4, డిసెంబర్ 2012, మంగళవారం

In ankhon ki masti ke (ఇన్ ఆంకోంకి మస్తీ కే) (600)




In ankhonki masti ke (ఇన్ ఆంకోంకి మస్తీ కే) పాట పరిచయం


ఉమ్రావ్ జాన్ (Umrao Jaan)

రేఖ ప్రధాన పాత్రగా నటించిన నవలా చిత్రం. 1899 వ సంవత్సరంలో మీర్జా హది రుస్వా రాసిన ఉమ్రావ్ జాన్ అడా ఆధారంగా 1981 లో ఈ సినిమా రూపొందింది. ఈ నవల ను తెలుగులో కూడా చదవవచ్చు. దాశరథి రంగాచార్య ఈ నవలను అనువదించారు. నిజం చెప్పాలంటే ఈ నవల చదవడం కంటే సినిమా చూడటం బాగుంటుంది.


లక్నో కోఠాలో, అమీరాన్‌కు ఉమ్రావ్ జాన్ అనే పేరు పెట్టారు. సంవత్సరాల తరువాత, ఉమ్రావ్ పెరిగి పెద్దదై, ఒక నిష్ణాతుడైన కవిగా, అలాగే ఒక అసాధారణమైన తవాయిఫ్‌గా కూడా ఎదిగింది.

తవాయిఫ్ అంటే .. సంగీత నాట్యకళ కవిత్వ కళలతో అందంతో ఆకట్టుకునే స్త్రీ అని అర్థం. వారు పెళ్ళి చేసుకోరు. మనసుకు నచ్చిన వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటారు. తవాయిఫ్ కి వేశ్యలకు చాలా తేడా వుంటుందని చరిత్రకారులు చెబుతారు. 


ఈ చిత్రంలో మనసును కట్టిపడేసే అందమైన పాటలు వున్నాయి. . రేఖ చార్మ్ కి తగిన పాత్ర. ఉమ్రావ్ జాన్ గా నటించిన ఆమె ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు . 'ఉమ్రావ్ జాన్' తెరపై ఒక కవిత్వం లాంటిది. నిర్మాత దర్శకుడు ముజఫర్ అలీ,  19వ శతాబ్దానికి చెందిన ఒక వేశ్య యొక్క సున్నితమైన  విషాద గాథను అద్భుతంగా చిత్రీకరించారు.

ఇన్ ఆకోంకి మస్తీ కే .. అనే ఘజల్ ని  ఆశా బోస్లే పాడారు. దిల్ ఛీజ్ క్యా హై అనే పాటకు ఆశా బోస్లే కు నేపథ్య గాయని గా పురస్కారం లభించింది. సంగీతం అందించిన ఖయ్యాం కి జాతీయ పురస్కారం లభించింది. 

ఈ పాట వినడానికే చాలా బాగుండటమే  కాదు చూడటానికి వేయి కళ్ళు వుండాలి. ముఖ్యంగా రేఖ అభినయాన్ని చూడటానికి. క్రింద లింక్ ఇస్తున్నాను. చూడండి.


**************


ఈ కళ్ళ ఆనందానికి మైమరచి పోయేవారు

 వేలమంది ఉన్నారు.ఈ కళ్ళతో ముడిపడిన వేలాది కథలు ఉన్నాయి. (2)


ఒంటరిగా ఉన్నది నువ్వు ఒక్కడివే కాదు, 

నా ప్రేమ అవమానానికి గురైంది. 

ఈ నగరంలో నీలాంటి ప్రేమికులు(పిచ్చివారు) వేల సంఖ్యలో ఉన్నారు.


ఈ కళ్ళ ఆనందానికి మైమరచి పోయేవారు వేలమంది ఉన్నారు.

ఈ కళ్ళతో ముడిపడిన వేలాది కథలు ఉన్నాయి


మేము మాత్రమే కళ్ళతో మద్యాన్ని వడ్డిస్తాము.

ప్రపంచంలో వేలకొద్దీ మద్యశాలలు ఉన్నాయి.


ఈ కళ్ళ ఆనందానికి మైమరచి పోయేవారు వేలమంది ఉన్నారు.

ఈ కళ్ళతో ముడిపడిన వేలాది కథలు ఉన్నాయి


మీరు ఈ నీలి ఆకుపచ్చ  కొవ్వొత్తిని  తుఫానుతో బెదిరిస్తున్నారు.

ఈ నీలి ఆకుపచ్చ కొవ్వొత్తికి వేలకొద్దీ చిమ్మటలు పట్టాయి.


ఈ కళ్ళ ఆనందానికి మైమరచి పోయేవారు వేలమంది ఉన్నారు.

ఈ కళ్ళతో ముడిపడిన వేలాది కథలు ఉన్నాయి


హిందీ సాహిత్యంం: 


इन आँखों की मस्ती के मस्ताने हज़ारों हैं 


इन आँखों से वाबस्ता अफ़साने हज़ारों हैं

इन आंखों... 


इक तुम ही नहीं तन्हा, उलफ़त में मेरी रुसवा

इस शहर में तुम जैसे दीवाने हज़ारों हैं 

इन आँखों... 


इक सिर्फ़ हम ही मय को आँखों से पिलाते हैं 

कहने को तो दुनिया में मयखाने हज़ारों हैं 

इन आँखों... 


इस शम्म-ए-फ़रोज़ाँ को आंधी से डराते हो 

इस शम्म-ए-फ़रोज़ाँ के परवाने हज़ारों हैं 

इन आँखों…








6 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

One of my most favorite songs. Thanks for reminding me this song again.

అజ్ఞాత చెప్పారు...

I less like movies

శ్రీ చెప్పారు...

వనజ గారూ!...ఆరు శతకాలు అలవోకగా పూర్తీ చేసారు....మరి తొందరగా సహ్శ్రానికి చేరాలని ...మాకో పెద్ద పార్టీ ఇవ్వాలని కోరుకుంటూ...మిత్రుడు...@శ్రీ

హితైషి చెప్పారు...

వండర్ఫుల్ పోస్ట్ వనజ గారు. ఇంకా ఇంకా ఎదుగుతూ ఒదిగి ఉండే మీరే మాకు ఆదర్శం.
మీ బిజీ షెడ్యూల్స్ లో కూడా బ్లాగ్ కోసం ఇంత సమయం కేటాయించడం అభినందనీయం.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆరువందలు టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు. సహస్రం టపాలు త్వరలో చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Jalataaru vennela gaaru.. Thank you.

@ kashtEphalE..maastaaroo..:) paata maadhuryam ardham anthe!!

Thank you very much.

@Sree gaaru...alaage..alaage!! Tappakundaa nandee!!

@Vaishnavi..Thank you very much!

@Bulusu gaaru.. Thank you very much Sir!!