నా కళ్ళు పచ్చబడ్డాయి అన్నాను..నా మిత్రురాలితో.."అమ్మో.. జాండీస్ ఏమోనే! వెంటనే హాస్పిటల్ కి వెళ్ళు" అంది. నేను ..హే! అది కాదులే అన్నాను..మరి ఏమిటో..చెప్పు? లోకానికి మొత్తానికి పచ్చకామెర్లు వచ్చాయా.?లేక.. ఓ కవి గారు అన్నట్లు భూమికి ఆకు పచ్చరంగు వేశారా!? చెప్పు తల్లీ.. చంపక అని తొందర చేసింది. "ఏముందే.. తల్లి.. నాకు.. అబ్బాయి పుట్టి బోలెడు ఖర్చు చేయిస్తున్నాడు.. ఒంటినిండా గాలి చొరబడకుండా బట్టలు వేసుకోవాలంటాడు.ఇప్పటి ఆడపిల్లలని చూడు..బట్టలు వేసుకోవడంలో.. ఎంత పొదుపరులో.!? మా ప్రక్కింటి ఆవిడ లాగా..అమ్మాయి 9 వ తరగతిలో ఉండగానే..ఇంటర్ మీడియట్ చదువుకి కాలేజ్ కి వెళ్ళేటప్పుడు రోజుకొక డ్రెస్ వేసుకుని వెళ్లాలని..అరలుఅరలుగా కొత్త డ్రెస్ లు పేర్చి పెట్టాలని తెలియదు కదా..అందుకే ఇప్పుడు బోలెడు అనుకోని ఖర్చు" అన్నాను.
నేను ఏం చెపుతున్నానో.. తేలికగానే అర్ధం చేసుకుంది నా..స్నేహితురాలు.చెప్పు.. "నీ దండయాత్ర దేనిపైన" అంది. "నీపై కాదులే'" అని నేను నవ్వి..ప్రొద్దున్నే 8.30 కో.. సాయంత్రం 4.30 కో మన బెజవాడ బస్సు స్టాప్స్ లోకి వెళ్లి చూడు. రంగు రంగు సీతాకోక చిలుకల్లా అమ్మాయిలు.. ఎన్ని వెరైటీ.. డ్రస్సులో" అన్నాను. "వాళ్ళని చూసేగా..నీ కళ్ళు పచ్చబడింది" అంది. "అమ్మయ్య క్యాచ్ చేసావు అన్నమాట.". అన్నాను.
నిజంగా.. డ్రస్సు కోడ్ పెట్టి కాలేజ్ ల యాజమాన్యం మంచి పని చేసింది. లేకపోతే.. ఆడపిల్లలు పోటీలు పడి మరీ..రోజుకొక సరిక్రొత్త డ్రస్సు కావాలని తల్లుల ప్రాణాలు తీసేవారు.అమ్మలు ఏం తక్కువ కాదు లెండి. అమ్మాయిలకి కావాలని ఫిజిక్ టైట్ డ్రస్సులు.. దగ్గరుండి మరీ వివరంగా.. చెప్పి కుట్టిస్తున్నారు. ఒకప్పటి కాలం వేరు. ఇప్పటి కాలం వేరు. "అమ్మా! పైట నిండుగా కోప్పుకో..వంచినతల ఎత్తకు" అనే టైప్లో కాకపోయినా.. తగిన జాగ్రత్తలు చెప్పేముందు..మన పిల్లల వస్త్రధారణ ఎలా ఉంటుంది? అని తల్లి దండ్రులు ఆలోచించుకోవాలిసిన అవసరం ఉంది. పెద్ద తెర మీద.. ఆనక చిన్న తెర మీద కూడా.. అమ్మాయిల వస్త్రధారణ ఎంత ప్రొవొకింగ్ గా ఉంటుందో..కూడా గమనించకుండా.. ఉన్నామా!? తండ్రి-కూతురు,అన్న-చెల్లెలు,మామ-కోడలు ఇలా.. బంధుత్వాల మద్య ఆడపిల్లల వస్త్రధారణ ఎంత ఇబ్బందిగా.. ఉంటుందో..చెప్పలేం. ప్రపంచ సుందరి కాబోయే మామ(ఇప్పుడు మామ) ప్రక్కన,కట్టుకోబోయే వాడితో.. కల్సి..తెరమీద చేసిన డాన్స్ తో.. భారతీయ సంప్రదాయమే.. సిగ్గుపడిపోయింది. పెద్ద తెర సరే.. చిన్ని తెర పై కూడా.. ధారావాహిక కార్యక్రమాల్లో.. కూడా.. నటీమణిల వస్త్ర ధారణ ఏమి తక్కువకాదు. నాకు అప్పుడప్పుడు ఓ డౌట్ వస్తూ ఉంటుంది. నాకే ఇలా అనిపిస్తుందా!? చూసే అందరికీనా అని.. అందుకే ఫ్రెండ్స్ తో.. ఇలా.. ముచ్చట్లు పెడుతుంటాను.వాళ్ళు కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాక.. పర్లేదు.. నాకు మతి తప్పలేదు అనుకుంటూ.. ఉంటాను.
దృశ్య చిత్రీకరణలో..మన వాళ్ళు అందే వేసిన చెయ్యి అండీ!వీక్షకుల చూపు..ని.. ప్రక్కకి మరల్చకుండా ఎలా ప్రదర్శించాలో అలా ప్రదర్శించి.. ఆడవాళ్ళు.. సీరియల్స్ కి అంకితం అయ్యేటట్లు చేసిన వారు.. మగ దృష్టిని కూడా.. ఆకర్షించాలని తాపత్రయం కాబోలు అత్త పాత్రల డీప్ నెక్ సౌందర్యాలు, అమ్మాయిల దేహ సౌందర్యాలు.. తెగ చూపించి..భార్య-భర్తలు కూడా.. కలసి టీ.వీ. చూడకుండా..పుణ్యం కట్టుకుంటున్నారు. " ఏమే..ఆ.. సీరియల్స్ లో.. చూపించినట్లు..బట్టలు తొడగవద్దని నీకు ఎన్ని సార్లు చెప్పానే." అని తిట్టే భర్తని చూసాను. ఇప్పుడు పల్లెటూళ్ళకి కూడా.. ప్రాకిన లెగ్గిన్స్ మరో.. కోత్త పరిణామక్రమం. లంగా-ఓణీ,చీర పోయి చుడిదారులు వొచ్చే, అవి పోయి.. ఫేంట్-షార్ట్ వొచ్చే, అవి పోయి లెగ్గిన్స్-షార్ట్ వొచ్చే.. ఇంక్జా ఏమిటేమిటో..వొచ్చే..ఎన్ని ఫేషన్స్. నాకు ఎప్పుడూ.. ఫేంట్-చొక్కా ఏనా..అని..మా బుడ్డాడు గొడవండీ.. వాళ్లకి.. కొత్త డిజైన్లు కనిపెడితే బాగుండును కదా.. అని..ఓ.. తల్లి కోరిక.
శుభ్రంగా వొంటి నిండా బట్ట కట్టుకున్న వాళ్ళు కనపడక ఇంటా-బయటా..చిన్ని తెర మీద పెద్దతెర మీదా ఒకే రకంగా చూసి చూసి.. నా కళ్ళు పచ్చ బడ్డాయి...ఏం చేయను చెప్పు.. అంటూ.. ముగించాను. అవునే! చున్ని కూడా బరువైపోయింది. మెడకేగా అది అలంకారం. ఏమిటో..అంత వైపరీత్యం.. అంటుంది.
పిల్లలకి చెప్పలేని తల్లి దండ్రులకి వైపరీత్యం కాదే.. అందం అనేది.. వస్త్రధారణలో పూర్తిగా రాదు.అసలైన అందం ఆత్మగౌరవం అని ఈ.. ఆడపిల్లకి ఎప్పుడు అర్ధం అవుతుంది.వస్త్రధారణ సౌకర్యవంతంగా ఉండటానికి..ప్రాముఖ్యత ఇవ్వడం మరచి.. దేహ సౌందర్యాన్ని..బజారున పడేసి మరీ.. చిక్కులు కొని తెచ్చుకుంటున్న ఈ..కాలపు పిల్లలని చూస్తే.. జాలి వేస్తుంది.అబ్బాయిలకి..కామెంట్ చేసే అవకాశం వాళ్లే ఇస్తున్నారు అంటే..అమ్మాయిలకి కోపం వస్తుంది. మాకు నచ్చినట్లు డ్రస్స్ చేసుకునే హక్కు మాకు లేదా..!? వారి వస్త్రధారణ మమ్మల్నిరెచ్చగొడుతుంది..అని మేము వారిపై అఘాయిత్యం కి తలపడ్డామా?అని..ఆడపిల్లల వాదన.ఇది కాదనలేం.అసలు తేడా ఎక్కడుంది.. బాబోయి.. నాకేమి అర్ధం కావడం లేదు కానీ..తల్లిదండ్రులు..పిల్లల వస్త్రధారణ పట్ల శ్రద్ధ వహించాలి..అని మాత్రం ఖచ్చితంగా.. చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు చెప్పెరీతిలో చెబితే..వింటారు.మంచి-చెడు.. వివరించి చెబితే తప్పకుండా వింటారు..

4 కామెంట్‌లు:
meaningful post
చాలా చక్కని మాట అన్నారండి. పెళ్ళైన అమ్మాయిలు కూడా మా జబ్బలు చూడండి అంటూ తిరుగుతున్న రోజులివి. తన భార్య ఎంతో sexy గా ఉంది అని అందరూ అనుకోవాలనుకునేటువంటి ధర్మదారిద్ర్యంలోకి మన దేశం ప్రవేశిస్తోంది. నాకు ఎంతో బాధగా ఉంటోంది. తిరిగి, "నాకు కూతురు వద్దు మహప్రభో" అనుకునే రోజులు వస్తున్నాయి. ఈ సారి కట్నం వల్ల కాదు, కట్టుబాట్లు పోవడం వలన. ఛి!
well said buddy!
nijamE :) peLLinaa ammai facebook laanTi vaaTilO "u r sexy" anna comment ki "thnk u :) " anna reply coosi EmanaalO ardham kaadu
ammailu main ga anaDam coosE vaari dRShTi lO lOpam, ala evaru tappuga aalOcincaru, nuvvE ala aalOcistaavu ani
కామెంట్‌ను పోస్ట్ చేయండి