ఒకానొకప్పుడు నిజంగా చెప్పాలంటే ఓ పదహారు ప్రాయంలో రేడియోలో ఏ పాట విన్నా ..
అబ్బా ! ఈ పాట ఎంతబావుంది, ఎవరు పాడుకున్నారో , అబ్బాయి చిలిపిగా నవ్వుకున్నాడా ? అమ్మాయి బుగ్గలు సిగ్గులతో కెంపులయ్యాయా? పాట సాహిత్యం ఎంత బాగుంది ..నీ మనసు నా మనసు ఏకమై ..అంటున్నారు. ఏకమైతేనే ఇలా అనిపిస్తుందా ? లేకపోతే ఇలా అనిపించదా ? ఇలా పాట పాడుకోవాలంటే శోభన్ బాబు లాంటి అబ్బాయిని ఎక్కడ వెతుక్కోవాలి ? ఆ తొందరలో ఎవరినో ఒకరిని ఎన్నుకుంటే మా అమ్మ కాళ్ళు విరక్కొట్టదూ, మా నాన్న సినిమాల్లో విలన్ లాగా ఆ అబ్బాయిని ఏమైనా చేసేస్తే ...
ఇవన్నీ వద్దు కానీ ..అయినా నా వయసుకి శోభన్ బాబు లాంటి ముసలాడు ఎందుకు ? అసలే మా పెద్ద నాన్న చిన్ననాటి స్నేహితుడంట. మా వూరిలో పుట్టి పెరిగి .మా వూరి నుండే మైలవరం వెళ్లి చదువుకున్నాడంట పెద్దనాన్నతో కలిసి. ఇక శోభన్బాబు కథలు మా పెదనాన్న తాతయ్య కథలు కథలుగా చెప్పేశారు. ఇక శోభన్ బాబు అంటే ఇష్టం చచ్చిపోయింది . అతన్ని అమ్మ,పిన్నమ్మలు అత్తలు, పెద్దక్కలు,చిన్నక్కలు అందరూ పీకల్లోతు ప్రేమించేసిఉంటారు కృష్ణ,కృష్ణంరాజు కూడా కాదు. వీళ్ళందరినీ ఎప్పుడో ప్రేమించి ఉంటారు. ఆయినా నాకీ ఈ ముసలి టేస్ట్ ఏమిటీ ? చక్కగా చిరంజీవి , తర్వాత తర్వాత వచ్చిన వెంకటేష్,నాగార్జున లు ఉండగా .. అని విరక్తి తెచ్చుకుని అయినా ఉత్తరాది హీరో రాజేష్ ఖన్నా ఉండగా వీళ్ళందరూ నాకెందుకు ? అని తిరస్కారంగా ఓ చూపు చూసి. పాట మీద మాత్రమే మక్కువ పెంచుకుని ..అబ్బా ..ఇంత చక్కని పాటని ఆ రామకృష్ణ గారు బుగ్గన కిళ్ళీ పెట్టుకుని మరీ పాడినట్టున్నారు.అయినా కూడా చాలా బావుంది,నాకు నచ్చేసింది అనుకుంటూ వినడానికి ఇష్టపడిపోయాను.
ఇప్పుడు you tube లో ఈ చక్కని పాటని చూస్తూ అయ్యయ్యో ! శోభన్ బాబుని Old Man అని ప్రేమించకుండా వదిలేసానే అని బాగా ...గా ...ఆ.ఆ.. బాధపడుతూ స్క్రీన్ మీద చూస్తూ తృప్తి పడుతూ ఉంటాను. అయినా ఈ శారద గారేమిటండీ.. శోభన్ లాంటి సోగ్గాడ్ని ఎన్ని సినిమాల్లో ఆమె చుట్టూ తిప్పుకుంటుంది అని ఈర్ష్య కూడా .. ఏదైతేనేం ..ఈ పాట వినడం యవ్వన వీచికపై ..ఓ మధుర భావం . ఇప్పటి సరదా రాత ఇది . పాట మీకూ నచ్చుతుంది ..ఓ చూపు చూసేయండి మరి .
నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే
చలిగాలి తొలిమబ్బు పులకించి కలిసే
మనసైన చిరుజల్లు మనపైన కురిసే
దూరాన గగనాల తీరాలు మెరిసే
మదిలోన శతకోటి ఉదయాలు విరిసే
పరువాల బంగారు కిరణాలలో
కిరణాల జలతారు కెరటాలలో
నీవే నేనై ఉందాములే
నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే
ఏనోములో నిను నా చెంత నిలిపే
ఏ దైవమో నేడు నిను నన్ను కలిపే
నీ పొందులో ప్రేమ నిధులెన్నో దొరికే
నీతోనే నా పంచ ప్రాణాలు పలికే
జగమంత పగబూని ఎదిరించినా
విధి ఎంత విషమించి వేధించినా
నీవే నేనై ఉందాములే
నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే---
సాహిత్యం :-సి. నారాయణ రెడ్డి,
గళమాధుర్యం: రామకృష్ణ,సుశీల,
స్వరాలు సమకూర్చినవారు : చక్రవర్తి
చిత్రం : ఇదా లోకం (1973)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి