“ఈస్తటిక్ సెన్స్” అనేది ఈ కథాసంపుటిలో ఒక కథ కు శీర్షిక మాత్రమే కాదు కథా సంపుటి పతాక శీర్షిక మరియు కథలన్నింటికి గల విశేషణం అని నా భావన.
సౌందర్య భావం మనకు ఏది అందంగా ఉంటుందో తెలియజేసినట్లుగా, మనిషి లోని నైతిక భావం మంచి చెడులను విచక్షణా జ్ఞానంతో గ్రహించి పదుగురిలో మెలగడమూ, మనిషిగా మనుగడ సాగించడమే “ఈస్తటిక్ సెన్స్”
కథ ను అల్లడం కథ చెప్పడం అనేది ఒక కళ.
ఈ కథల సౌందర్యం నాణ్యత వాటి ఆకృతి లోకి వొంపడానికి సాదృశ్యంగా మలచడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను.కొన్ని విన్నవి కొన్ని కన్నవి. కొన్ని సత్యాల్లా అనిపించే కల్పనలూ కల్పనల్లా భావించే సత్యాలు, కొన్ని ఊహలు మరికొన్ని కలలు. అన్నీ కలిపి యీ కథలు. ఈ అక్షర ప్రవాహంలో యేవి ఆల్చిప్పలు ఆణిముత్యాలు అన్నది గుర్తించగల్గినది పాఠకులే!
నేను యీ అముద్రిత కథల ప్రచురణ గురించి నా ఆలోచనను పంచుకొన్న వెంటనే స్పందించిన 14 మంది సహ రచయితలకు వారి విశ్లేషణ కూ గౌరవ అభివాదములు హృదయపూర్వక ధన్యవాదాలు.
పుస్తకం కొఱకు సంప్రదించండి రచయిత ను.
- వనజ తాతినేని.
ఈ చిత్ర రూప కల్పన: మాగంటి వంశీ . వారికి ధన్యవాదాలు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి