గాలి లా నిత్యం సంచరించే మనుషులు
అనుకోని అతిథుల్లా విచ్చేస్తారు
రోజువారీ సాధారణ జీవితాన్ని భగ్నం చేస్తారు
వారిని వెళ్ళమని అనలేము
వుండిపొమ్మని చెప్పలేము
ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లా ..
అప్రమేయంగా భరిస్తూనే వుంటాము.
నావ రేవును వొదిలేదాకా..
వొదిలేసాక మనం
పూరించలేని ఖాళీ గా మిగిలిపోతాం
ఒంటరి రేవులా ..
(కవిత్వీకరించే అనుభూతి జారిపోయింది అనుకున్నా! మిగిలివుందని 😘)
చిత్రం: అమరావతి రేవు. గత ఆదివారం సందర్శించాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి