11, నవంబర్ 2014, మంగళవారం

పార్టీషన్స్ Vs పార్టనర్భారతీయ స్త్రీల ప్రేమలో పార్టీషన్స్ ఉంటాయి కానీ పార్టనర్స్  (ఉండరు) ఉంటారా?  

స్త్రీ ప్రకృతికి మరో రూపం . మనో బాహ్య పర్యావరణం అంతా ప్రేమ మయం .  పురుషుడిలో ఆమె సహభాగం అదే అర్ధనారీశ్వర తత్త్వం . ఈ ఆకళింపు తోనే వాస్తవ పరిస్థితులని బట్టి ఈ పోస్ట్ వ్రాయాలనిపించింది 


నేను "ఆరెంజ్"  చిత్రం బాగా బాగా నచ్చిందని చెపితే కొందరు నన్ను విచిత్రంగా చూసారు . మరి కొందరు "మాకంతగా బాగా  అనిపించలేదే !? అంటూనే మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూస్తాం" అన్నారు . 

ప్రేమ ఎప్పుడూ శాశ్వతంగా, స్థిరంగా ఒకరి పైనే ఉండటం సాధ్యం కాదు . ఈ కాన్సెప్ట్  అందరికి అర్ధమైనా అందరూ ఒప్పుకోరు కదా! 

కేవలం ఒకరే ఒకరిని శాశ్వతంగా ప్రేమించడం అనేది సాధ్యం కానిపని. అలా అని చెప్పారంటే అది అతిశయం అన్నా కావాలి లేక మోసం చేసుకుంటున్నారని అయినా అనుకోవాలి.  అన్నీ నిజాలు మాట్లాడే "ఆరెంజ్ " హీరో నచ్చాడు .  ఆఖరికి అదే హీరో  సినిమా ఆఖరిలో వివాహానికి  కట్టుబడి ఉండటానికి ఒప్పుకోవడం నచ్చింది  

ఇందాకనే "చిన్నారి పెళ్ళి కూతురు " చూసి కనులు చెమర్చాయి . అనుబంధాలు ఎంత సున్నితమైనవి . ఒక చోట తెగి పోయి మరొక చోట పెనవేసుకుంటాయి . 

ఒంటె కి  కడుపులో నాలుగు భాగాలు ఉంటాయట. అలాగే స్త్రీ జీవితంలో (ప్రేమలో ) కూడా అనేక భాగాలు  ఉంటాయి 

జన్మనిచ్చిన  తల్లిదండ్రులని, తోబుట్టువులని, ఇంటిని, తువ్వాయిలని , పువ్వులని అన్నింటిని ఎంతగానో ప్రేమిస్తారు . మూడుముళ్ళు పడగానే భర్తని ప్రేమిస్తారు. అత్తింట్లో అడుగుపెట్టాక అందరిని తనవారిగా భావిస్తూ అనుబంధం పెంచుకుంటారు . తర్వాత పుట్టిన బిడ్డలని ప్రాణప్రదంగా ప్రేమిస్తారు . తర్వాత బిడ్డలా బిడ్డలని ప్రేమిస్తారు . స్త్రీ ప్రేమ ఇలా రూపాంతరాలు చెందుతూ  వృద్దిలో ఉంటుంది. 

అందుకే  స్త్రీ లైఫ్  లో పార్టీషన్ ఉంటాయి కానీ పార్టనర్స్ ఉండరు . " పార్టనర్స్ "  ఉండటానికి లైఫ్ ఏమి బిజినెస్ ఎగ్రిమెంట్ కాదు కదా ! 

అందుకే .. లైఫ్ పార్టనర్ అంటారు . పురుషుడికి కూడా లైఫ్ పార్టనర్ "యే"  ఉండాలి "లు " కాదు ఉండాలంటే ఉతికి ఆరేసేయాలి 

మనభారతీయ సంప్రదాయం "ధర్మేచ, అర్ధేచ , కామేచ,  త్య యేషా  నాతి చరితవ్యా , నాతి  చరామి" అర్ధం కూడా ఇదే కదా ! 

 పార్టనర్స్ ని  మెయిన్ టైన్  చేసే మహానుభావలకి / మహాను భామిని లకి   ఈ అర్ధం తెలియక కాదు. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వారికి. అందుకోసం కట్టుకున్న దానిని / వాడిని నట్టేట్లోనూ ముంచేస్తారు. అవమానాల పాలు చేస్తారు . వీరిది ఆకర్షణ అనాలా !? మరి నిజమైన ప్రేమ అనాలా?  వీరిని ఆమోదించే తల్లిదండ్రులు వారి పరివారానికి ఆత్మ విమర్శ చేసుకుంటే ఈ సత్యాలు బోధపడకమానవు. 

అయినా "మన వాళ్ళు చేస్తే మనకి అసలు తప్పు కాదు " మన పిల్లలకి ఇలాంటి స్థితి వస్తే  ఇటివంటివి తప్పు.  ఎప్పుడు మారతారు రా బాబూ  ఈ జనం !?     

అసలైన ప్రేమ రూపం ఏమిటి ? ఇలా ప్రశ్నలు  వేసుకుని ఆలోచన చేసి  చూడండి.  ఒకే ఒక ప్రేమ ఎందుకు సాధ్యం కాదో కూడా తెలుస్తుంది   వివేకం తో  తన కుటుంబంతోనే ప్రేమని ఎలా విస్తరింప జేసుకోవాలో చెపుతుంది తప్ప తగని వ్యామోహాలకి, పైత్యాలకి   "ప్రేమ" అనే పేరు పెట్టుకోవద్దని చెపుతుంది. ప్రేమ అనేది ఎండమావి లాంటిదని  చెపుతుంది.

  "ఎన్నాళ్ళు ప్రేమిస్తానో తెలియదు, ఎప్పుడూ కలసి ఉంటానని చెప్పలేను" అనే నిజాయితీ పరుడు కూడా కమిట్ అయి పెళ్ళికి అంగీకరిస్తాడు . దటీజ్ మేరేజ్ కమిట్ మెంట్    అందుకే  "ఆరెంజ్ " చిత్రాన్ని ఇంకోసారి చూసేయండి.   :)  ఎందుకు నచ్చలేదో , నచ్చిందో మీలోనే దాచేసుకోండి . నా అభిప్రాయంతో ఏకీభవించక పోయినా పర్లేదు . 

10 వ్యాఖ్యలు:

rani mukka చెప్పారు...

prema gurinchi vachina songs lo e song chala baga vuntadi
http://www.youtube.com/watch?v=Mq_iqrLS83U

K Srinivas చెప్పారు...

నిజంగా నిజం చెప్పారండి

Hari Babu Suraneni చెప్పారు...

అసలైన ప్రేమరూపం యేమిటి అని మీరడిగిన దానికి ఖలీల్ జిబ్రాన్ కవితలో జవాబు దొరుకుతుంది!సినారె అనువదించిన శిఖరాలు-లోయలు అనే పుస్తకంలో వుంటుంది.మర్రి చెట్టు నీడలో మరొకటి యెదగనట్టు ఒకరు మరొకర్ని డామినేట్ చెయ్యకుండా రెండు పక్కపక్కనే గాలినీ యెండనీ పంచుకుంటూ యెదిగే చెట్ల జంటతో పోల్చాడు మనుషుల్ని కూడా!

100% సమానత్వం కుదరదు గాబట్టి మనవాళ్ళు మామిడి చెట్టును అల్లుకున్న మాధవీ లతతో పోల్చారు.సాధారణంగా మగాడు మామిడి చెట్టు అవుతాడు,తన పోషణలో వుండటానికి ఆడదీ వొప్పుకోవడం వలన!కొన్ని జంటల్లో(రంగనాయకమ్మ-గాంధీ) ఆడది మామిడి చెట్టయితే మగాడు మాధవీ లతలా సర్దుకు పోతాడు?

యెవరు యెలా సర్దుకుపోయినా అసలు వాళ్ళిద్దరికీ అనువుగా వుంటే బయటి వాళ్ళు కంగారు పడనక్కర్లేదు."ఔను, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!" - మధ్యలో నీకేంటి? అంటారు నాలాంటి తింగరి మనిషి యెవరన్నా కెలికితే:-)

ఖలీల్ జిబ్రాన్ అక్కడే చెప్పిన మరో పాయింటుని నా పధ్ధతిలో చెప్తే - ఒక అందమయిన దృశ్యం చూసినప్పుదు తను కూడా వుంటే ఇంకా బాగుండేది అనిపించడమే నిజమయిన ప్రేమకి గుర్తు!

వనజ తాతినేని చెప్పారు...

Rani గారు మీరిచ్చిన లింక్ లో వీడియో చూసాను 'చాలా బావుంది . Thank You !

వనజ తాతినేని చెప్పారు...

K.Srinivas గారు ధన్యవాదములు

వనజ తాతినేని చెప్పారు...

Hari Babu Suraneni గారు నేను చాలా కాలం తర్వాత సీరియస్ గా వ్రాసిన పోస్ట్ కి మీ వ్యాఖ్య సంతోషాన్నిచ్చింది . ఒక అజ్ఞాత కామెంట్ కి విరక్తి కల్గింది మరి.
నేను కన్ఫ్యూజన్ లో ఈ పోస్ట్ వ్రాసాను అనుకోవడానికి లేదు. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు

మామిడి చెట్టు - మాధవీ లత పోలిక నాకు బాగా నచ్చింది
శిఖరాలు - లోయలు దొరుకుతుందేమో చూస్తాను.

వనజ తాతినేని చెప్పారు...

అజ్ఞాత గారు మీ వ్యాఖ్యని నేను ప్రచురించ లేకపోయాను. ఎందుకంటే సరైన ప్రొపైల్ లేని కారణంగా, అలాగే మీరు చాలా తీవ్రంగా స్పందించారు. కానీ ఈ పోస్ట్ చాలా పాజిటివ్ గా వ్రాసాను గమనించగలరు .

Anitha Chowdary చెప్పారు...

అవునండి ఆ కథ నాకు కూడా నచ్చింది ఒకరిపైనే ఇష్టం శాశ్వతంగా వుంటుంది అనుకోడం పొరపాటు అందుకే అబ్బాయిలు వచ్చి నిన్ను నేను బాగా ఇష్టపడుతున్నాను చచ్చేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటే నమ్మి మోసపోకండి అది కచ్చితంగా అపద్దమే సంకోచమే లేదు

Telugu Songs Lyrics

swarajya lakshmi mallampalli చెప్పారు...

ఇప్పటి వరకూ మీ బ్లాగులో ప్రతీ పోస్టూ చదివాను. కానీ స్పందించినది మాత్రం ఇపుడే. పురుషుడికైనా,స్త్రీ కైనా పార్ట్నెరే ఉండాలి,"నర్స్" కాదు. ఎన్నాళ్ళగానో రోజూ సమాజంలో జరిగే విచిత్రకధనాలు చూస్తూ అనుకునేదాన్ని,ఎందుకిలా మనుషులు నైతిక విలువలకు తిలోదకాలిచ్చి దిగజారి ప్రవర్తిస్తున్నారని. ప్రతీ హత్యో,లేక ఏదో ఒక దాడికి వెనుక కారణం ఈ పిచ్చి రిలేషన్సే. చదువులు పెరిగి ఆడపిల్లలుకూడా ఉన్న నాలెడ్జ్ దేనికీ ఉపయోగించకుండా బురదలో కాలేస్తూ దొరికిపోయి అభాసుపాలౌతున్నారు.పేరెంట్స్ కూడా పిల్లలకి వివాహబంధం,దాని విలువలు చెప్పట్లేదేమోనని అనిపిస్తుంది.ఇది కాకుంటే మరొకటి అన్న చందంగా ఐపోయింది. అందుకే విడాకులుతీసికునేవారి సంఖ్య పెరిగిందట. స్వచ్చమైన ప్రేమ ఈరోజుల్లో దొరుకుతుందంటారా?అసలు కనిపిస్తుందా?.ఏదిఏమైనా లైఫ్ కి పార్ట్నర్ కాకుండా పార్ట్నర్స్ కావాలని వెంపర్లాడేవారిని వాడు మగ ఐనా లేక ఆడదైనా మీరన్నట్లు వారికి రేవు పెట్టల్సిందే.మంచి విషయాన్ని అందించారు.ధన్యవాదాలు.

Upendar చెప్పారు...

నేను మీతో నూరు శాతం ఏకేభవిస్తున్నాను వనజ గారు. చాలా బాగా చెప్పారు.