"ఈ అక్రమ సంబంధాల అవసరమో , అన్ కండీషనల్ లవ్ అవసరమో నాకు లేదు. మీకు అంతగా ఇష్టం అయింది కాబట్టి పెళ్లి చేసుకుని రెండో భార్యగానో లేదా స్టెప్నీ మాదిరి గానో ఉంచుకుంటానంటారు ! అంతేగా ? మీ మగవాళ్ళ ఆలోచనలు ఎన్నటికి మారవు . ప్రేమో , వ్యామోహమో రెండిటికి తేడా తెలియదన్నట్లు బిహేవ్ చేస్తారు . మీ చేతుల్లో మైనం ముద్దగా మారేదాకా అనేక మాయమాటలు చెపుతారు మీకు కావాల్సింది దొరికాక మీ మోజు తీరిపోయాక శీతకన్ను వేస్తారు. ముందు రోజూ ఆడదాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు . తర్వాత తర్వాత పనుల వత్తిడి అంటూ వారానికి ఒకసారి దర్శనం ఇస్తారు, మరి కొన్నాళ్ళకి మోజు తీరిపోయి పూర్తిగా మరచిపోతారు . అందులో ఆయాచితంగా లభించే వొంక ని ఉపయోగిస్తారు, ఇంట్లో తెలిసి పోయింది, గొడవ ఎక్కువైపోయింది అంటూ తెర దించేస్తారు. అంతకి మించి క్రొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి! విని నా నిర్ణయం చెపుతాను" అని నిలబెట్టి దులిపేసింది . కుముద అలా మాట్లాదగలదని ఊహించని సురేష్ అవాక్కైపోయాడు ఆ ఆవేశంలోనే అతనికి ఇంకొన్ని కఠోర సత్యాలు చెప్పింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి