20, డిసెంబర్ 2012, గురువారం

కన్నీటికి స్వేచ్చ


ఈ కళ్ళకి ఎంతటి బలీయమైన  కోరిక 
ఎవరినో చూడాలని..
ఈ చెవులు ఎంతగా తపించి పోయాయి
ఎవరిదో  ఎదసడిని వినాలని..
ఎన్ని ఘన  సమయాలు కరిగిపోయాయి
ఎవరినో చూడాలని ..
ఎంతగా కలవర పడుతుంది  హృదయం 
ఎవరి ప్రేమలోనో అనుభూతి చెందాలని.. 
ఎంతగా ఆరాట పడుతున్నాయి చేతులు 
ఎవరినో సృశించాలన్న ఆశతో..
ఎంతగా అలమటిస్తున్నాయి నాజూకైన  పాదాలు 
ఎవరితోనో కలసి ప్రేమదారులలో నడవాలని ..
ఈ నిరీక్షణకి  తెరదించి 
ఈ కన్నీటికి  స్వేచ్చని ప్రసాదించు తండ్రీ !!
ఇప్పుడిక ఆతను  రానే రాడు !!!!!11 వ్యాఖ్యలు:

హితైషి చెప్పారు...

కన్నీటికి స్వేచ్ఛ టైటిల్ చాలా బావుంది. ఒంటరిగా ఉన్నపుడు ఆస్వేచ్ఛ విహరిస్తుంది. తప్పకుండా సంతోషంగా ఆనందించాలి ఆ స్వేచ్ఛని.ఐ లైక్ ఇట్.

skvramesh చెప్పారు...

chala baagundandi

Priya చెప్పారు...

కన్నీటికి స్వేఛ్చ! మీ కవిత బావుంది. అప్పుడప్పుడూ నాక్కూడా అనిపిస్తుంటుంది కన్నీటికి స్వేఛ్చ ఉంటే ఎంత బావుండునోనని..

శ్రీ చెప్పారు...

ఎన్ని ఘన సమయాలు కరిగిపోయాయి
ఎవరినో చూడాలని ....సూపర్ లైన్స్...
చాలా బాగుంది కవిత వనజ గారూ!...@శ్రీ

వనజవనమాలి చెప్పారు...

వైష్ణవి.. మనసారా ఏడవడానికి స్వేచ్చ ఉండదు కదా! దానికి ఎన్నో అభ్యంతరాలు. అలా పుట్టిందే ఈ కవిత. థాంక్ యు.

@skv రమేష్ గారు థాంక్ యు వేరి మచ్

వనజవనమాలి చెప్పారు...

ప్రియ గారు..కవిత నచ్చినందుకు ధన్యవాదములు. నేను చెప్పేది ఏమిటంటే.. దుఖాన్ని కూడా బంధించిన ఆమె కన్నులకి కన్నీరు కార్చే స్వేచ్చ కూడా లేనందుకు బాధ పడుతూ ..ఈ కవిత.

దుఖ భారం మోయడం అంత తేలిక కాదు.

@శ్రీ గారు కవిత నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు.

చెప్పాలంటే...... చెప్పారు...

అయ్యో అదేంటండి రాడు అనేశారు ....బావుంది చక్కగా

భారతి చెప్పారు...

మంచి భావవ్యక్తీకరణ. మదిలో భావాలకు తగ్గ మకుటం (కన్నీటికి స్వేచ్చ). చాల బాగుందండి.

geethanjali kosuru చెప్పారు...

ika raru ani telisi nappudu manasu ku inka ekkuva bela tanam kalugutundi, kannitini ape shakti ledhanipisthundhi,manasara badhanu, premanu panche aa dharalu kannullo nundi varshinche samayam
... manaku bandhanalu addugodalu avuthayi,,


maryadhaku ,, kattubhatluku longipotham,, maanasikha vyadhaku lonavutharu,, ituvantivi evariki rakudadhani korukuntunanu,,

వనజవనమాలి చెప్పారు...

గీతాంజలి కోసూరు ..గారు.. నా బ్లాగ్ ని ఇష్టపడి చదువుతున్నందుకు మరీ మరీ ధన్యవాదములు. కన్నీటికి స్వేచ్చ నచ్చినందుకు మరిన్ని ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

చెప్పాలంటే మంజు గారు, భారతి గారు మీ ఇరువురికి కన్నీటికి స్వేచ్చ నచ్చినందుకు మరిన్ని ధన్యవాదములు.