19, డిసెంబర్ 2012, బుధవారం

పాట.. పూదోట - గండు తుమ్మెద


హర్షాతిరేకంతో
నా..మనసు.. ఉప్పొంగినప్పుడు.. 
చిరుజల్లులా.. వచ్చి.. 
పులకరింపజేసేది....పాట.

మండుటెండలో..సైతం 
వెన్నెలవానలో..  తడుస్తున్నట్టు.. 
అనుభూతి.. కల్గించేది.. పాట 

నింగిలో..విహరిస్తున్నా
నేలమీద పయనిస్తున్నా
వాయు తంత్రాలు మీటి
రవళిoప  చేసేది.. పాట.

గాఢ  నిద్రలో
కలలసంధ్రపు..ఒడ్డున ఉన్న
నన్ను.. అలలా.. తాకి 
మేలుకోల్పేది.. పాట. 

ఎవరు.. పలకరించని..వేళ
మౌనపంజరంలో
నేను..బంధీనై.ఉన్నప్పుడు
పలకరిందేది 
మనసు పాడే..మౌనమైన..పాట

నేను.. అనుభవించే.. 
వేదనా..రోదనా నిరాదరణలో
వోదార్పునిచ్చేది  ..పాట.

అమ్మలా.. లాలించేది.. 
అణువణువునా.. సేధతీర్చేది.  

స్వరాల హరివిల్లు..తో.. 
రసరమ్య .గీతికా..వర్ణాలు.. తో..

జీవనాన్ని.. 
రంగుల..మయం ..చేసింది. ..పాట.. 

పాట.. పూదోటలో..
నేను..ఓ' గండు..తుమ్మెదని....


2 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

ఒకసారెప్పుడో నేనెలాంటి పాటలు వింటానని అడిగారు గుర్తుందా? పాట గురించి మీ మీ భావాలే నా అనుభవాలూనూ. నేనెలాంటి పాటలు వింటానో ఇప్పుడు మీకు తెలిసిపోయిందనుకుంటాను. చాలా బాగా వ్రాశారు వనజ గారు.

హితైషి చెప్పారు...

పాటంటే అందరికి ఇష్టమే.
మరీ ఇంత ఇష్టంగా చెప్పినవారిని మిమ్మల్నే చూసాను. బాగుంది.