9, డిసెంబర్ 2023, శనివారం

ఈస్తటిక్ సెన్స్ కథలపై రివ్యూ

 


ఇలాంటి  రివ్యూ లను చదివినప్పుడు రచయితకు కలిగిన  ఆనందంతోపాటు బాధ్యత పెరిగినట్లు అనిపిస్తుంది.

అనూ అన్వేషి అనే పాఠకురాలు అందించిన రివ్యూ ఇది. ధన్యవాదాలు. 🙏

********************

ఈ రోజు ఈ పుస్తకం ఇలా post చేసుకుంటున్నాను అంటే దానికి కారణం స్వాతి పంతులగారి youtube channel-లో బయలు నవ్వింది అనే కథ వినడం. అదే మొదలు వనజ తాతినేని అనే రచయిత గురించి మరియు వారి పుస్తకాల గురించి తెలియడం.


బయలు నవ్వింది కథ విన్నప్పుడు సాధారణంగా ఇద్దరు మనుషులు మాట్లాడితే ఎలా ఉంటుందో అంతే సహజ, సరళమైన భాషలో కథ సాగుతుంది. వెంటనే రచయిత గురించి అన్వేషిస్తే.. "రాయికి నోరొస్తే" “కులవృక్షం” “ఈస్తటిక్ సెన్స్” కథా సంపుటాలు "వెలుతురు బాకు" కవితా సంపుటి ఇవిన్ని పుస్తకాలు దొరికింది. పుస్తకం శీర్షిక చూసి అన్ని కొనేద్దాం అనిపించిది. ఇలా పుస్తకాలు చూసిన ప్రతి సారి కుబేరుడు నాకు బంధువోమిత్రుడో అయితే బావుండు అనిపిస్తుందినాలుగు 


పుస్తకాల్లో ఈస్తటిక్ సెన్స్ పుస్తకం order పెట్టుకున్నానుఅంతే వేగంగా పుస్తకం చదవడం కూడా పూర్తయ్యిందిచదవక పోతే నిన్ను నిద్రపోనివ్వను అనేలా పుస్తకం వెంటాడిందన్నా తప్పు లేదు.. 

ఇంకొక్క కథ.. ఇదొక్క కథ అని కోరి కోరి చదివిన పుస్తకం.


ఇందులో మొత్తం 14 కథలున్నాయి. ప్రతి కథలో ముఖ్య పాత్ర స్త్రీ అయినప్పటికీ ఇవి feminism/ist కథలు కాదు. స్త్రీ తన వ్యక్తిత్వం కోసమో, స్వాతంత్య్రం కోసమో పొరాడే పోరాటం కథలు కావివి. ఈ 14 కథల్లో కూడా స్త్రీ తన హక్కు, అధికారం గురించి ఎదుటివారిని ప్రశ్నించదు, తన స్థానం కోసం ప్రాకులాడదు. తనకందాల్సిన గౌరవం కోసం ఎదురు చూడదు. బహుశా ఇవన్నీ అంశాలే నన్ను భలే ఆకట్టుకున్నాయి.


భర్త ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు, ఆసంబంధంలో వారికి కొడుకు ఉన్నాడు అనే నిజాన్ని ఇరవై ఏళ్ళు అతన్ని ఒకే ఒక ప్రశ్న కూడా అడగక వాతాపి జీర్ణం అనుకున్న ' ' యు ఎమ్


-చలనం లేని శరీరంలో ఇరుకున్న మనసుని ఊహ లోకంలో విహరించే స్వాతంత్రం ఇచ్చుకున్న ఊహ,


-భర్తతో పాటు పిల్లల్నుంచి కూడా విడాకులడిగే అమ్మ దేవకీ.


-ఔనా! కథలో ప్రేమరాహిత్య జీవితం నుంచి మీనమ్మ కనుకున్న మార్గాన్ని చలం ఇప్పుడు ఉండి చూడాల్సిందే అని ఎంత బలంగా అనిపించిందో..


-అందం అనేది బ్రతికే విధానంలో, ఆలోచించే తీరులో, వ్యక్తిత్వంలో ఇమిడి ఉండాలి, plastic surgery, breast implant surgery- అనే మైథిలి.


-ప్రేమ వైఫల్యానికి ఆత్మహత్య చేసుకునే చిన్ని కథ ..చిట్టిగుండె.  polygamy relationship అనే విచ్చలవిడితనం మగవాడు ఎంచుకున్నట్టే స్త్రీ ఎందుకు ఎంచుకొరాదు అనే ప్రశ్నకు నీకేం తక్కువ చేసాను అనే ఎదురు ప్రశ్న వేసిన ఇరుక్కు బంధానికి వీడ్కోలు పలికే కరుణ దాకా ప్రతి కథ కదిలించి కనవరించెల చేసిందే..


ఇలా ఇందులోని 14 కథలు తనదే అయిన శైలిలో ఒక Modern philosophy వైపు అడుగులు వేపిస్తుంది. మన స్వేచ్ఛను మనమే ఎంచుకోవాలి. ఎవరినో ప్రశ్నిస్తే, బ్రతిమాలితే బలంగా ఇంకొన్ని సంకెళ్లు బిగిస్తారు, నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా పోరాడాల్సిన అవసరం లేదు బ్రతికితే చాలు అనే తత్వం నాకు చాలా నచ్చింది.


ఈ పుస్తకంలో ఇంకో surprise అంటే, ఇందులోని కథలకు మరి కొందరు రచయితలు వ్రాసిన విశ్లేషణ. వాటిని చదువుకున్నప్పుడు కథ ఇంకొంచెం భిన్నంగా అర్థం అవుతుంది, కొన్ని  feeling mutual అనిపిస్తుంది. కామెంట్‌లు లేవు: