18, డిసెంబర్ 2014, గురువారం

సారంగ లో రచయిత గారి భార్య






చెట్టు, పువ్వు కథ చెప్పడం వింటారా?

అయితే .. సారంగలో ..  నేను వ్రాసిన ఈ కథని చూడండి

రచయిత గారి భార్య 

2 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"వనజవనమాలి" గారూ మీ ఈ కధ లాంటి వ్యధలు లోకంలో చాలా ఉన్నాయండీ.. నేను చాలా రోజుల క్రితం ఒక పుస్తకం చదివాను అందులో హీరోయిన్ భర్త ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడని,ఆఫీసులో లేడీ కొలీగ్స్ తో చనువుగా మాట్లాడుతున్నాడని అలిగి పుట్టింటికి వచ్చేస్తుంది అప్పుడు ఆ అమ్మాయి బామ్మ ఇంతమాత్రానికే అలిగి వచ్చేస్తావా అయినా ఇదేమంత పెద్ద తప్పని అంటుంది. అంటే ఒక ఆడపిల్ల భర్తని వదిలి రావాలంటే ఎంతో పెద్ద కారణం ఉండాలి,ఎంతో హింస అనుభవించాలి ఆ హింస ఎంతని ఎవరు నిర్ణయించాలి? హింసని అనుభవించే స్త్రీనా ,లేక కుటుంబ సభ్యులా,సమాజమా.. హింస శారీరకంగా కంటే మానసికంగానే ఎక్కువ వేధిస్తుందనేది మనసున్న ప్రతి మనిషికి తెలిసిన నిజం ..

మీ కధలో భార్య చివరికి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఆమెకి,ఆమె పిల్లలకి కూడా.. ఎప్పటికైనా మార్పు వస్తుంది అన్న మనుషుల కోసం ఓర్పు వహించటంలో తప్పు లేదు కానీ ఇలాంటి మృగాల కోసం ఓర్పు వహించినా అది చేతకానితనం అనిపించుకుంటుంది.

అలాగే ఒక భార్య భర్తని ఎదిరించి బయటకి వచ్చినంత సులభంగా ఈ సమాజాన్ని ఫేస్ చేయలేదు అని నా అభిప్రాయం. గృహహింస కేస్ పెట్టినంత మాత్రాన న్యాయం జరుగుతుంది అని చాలా మంది మహిళలు అనుకుంటారు కానీ అది కొంతవరకు మాత్రమే నిజం. ఇప్పుడసలే కేసులు పెట్టే ఆడవాళ్ళందరూ తప్పుడు కేసులే పెడుతున్నారని ఒక సామాన్య మానవుడి దగ్గర నుండి కోర్టులో తీర్పు చెప్పే న్యాయాధీశుల వరకు అందరూ నమ్ముతున్నారు,విచారణ సమయంలో చులకనగా మాట్లాడుతున్నారు..

ఇలాంటి పరిస్థితులు మీ కధలో భార్యకి మాత్రమే కాదు ఎవరికి వచ్చినా వాళ్ళ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకుని, ధైర్యంగా పరిష్థితులను ఎదుర్కుని అనుకున్న గమ్యం చేరాలని కోరుకుంటాను. మన సంకల్పం మంచిదైతే ఎవరు సహాయం లేకపోయినా దేవుడే తోడుంటాడు అంటారు కదా.. ఈ కధలో "చెట్టు,పువ్వు" లాగా ...

వ్యాఖ్య చాలా పెద్దది అయినట్లుంది.. ఏదో అలా చెప్పాలనిపించింది రాసేశాను .. ఏమీ అనుకోరు కదా ..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజ్య లక్ష్మి గారు .. మీ వ్యాఖ్యలో ఎంతో నిజం ఉంది . గృహ హింస అభియోగాన్ని ఒక బలమైన కేసుగా చూడటంలేదు ఆడవాళ్ళ పై అనేక వ్యాఖ్యానాలు చేయడం నేను విన్నాను .
నాకు తెలిసినంతవరకూ మీరు ఒక న్యాయవాది, ఇప్పుడు న్యాయమూర్తిగా ఉన్నారనుకుంటాను

హింస అంటే ఏమిటన్నది బాధితులు చెప్పవలసిందే !? మీ ప్రశ్న, మీ వివరణ, మీ అభిప్రాయం చాలా విలువైనవి . భర్త రచయిత, మామూలు వ్యక్తా అన్నది కాదు . మృగత్వం ఆమెని అన్ని రకాలుగా బాధిస్తున్నప్పుడు ఇప్పటికైనా మేలుకొనడం హర్షణీయం ఆ దిశగా కథ వెళ్ళడం నాకు నచ్చింది.

ఏదైనా స్త్రీలు స్వాభిమానంతో బ్రతకడం అవసరం కూడా . సానుభూతిని ఆశించే కథ కాకూడదని వ్రాసేటప్పుడు అనుకున్నాను. బహుశా పువ్వు చెప్పిన కథ కాబట్టి అలా వెళ్ళిపోయింది.
మీ వ్యాఖ్యకి హృదయపూర్వక ధన్యవాదములు