గత రాత్రి.. టీ.వి. చూస్తూ..చానల్స్ మార్చుతూ..నేను చూసిన కధనం క్రొత్తది కాకపోయినా..హృదయాన్ని కలచివేసేది.. ఆడ పుట్టుక పుట్టినందుకు..భయంతో.. వణికిపోయేస్థితి.ఆడ పిల్లలు పుట్ట కూడదు.పుట్టినా..వాళ్ళని కాపాడుకోవడం.. ఎంత కష్టతరం.!?
అడుగడుగునా సుడిగుండాలు..పసి మొగ్గలుగానే ఉన్నప్పుడు కాలరాచే మృగాలు, అమాయకత్వంని ఆసరా చేసుకుని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి కాసులకి..అమ్మే వాళ్ళు కొందరు, శరీరాలతో.. వ్యాపారం చేయించే కొందఱు.. కామా పిశాచి కోరలకి చిక్కి..ఈ.. జనారణ్యంలో.. వెలివేయబడిన ప్రాంతాల్లో.. చీకటి వికృత కోర్కెల తీర్చే..ప్ర్రాణం లేని సెక్స్ యంత్రాలు.. అంగడి బొమ్మలు. ఇంటి నుండి తప్పిపోయిన చిన్నితల్లులు, ప్రేమ పేరిట అమాయకంగా గడప దాటినా కన్నెపిల్లలు, వరకట్న పిశాచాలకి బలి అయిన ఇల్లాళ్ళు, పేదరికంతో..బాధపడే కుటుంబాలలోని స్త్రీలు.. ఇలా.. ఎందరో!
మన సమాజంలో.. వీళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్పు అనుకునే సభ్యసమాజంలో. మనం బ్రతుకుతూ.. మన మద్య ఉన్నవారిలో ఉన్న వికృతాలని కనిపెట్టలేని కళ్ళున్న కబోదిలం మనం.
ఇలా మోసగించబడి వేశ్యావాటికలో కూరుకుపోయిన కొంత మందిని రక్షించి వారి వారి ప్రాంతాలకి పంపేముందు..మా సిటీలో వారికి.. ఆశ్రయం కల్పించినప్పుడు మేము కొంత మందిమి కలసి ఒక సంఘ సేవిక వెంట రిహబిటేషన్ సెంటర్ కి వెళ్ళాను.
ఆకాశవాణికి ఒక శబ్ద చిత్రం చేయాలని ప్రయతించి.. వారి మాటలలో.. వారి గాధలన్ని విని.. మనసు వికలమై.. తీరని దుఖంతో ఆ పని చేయకుండానే వెనుదిరిగాను.. కొన్ని నెలలు నేను మనిషిని కాలేకపోయాను. అప్పుడప్పుడు.. నా దృష్టికి వస్తూనే ఉంటాయి ఇలాటి వార్తలు.
ఒక స్త్రీగా.. అవి వినడం కూడా భయం నాకు. నేను ఎప్పుడో.. చూసిన మానవుడు-దానవుడు చిత్రంలో..పాట, మల్లెపువ్వు చిత్రంలో ఎవ్వరో.. ఈ.. నేరాలను అడిగేవారు ఎవ్వరో.. పాట అప్రయత్నంగా గుర్తుకొస్తూ ఉంటాయి.డా..సి.నా.రె స్పందించి వ్రాసిన పాట.. ఎప్పుడు ఆ చిత్రం గుర్తుకు వచ్చినా కదిలి కదిలి ఏడుస్తాను. "అశ్వద్ధామ" స్వర కల్పనలో.. ఎస్.పి.బాలు పాడిన పాట అది.
ఎవరు వీరు ఎవరు వీరు..
దేశ మాత పెదవిపైన మాసిన చిరునవ్వులు..
మనసులేని పిడికిలిలో..న్లిగిప్డిన పువ్వులు..
ఎవరు వీరు ఎవరు వీరు.
ఆకలిలి అమ్ముడుపోయిన ..అపరంజి బోమ్మలు..
చెక్కిలి వన్నెలు చిరిగిన చిగురాకు కొమ్మలు..(ఎవరు వీరు)
పొరబాటుగా అబలలుగా పుట్టిన విదివంచితలు వీరు.
బుస కొట్టే కామాగ్నికి.. విసిరేసిన సమిధలు వీరు (ఎవరు)
కన్నేలుగానే పిల్లలుకన్న వింత తల్లులు..
రోమ్ముక్రింద మమత లను అణుచుకున్న పాలవెల్లులు. (ఎవరు)
కసిదాగిన కళ్ళు.. సల సల కాగిన కనీళ్ళు..
నవ్వలేక ఏడ్వలేక నిట్టూర్చే శవాలు..
నడిచే జీవచ్చవాలు..
ఎవరో..కాదు..వీరెవరో కాదు..
ఆ దేవుడు సృష్టించిన పడతులు..
ఈ.. మనిషే దిగజార్చిన పతితలు..
ఎవరో తెలుసా.. వీరెవరో తెలుసా..!?
మన రక్తం పంచుకున్న ఆడపడచులు..
మనం జారవిడుచుకున్న జాతి పరువులు..
ఈ..ఆడపడుచులు.. మన జాతి పరువులు.
వ్యాపార రాజధానిలో..
మనం జారవిడుచుకున్న జాతి పరువులు.
వారి పిల్లల చదువలకి.. ఆర్ధిక సాయం చేయడం తప్ప వాళ్ళ బ్రతుకులని మార్చలేని ఈ..వ్యవస్థలో.. "భూమిక" సంపాదకురాలు.. సత్యవతి గారి.. హెల్ప్ లైన్ కొంతమందిని అయినా అలాటి వారి బారిన పడకుండా కాపాడటం.. ఎంతైనా అభినంధనీయం.
మనసుకి స్పందన కల్గితే..స్పందించండి. మీ ఇంట్లో ఆడపిల్లలనే కాదు.. బయట వారి ఆడ పిల్లలని.. భద్రంగా.. కాపాడే ప్రయత్నం చేయండి.
ఆడ పిల్లలకి.. చుట్టూ ముంచుకొచ్చే ప్రమాదాల గురించి..అవగాహన కల్పించండి. రోడ్ యాక్సిడెంట్ ల కన్న ప్రమాదకరమైన విషవలయంలో.. మన ఆడ పడుచలని పడనీయకండి. ఈ.. పోస్ట్ చూసినంధులకు ధన్యవాదములు.ఈ రెండు పాటలు వినేయండీ!!
ఎవరువీరు ఎవరు వీరు -- మానవుడు -దానవుడు
ఎవ్వరో .. ఈ నేరాలను అడిగేవారెవ్వరో .. -- మల్లెపువ్వు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి