13, ఫిబ్రవరి 2011, ఆదివారం

హరి క్షేత్రంలో హరుని సేవలో

సదా హరుని సేవలో పులకించే యువ కెరటాలు 
ఓం నమః శివాయ నమః                                                     
ఒక వారం రోజులుగా.. నేను..బ్లాగ్ లోకం నుండి హటాత్తుగా మాయం అయ్యాను..ఎందుకంటే.. క్షేత్ర దర్శనం కోసం తిరుమల వెళ్ళాను..నాతో పాటు భక్త బృందం వందల మంది.6 రోజులపాటు ఇంటి ధ్యాస లేకుండా.. భక్తి పారవశ్యంతో పాటు ఎన్నో ప్రదేశాలని ఆసక్తితో..అచ్చెరువుతో..చూసి ఆనందపడ్డాను.. చాల విషయాలని సేకరించ గల్గాను. తెలుసుకోవాలనే ఉత్షాహం ఉన్నా సరిగా వివరించే వారు లేక కొంత నిరాశ.ఏమైతేనేం  నా.. యాత్రానుభవం మీతో పంచుకోవాలని..నా ఈ.. చిన్ని ప్రయత్నంలో..భాగంగా..మొదటిది..కపిల తీర్ధం గురించి..


మీలో చాలా మంది తిరుమలని దర్శించిన అందరు..ఈ ప్రదేశాన్ని..చూసి ఉంటారు.అయితే ..ఈ సారి నా.. అనుభవంలో సరిక్రొత్తగా చూడండి..ప్లీజ్!! మా మిత్ర బృందం అంతా కలసి కపిల తీర్ధం చూడటానికి వెళ్ళాం.దూరంగా.. ప్రవహించని తీర్ధం కొంచెం నిరాశ. ఏముంది? ఇక్కడ చూడటానికి.. అన్న నిరాశక్తత..లోనికి అడుగిడినాము. కపిల తీర్ధం శేషాద్రి పర్వత పాదాన నెలకొనిఉంది.. సస్యాద్రి పర్వత శ్రేణులలో గల 108 తీర్ధాలలో కపిల తీర్ధం ఒకటి. పర్వ దినాలలో.. ముక్కోటి,కార్తీక పౌర్ణమి.. రోజులలో..10 ఘటికల కాలంలో.. ఆ తీర్ధమందు స్నానండితే  ముల్లోకాలలోని తీర్ధాలన్నిటిలో.. స్నానమాడిన ఫలితం లభించి.. జననమరణాలు లేని.. సత్య లోకంలో ఉండే భాగ్యం కల్గుతుంది అని చెప్పారు.

ఆ మాటలు వింటూ.. ముందుకు నడుస్తూ.. తిరుపతి తిరుమల ప్రాంతాలలో ఎక్కడా కనబడని..పంచాక్షరి..షడక్షరి  కనిపించి నేను తెగ ఆనంద పడిపోయాను..ఆ క్షేత్రం హరుని క్షేత్రమట.క్షేత్ర పాలకుడు..శివుడు. హరి క్షేత్రంలో.. హరుని..కరుణా కటాక్షం భక్తులెల్లరిపై కపిల తీర్ధమై ఆశ్శీస్సుల  చిలకరింపులతో  పునీతులని చేసింది. పైన కన్పించే ప్రస్తుత  స్థితి లోని తీర్ధపు సరస్సులో.. కాళ్ళు కడుక్కుని తలపై భక్తిభావంతో.. కొంచెం నీరు చిలకరించుకుని అదే తీర్ధ స్నానం అనుకుని.. కపిలేశ్వర స్వామి.. ఆలయం అన్న సూచికని అనుసరిస్తూ.. వడివడిగా ఆడుగులు వేసాను అందరి కంటే ముందుగా.. ఎందుకంటే మేము వెళ్ళిన సమయం ప్రదోష కాలం.. ఆ సమయమందు శివ దర్శనం మంచిదని విన్నాను కనుక... ఆలయంలోకి  వెళ్ళక ముందే.. వళ్ళు గగుర్పబోడిచే.. శంఖా నాదం,డమరుఖ ధ్వని.. తాళాల సవ్వడి..తొ పాటు.. ఘంటా నాదం కర్పూర హారతి గాంచి వొడలు పులకరించిపోయింది.. ఏమి భాగ్యం అనుకున్నాను.

భక్తుల  తాకిడి వల్ల నేను స్వామి వారి సమీపంలోకి వెళ్ళలేక  అక్కడే నిలబడిపోయాను.. స్వామి వారికి  మళ్ళీ కర్పూర హారతి  ఇవ్వడం ప్రారంభమైనది.. మళ్లీ ధ్వనాలు.. ప్రారంభం .ఈ సారి ఆసక్తిగా చూసాను..నలుగురు యువకులు.. ఆ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు.. ఆరు నిమిషాలు పాటు..స్వామి వారికీ సేవ ఆగకుండా.. సాగింది..నాకు చాలా ఆశ్చర్యం కల్గింది. వాళ్ళని అభినందించడానికి హస్తమంధించాను..ఒకరు అందుకున్నారు..మరొకరు సున్నితంగా తిరస్కరించారు.. సర్వీసెస్ ఆన్ డ్యూటీ ! అని అడిగాను.. "నో"  అన్నారు..నాకు మళ్లీ ఆశ్చర్యం.. తాళాలు ని ఏమంటారో.. అ టైములో.. గుర్తు రాక ఆ ఇనుస్త్రుమేంట్ గురించి అడిగి తెలుసుకుంటూ.. వారితో.. మళ్లీ  మాట కలిపాను. స్వామిని  చూద్దామని వడి వడిగా వెళ్ళిన నాకు స్వామి కన్న వాళ్ళని చూడటమే.. సరిపోయింది.

స్వామి దర్శనం  చేసుకుని.. నందీశ్వరునుకి  నమస్కరించి.. కామాక్షి అమ్మవారిని దర్శించుకుని  అశ్వద్ధ వృక్షం,వేప చెట్టు క్రింద ఉన్న సుబ్రమన్యేశ్వరునికి నమస్కరించుకుని ప్రసాదం తీసుకోవడానికి వెళుతున్నప్పుడు ఆ యువకులు కనిపించారు..మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా !? అని అడిగాను .. వారు మొదట ఒప్పుకోలేదు..రెండు మూడు సార్లు పదే పదే అడిగిన పిమ్మట ఓ.కే.అన్నారు. వారి మాటలు ..ఇలా.. "ప్రతి రోజు ఇలాగే వచ్చి స్వామి వారికి సేవ చేసుకుంటాము..అది మాకు చాలా ఇష్టం. ఇది ఒక పని అని మేము భావించడం లేదు. ఇది మాకులభించిన  అదృష్టం.. అని సిమ్స్ లో  పని చేస్తూ రోజు స్వామి సేవకి వచ్చే "గోపి" చెప్పారు.

అన్నింటికన్నా శంఖం పూరించడానికి ఎక్కువ శక్తి కావాలి.. ఆపకుండా.. ఆరు నిమిషాలపాటు.. ఎంత..మంచి..ప్రయత్నం .. వావ్ !!!! అనుకోకుండా ఉండలేకపోయాం.యువతలో.. భక్తి ప్రపత్తులు లోపించిన ఈ కాలంలో.. వారిని  మరీ మరీ అభినందించకుండా ఉండలేకపోయాను.

అప్పుడప్పుడు.. విజయవాడ దుర్గామల్లెశ్వర  స్వామి వారి సన్నిధికి.. సేవకి వస్తూ ఉంటామని చెప్పారు..  ఇంకా.. క్షేత్ర మహిమ గురించి వివరించారు.  కపిల తీర్ధం పాతాళం నుండి.. పైకి వచ్చిన తీర్ధమని.. కపిలమహర్షి.. వెలిగించిన   జ్యోతి ఇప్పటికి.. వెలుగుతూనే ఉంటుందని..తీర్ధము,గుహలోని మూర్తి స్వరూపం. వెరసి.. ఈ క్షేత్రం పవిత్రత అనంతమని.. తెలుసుకుని..చాలా ఆనంద పడ్డాను. స్వామి వారి  మూర్తి ఇత్తడి లింగాకరమని..ఆలయం ప్రత్యేకంగా భాసిల్లే అనంత శోభానమయంని.. చెప్పిన పిమ్మట మరలా ఒకసారి  దర్శించుకోవాలని అనుకున్నాను కానీ  వీలు కుదరలేదు.. ప్రతి సోమవారం 4 .30 .. కి స్వామి వారి సేవ మొదలవుతుంది అట..ఎవరైనా..ఇది చదివి వెంటనే చూడాలనుకుంటే..అ సమయంలో..వెళితే.. ఎక్కువ సమయం గోపి బృందం వారి సేవ చూడవచ్చు.

ఇక నందీశ్వరుని చూడటానికి రెండు కళ్ళు చాలవు. అంతా సుంధర స్వరూపం కూడ.. ప్రతి ఒక్కరు చూడ వలసిన క్షేత్రమిది..స్నానం ఆచరించవలసిన తీర్ధం ఇది. భక్తి పారవశ్యంతో.. యువ కెరటాలు..మృదంగ,శంఖ ద్వనాలతో,తాళాలతో..కర్పూర హారతితో.. స్వామిని అర్చించడంని.. కన్నులారా చూడవలసిన క్షేత్రమిది.

తప్పకుండా.. చూసి.. "గోపి"  బృందానికి అభినందనలు అందించడం మరువకండీ!!! ఎందుకంటే.. ఎన్ని.. సంగీత పరికరాలు.. ఆధునిక పోకడలతో.. కొత్త ఒరవడిని సృష్టించినా  ఆధునిక పరికరాలకి అందని.. శబ్ద మంత్రం ప్రణవం. ఆ.. ప్రణవ మంత్రమే.. శంఖా నాదం. శంఖంని..  భక్తి ప్రపత్తులతో.. పూరిస్తేనే..సాధ్యం. ఒక్క శంఖా నాదం మీ ముంగిలిలో..మారుమ్రోగితే.. సోమయాగం చేసిన ఫలితం వస్తుందని.. విన్నాను..ఆ పుణ్యం ఏమో.. కానీ.. పవిత్రభావం అలముకుంటుంది . ఇది.. నా అనుభవం.

 "ఓం నమః శివాయ"..  

2 కామెంట్‌లు:

భారతి చెప్పారు...

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః

చక్కటి పోస్ట్.

వనజాగారు! ఇప్పుడే భక్తికెరటం వర్గంలో మీ పోస్ట్స్ చదివాను.
మీ పోస్ట్స్ అన్నీ నేను చదవలేదు. కానీ, చదివినంతలో వ్యక్తులపట్ల, వ్యక్తిత్వాలపట్ల, వ్యవస్థపట్ల మీకున్న సునిశిత పరిశీలన శక్తి అర్ధమైంది. అక్షరాలకి అందని ప్రజ్ఞ మీలో ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. నాకు వీలైనప్పుడంతా ఇక మీ పోస్ట్స్ అన్నీ చదువుతాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భారతి గారు.. మీకు మనసా ధన్యవాదములు. మీకు వీలైనప్పుడు.. నా బ్లాగ్ చూస్తూ ఉండండి. మీ అంత గొప్పగా నేను వ్రాయలేను కాని.. నా చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించిస్తూ ఉంటాను. అవే వ్రాస్తూ ఉంటాను. కొన్ని కథలు,కొన్ని కవితలు,కొన్ని వ్యాసాలూ.. అలా ..బ్లాగ్ ప్రయాణం సాగుతుంది.

మీ ప్రశంసకి మరీ మరీ ధన్యవాదములు.