గురించి ఆలోచించడం మంచిదని తెలుసుకుంటే ... నాయకులపై ఆశలుండవు. వాళ్ళు మాత్రం దేవుళ్ళేమికాదు. వాళ్ళ ఆశలు,వాళ్ళ ఆకళ్ళు తీరినాకనే ప్రజల గురించి ఆలోచిస్తారు. ఈ మాత్రం అవగాహన ఉన్నవాళ్ళు ఎవరూ పదే పదే నాయకులని తిట్టరు. 

భావప్రకటన స్వేచ్ఛ మనహక్కు ... ఆ హక్కుని అల్ప విషయాల పట్ల, కాలక్షేపపు బఠానీ కబుర్లకి అతిగా వాడేసి అసహనం పెంచుకోవడం తప్ప ... మంచికి ఉపయోగించుకోవాలని తెలుసుకోలేకపోవడం  శోచనీయం.     


అభివృద్దికి గనులు అవసరమే.,.పరిశ్రమలు.,. ,ప్రాజెక్ట్లు అవసరమే ! ఆ అభివృద్ధి ముసుగులో స్వార్ధప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా దోచేస్తూ పేదల మీద అబలల మీద దాడులు చేసేవారిని తప్పకుండా ప్రశ్నించాలి. వారి తరపున ముందు నడిచేవారిని అభినందిద్దాం.. అంతే కాని అభివృద్దిని వ్యతిరేకించవద్దు అభివృద్ధి గమనం లో మానవ నిర్ల్క్ష్యన్ని గుర్తుచేస్తూ అభివృద్దికి కొత్త భాష్యం చెప్పేవారి మాటలని గౌరవిద్దాం

2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Harad work. No short cuts for development. KASTEPHALI.

Sharma చెప్పారు...

తమ స్వంత సుఖాలకు ఉపయోగపడే అభివృధ్ధిని అందరూ ఆనందిస్తున్నారు , హర్షిస్తున్నారు .
ఇంకా అభివృధ్ధిని కోరుతూనే వున్నారు .
కకుంటే ఆ అభివృధ్ధికి తమ వంతు చేయూతను యివ్వవలసి వచ్చినప్పుడే తమని కాదన్నట్లు పక్కత్రోవలు పడ్తుంటారు .
మిగిలిన జీవుల , జీవాల గురించి ఆలోచిస్తే స్వ సుఖం కనుమరుగయ్యే ప్రమాదమున్నది కద! .