ఒక మధ్య వయస్కుడు మరణించాడు.
అతని భార్య తనని అన్యాయం చేసి పోయాడు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. చూసిన వాళ్లకి అయ్యో పాపం..! అని అనిపించడం సహజమే కదా!
సరే తర్వాత జరగవలసిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోతుండగా .. మరణించిన అతని భార్య ఆకాశంలోకి లోకి చూస్తూ ముందు ముందుకు నడచి వెళుతుంది.. కొందరు ఆమెని ఆపడానికి ప్రయత్నిస్తున్నా ఆగకుండా ఆకాశంలోకి చూస్తూ తిరుగుతుంది.
ఆమెకి మతి చలించింది. సందేహం లేదు అనుకుని.. ఏమ్మా..ఏమిటీ వెతుకుతున్నావ్? అని అడిగారు.
అప్పుడు ఆమె అలా చెప్పింది.
భర్త అడుగు జాడల్లోనే నడవమని చెప్పారు కదా! నేను అలాగే నడుద్దామని మా వారి పాద ముద్రలు కోసం వెదుకుతున్నాను ఎంత వెదికినా కనబడటం లేదు. నేను ఏం పాపం చేసానో! అంటూ..మళ్ళీ తలబాదుకుని ఏడుస్తుంది.
ఇదంతా వింటున్న ఒకాయన ..ఇలా అన్నాడు.
మీ ఆయనకీ నీ మీద ప్రేమ ఎక్కువ లేమ్మా ! నువ్వు ఆయన వెంబడే నడుస్తావని అనుమానం వచ్చీ ఆ పాద ముద్రలు కనబడకుండా తుడిచేసుకుని వెళ్ళాడు అని చెప్పాడు.
అంతే నంటారా!? అని .. ఏమండీ ..మీరెంత మంచివారండీ ..అంటూ మళ్ళీ రాగం మొదలెట్టింది.
పాపం ..ఆయన అక్కడైనా సుఖంగా బతుకుతాడు.ఈమె పీడా లేకుండా అని ఒకరు రహస్యంగా అన్నారు.
అది వినబడిన ఆమె ఇలా అనుకుంది. పొతే పోయాడు. నేను ఇప్పుడైనా సుఖంగా బతుకాతాను అనుకుంది మనసులో రహస్యంగా.
(అయ్యో ! ఇలా పాద ముద్రలు వదలకండి. అనుసరిస్తే యమ డేంజర్ ).. ఈ వ్రాత సరదాకేనండోయ్ !

1 కామెంట్:
మరణం మోక్షం అంటారు ఇందుకేనెమో......ఇక్కడ ఇద్దరికీ పీడా విరగడ అయింది(మేము సరదాకే..!)
కామెంట్‌ను పోస్ట్ చేయండి